YCP Plenary Meeting: ఏం చేస్తారో తెలియదు. మహానాడుకు మించి విజయవంతం కావాలి. భారీగా జన సమీకరణ చేయాలి…వైసీపీ ప్లీనరీ విషయంలో నేతలకు అధినేత జగన్ ఇచ్చిన టాస్కు ఇది. అంతకు ముందే నియోజకవర్గాల్లో సన్నాహక ప్లీనరి నిర్వహించాలని సైతం ఆదేశించారు. దీంతో వైసీపీ శ్రేణులు మల్లగుల్లాలు పడుతున్నాయి.గత కొద్ది కాలంగా ప్రజల్లోకి వెళ్లడానికి అటు ప్రభుత్వ పరంగా, ఇటు పార్టీ పరంగా వైసీపీ నిర్వహిస్తున్న కార్యక్రమాలు వరుసగా విఫలమవుతూ వస్తున్నాయి. ‘గడప గడపకూ ప్రభుత్వం’ కార్యక్రమంలో ప్రజలు ఎక్కడికక్కడ నేతలను నిలదీశారు. ఆ తరువాత ‘సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర’ అటు ప్రజలను, ఇటు వైసీపీ కార్యకర్తలనూ ఏమాత్రం కదిలించలేకపోయింది. మరోవైపు ప్రజల్లో బహిరంగంగానే ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వీటన్నింటిని మించి గత నెలలో ఒంగోలులో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు విజయవంతం కావడం వైసీపీకి మింగుడు పడని విషయం. సరిగ్గా వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెల్లుబికుతున్న సమయంలో మహానాడు సక్సెస్ కావడంతో టీడీపీలో జోషన్ నెలకొనగా.. వైసీపీలో కలవరం ప్రారంభమైంది. మహానాడుకు దీటుగా వైసీపీ ప్లీనరీ నిర్వహించి సత్తా చాటాలని అధిష్టానం భావిస్తోంది.
జన సమీకరణకు..
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా జూలై 8, 9 తేదీల్లో, రెండు రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన వైసీపీ ప్లీనరీని విజయవంతం చేయాలని సీఎం జగన్ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. టీడీపీ మినీ మహానాడు తరహాలో నియోజకవర్గాల్లో ప్లీనరీ నిర్వహించి జనసమీకరణ చేయాలని ఆదేశించారు. కీలక నేతలకు బాధ్యతలు అప్పగించారు. జిల్లా ఇన్ చార్జి మంత్రులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అంతవరకూ బాగానే ఉంది కానీ ప్లీనరీకి ప్రజలను ఎలా రప్పించడమే వైసీపీ నేతలకు తెలియడం లేదు. బాహాటంగా కనిపిస్తున్న ప్రజా వ్యతిరేకతను తోసిరాజని ప్లీనరీని విజయవంతం చేసుకోవడం… మహానాడుకన్నా మిన్నగా నిర్వహించడం ఎలా అన్నదానిపై పాలకపక్ష నాయకత్వ శ్రేణులు మల్లగుల్లాలు పడుతున్నాయి.
Also Read: Attacks YCP Leaders On Officers: ఏపీలో అధికారులు, ఉద్యోగులపై ఆగని వైసీపీ దాడులు
కొత్త తరహాలో..
ఏటా నిర్వహిస్తున్న ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడి హోదాలో జగన్ కేవలం క్రియాశీలక కార్యకర్తలను ఉద్దేశించి మాత్రమే మాట్లాడేవారు. అయితే ఈసారి మహానాడులో తొలిసారిగా టీడీపీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఆ సభలో కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలను ఉద్దేశించి ఆ పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడారు. అదే తరహాలో ప్లీనరీ తొలిరోజున ప్రతినిధుల సభను, రెండో రోజున బహిరంగ సభను నిర్వహించాలన్న ఆలోచనలో వైసీపీ నేతలు ఉన్నారు. దీనిపై ఇంకా నిర్దిష్టంగా నిర్ణయం తీసుకోలేదు. దాదాపు ప్రతి ప్లీనరీ సందర్భంగా వర్షం పడుతోంది. దీనికి తోడు ఈసారి రుతుపవనాలు తొందరగా వస్తాయని వాతావరణ శాఖ సూచన చేసింది. వీటిని దృష్టిలో ఉంచుకుని బహిరంగ సభ నిర్వహణపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వైసీపీ నాయకత్వం అభిప్రాయపడుతోంది. పార్టీ అధినేత ఆదేశాల మేరకు ప్లీనరీని విజయవంతం చేయడంపై దృష్టి సారించిన పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్ తదితరులు గురువారం స్థల పరిశీలన చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ టోల్గేట్ సమీపంలో నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని చూశారు.
Also Read:Movie Tickets Online : ఏపీలో సినిమా టికెట్లు ఇక ఆన్ లైన్.. ‘సర్కారు వారి కమీషన్’ 2 శాతం
Recommended Videos
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Ycp plenary on july 89 cm jagans direction to the leaders
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com