Zakir Naik: మలేషియాలో జీవిస్తున్న జకీర్ నాయక్ ఇటీవల పాకిస్తాన్ పర్యటన మొదలుపెట్టాడు. ఈ క్రమంలో జకీర్ నాయక్ ను ఓ పాకిస్తాన్ అమ్మాయి నిలదీసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. మనీలాండరింగ్ కేసులో జకిర్ నాయక్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతడిని అరెస్టు చేయడానికి భారత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కరాచీ ప్రాంతంలో ఓ బహిరంగ సభ ఏర్పాటు చేయగా.. పష్తూన్ అనే అమ్మాయి నాయక్ ను నిలదీసింది..” నేను నివసించే చోట వ్యభిచారం, మాదకద్రవ్యాల వినియోగం, వంటి దుర్మార్గమైన పనులు జరుగుతున్నాయి. ఇస్లాం మతం ఉన్నచోట ఇలాంటివి జరగకూడదు కదా.. ఇలాంటి వాటి నిరోధానికి ముస్లిం పండితులు ( ఉలేమాలు) ఏం చేస్తున్నారు” అని ప్రశ్నించింది. దానికి జకీర్ నాయక్ సమాధానం చెప్పడానికి నిరాకరించాడు. ఆమె చెప్పిన ప్రశ్నను దాటవేస్తూ.. పురుషుల అనుమతి లేకుండా స్త్రీలు ఇంటి నుంచి బయటకు రాకూడదని… స్త్రీలు అలాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని” అతడు వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత ఆ యువతి సంధించిన ప్రశ్నకు సమాధానం చెప్పాడు. ” ఖురాన్ లేదా ఏదైనా ఇస్లామిక్ గ్రంథంలో ఇటువంటి వాటి ప్రస్తావనలేదని” అతడు పేర్కొన్నాడు.
వివాదాస్పద మత గురువు
జకీర్ నాయక్ భారతదేశంపై తన విద్వేషాన్ని పలు సందర్భాల్లో వెల్లగక్కాడు. సమయం దొరికినప్పుడల్లా వెల్ల గక్కుతూనే ఉంటాడు. భారతదేశంలో ముస్లింలు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారని.. భారత దేశంలో ఇస్లాం మత స్థాపన జరిగి తీరని ఆ మధ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పైగా గోమూత్రం అంత శుద్దమైనది కాదని.. గో మూత్రం తాగేవాళ్లు పాపాత్ములని పేర్కొన్నారు. మరోవైపు ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. జమ్ము కాశ్మీర్ పాక్ దేశంలో ఒక భాగమని, అది ఏనాటికైనా పాక్ దేశానికి చెందుతుందని వ్యాఖ్యానించాడు. అయితే ఇస్లాం మత వ్యాప్తిలో భాగంగా అతడు మనీలాండరింగ్ కు పాల్పడ్డాడని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అతడిని అరెస్టు చేయడానికి భారత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే కొంతకాలంగా అతడు మలేషియాలో తలదాచుకుంటున్నాడు. ఇటీవల పాకిస్తాన్లో పర్యటిస్తున్నాడు. ఇస్లాం మతవ్యాప్తికి కృషి చేస్తున్నాడు. ఈ సమయంలో ప్రజల నుంచి అతడు తీవ్ర ప్రతిఘటనలు ఎదుర్కోవడం విశేషం. అయితే జకీర్ నాయక్ గతంలో భారత్లో ఉగ్రవాదులు దాడులు చేసినప్పుడు.. వాటిని సమర్థిస్తూ వ్యాఖ్యలు చేయడం విశేషం.