https://oktelugu.com/

British Queen’s Car : బ్రిటీష్ రాణి కారు కొనుగోలు చేసిన ఇండియన్‌.. ఎవరో తెలుసా?

రాణి కోసం చేసిన ఒక ముఖ్యమైన మార్పు ఏమిటంటే సులువుగా కారు ఎక్కేందుకు, దిగేందుకు వెనుక భాగంలో గ్రాబ్‌ హ్యాండిల్స్‌ ఉంటాయి. కారులో చేసిన మార్పులను అలాగే ఉంచాలని భావిస్తున్నట్లు పునావాలా తెలిపాడు.

Written By:
  • NARESH
  • , Updated On : February 26, 2024 / 11:07 AM IST
    Follow us on

    British Queen’s Car : బ్రిటిష్‌ ప్రధానిగా భారతీయుడు రిషి సునక్‌ కొనసాగుతున్నాడు. తాజాగా బ్రిటన్‌ రాచరిక చరిత్రలో ఒక ప్రత్యేకమైన భాగాన్ని భారతీయ బిజినెస్‌ టైకూన్‌ సొంతం చేసుకున్నాడు. రాణి దివంగత క్వీన్‌ ఎలిజిబెత్‌–2 ఉపయోగించిన రేంజ్‌ రోవర్‌ కారును పునావాలా గ్రూపు మేనేజింగ్‌ డైరెక్టర్‌ యోహాన్‌ పునావాలా కొనుగోలు చేశాడు. దివంగత రాణి ఉపయోగించిన అదే రిజిస్ట్రేషన్‌ నంబర్‌ను ఈ కారు ఇప్పటికీ కలిగి ఉంది.

    – చరిత్ర ఉన్న కారు..
    యోహాన్‌ సొంతం చేసుకున్న కారుకు విశేషమైన చరిత్ర ఉంది. దాని రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఆలాగే ఉండడం గమనార్హం. సాధారణంగా రాజ కుంటుంబం నుంచి వెళ్లిపోయిన తర్వాత వాహనం నంబర్‌ మారుతుంది. కానీ, ఎలిజిబెత్‌–2 కారు నంబర్‌ మారలేదు. దీనిపై పునావాలా కూడా సంతోషం వ్యక్తం చేశాడు. ‘ఈ అద్భుతమైన ఆటోమోటివ్‌ చరిత్రను సంపాదించినందుకు సంతోషిస్తున్నాను’ అని పునావాలా చెపిపనట్లు ఎకనామిక్స్‌ టైమ్స్‌ పేర్కొంది. ఇక ఈ కారు ప్రత్యేకత ఏంటంటే.. దివంగత క్వీన్‌ ఉపయోగించిన అదే రిజిస్ట్రేషన్‌ నంబర్‌ OU 16XVH ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఇది పునావాలాకు అదనపు బోనస్‌గా మారింది.

    -రేంజ్‌ రోవర్‌ కారు..
    ఐవరీ అప్హోల్సరీతో లోయర్‌ బ్లూ పెయింట్‌ చేసిన 2016 రేంజ్‌ రోవర్‌ SDV8 ఆటోబయోగ్రఫీ LWB ఎడిషన్ కారు సుమారు 18 వేల మైళ్లు తిరిగింది. బ్రామ్లీ ఆక్షనీర్స్‌ వెబ్‌సైట్‌లో ఈ కారు రిజర్వు ధర 224,850 పౌండ్లు(రూ.2.25 క ఓట్లకుపైనే) ఉంది. అయితే ఈ వేలం ప్రక్రియ లేకుండానే పునావాలా ఈ కారును ప్రైవేటుగా కొనుగోలు చేశాడు.

    -కారు ప్రత్యేకతలు..
    ఈ రేంజ్‌ రోవర్‌ కారును క్వీన్‌ ఎలిజిబెత్‌–2 ప్రత్యేకంగా ఉపయోగించేందుకు రూపొందించారు. రహస్య లైటింగ్, పోలీస్‌ ఎమర్జెన్సీ లైటింగ్‌తోపాటు ప్రత్యేకమైన మార్పులు ఇందులో ఉన్నాయి. రాణి కోసం చేసిన ఒక ముఖ్యమైన మార్పు ఏమిటంటే సులువుగా కారు ఎక్కేందుకు, దిగేందుకు వెనుక భాగంలో గ్రాబ్‌ హ్యాండిల్స్‌ ఉంటాయి. కారులో చేసిన మార్పులను అలాగే ఉంచాలని భావిస్తున్నట్లు పునావాలా తెలిపాడు.