https://oktelugu.com/

Russia Crisis : దోపిడి దొంగ తిరుగుబాటు: అంతటి పుతిన్ వణికి పోతున్నాడు

ఇక ప్రిగోజిన్ గురించి చెప్పాలంటే తెలుసా ప్రభుత్వ అధికారిక విందులకు ఏర్పాట్లు చూసుకునేవాడు..పుతిన్ చెఫ్ గా పేరు పొందాడు. 1980లో దొంగతనం,

Written By: , Updated On : June 25, 2023 / 10:45 AM IST
Follow us on

Russia Crisis : మొన్నటిదాకా యూరప్ సామ్రాజ్యాన్ని, ఉక్రెయిన్ దేశాన్ని వణికించిన రష్యా.. ఇప్పుడు చిగురుటాకులా బెదిరిపోతోంది.. బాంబుదాడులతో అదిరిపోతోంది. ఇంతకీ ఆ దేశం మీద దాడి చేస్తుంది ఉక్రెయినో,లేదా మరో దేశమో కాదు. సాక్షాత్తు ఆ దేశ సైన్యమే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికి నిజం.. అయితే ఎంతో పటిష్టంగా ఉండే రష్యా సైన్యంలో ఇంతటి తిరుగుబాటుకు కారణం ఎవరు? వారిలో ఆగ్రహాన్ని రగిలించింది ఎవరు?
రష్యా సైనిక నాయకత్వంపై తిరుగుబాటు ప్రకటించిన వాగ్నర్ గ్రూప్ ఓ కిరాయి సైన్యం. ఈ గ్రూపులో మొత్తం నేరచరితులే ఉన్నారు. ఈ సైన్యాన్ని 61 సంవత్సరాల యెవెన్జీ ప్రిగోజిన్ నడిపిస్తున్నారు. ఇతడు ఎవరో కాదు ఉతిన్ పెంచిన కలుపు మొక్క. ఒకప్పుడు తను చేసిన నేరాలకు గాను జైలు శిక్ష అనుభవించి వచ్చాడు. అంతకుముందు రష్యా అధ్యక్షుడు పుతిన్ సన్నిహితుడిగా మారి ఆ దేశ విదేశాంగ విధానంలో చాలాకాలం కీలక పాత్ర పోషిస్తున్నాడు.
రష్యా పేరుకు అగ్రరాజ్యమైనప్పటికీ కిరాయి సైన్యం మీద ఆధారపడటం ఆశ్చర్యను కలిగిస్తుంది. ఇక యూరప్ సామ్రాజ్యం మీద కోపంతో ఉక్రెయిన్ దేశం మీద రష్యా యుద్ధానికి దిగింది.. వాగ్నర్ గ్రూపు పుతిన్ చెప్పినట్టు చేసింది.. ఉక్రెయిన్ పై అడ్డగోలుగా దాడులు చేసింది. అలాంటి వాగ్నర్ గ్రూప్ కాకలు తీరిన పుతిన్  కు చుక్కలు చూపిస్తోంది. ఇక కిరాయి సైన్యాన్ని నియమించుకునేటప్పుడు రష్యా ఎటువంటి నిబంధనలు పాటించకపోవడంతో దాని ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నది. పుతిన్ ఆదేశించడంతో ఉక్రెయిన్ పై యుద్ధానికి ప్రిగోజిన్ జైల్లో ఉన్న ఖైదీలను ఫ్రీగోజిన్ కిరాయి సైన్యంలో నియమించాడు.. వారితో యుద్ధం చేయించాడు. క్రూరమైన మనస్తత్వం ఉన్న వారు ఉక్రెయిన్ దేశంపై అరి వీర భయంకరమైన దాడులకు పాల్పడ్డారు. దారుణమైన అరాచకాలు చేశారు.
ఇక ప్రిగోజిన్ గురించి చెప్పాలంటే తెలుసా ప్రభుత్వ అధికారిక విందులకు ఏర్పాట్లు చూసుకునేవాడు..పుతిన్ చెఫ్ గా పేరు పొందాడు. 1980లో దొంగతనం, దోపిడీ కేసుల్లో 9 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. 1990లో పుతిన్ తో అతడికి పరిచయం ఏర్పడింది. 2000 సంవత్సరంలో పుతిన్ అధ్యక్షుడు అయ్యాడు. ఆ తర్వాత ప్రిగోజీన్ రెస్టారెంట్లు, హోటళ్ల వ్యాపారం చూసుకునేవాడు.  ఎలాంటి ఒప్పందం కుదిరిందో తెలియదు గానీ 2001 నుంచి ప్రిగోజిన్ పుతిన్ సన్నిహితుడుగా మారిపోయాడు. ఇక ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో.. తూర్పు ఉక్రెయిన్ లో రష్యా అనుకూల వేర్పాటువాద శక్తులకు మద్దతు ఇస్తూ 2014లో అతడు వార్తల్లోకి ఎక్కాడు. దానికి వాగ్నర్ అని పేరు పెట్టుకున్నాడు. అప్పట్లో ఎక్కువగా ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాలలో కార్యకలాపాలు సాగించేవాడు. అలా రష్యా తన పనుల కోసం కిరాయి సైన్యం మీద ఆధారపడేది.
ఇక బ్రిటన్ రక్షణ శాఖ అంచనా ప్రకారం వాగ్నర్ గ్రూపులో 50వేల మంది దాకా ఉన్నారు. ఈ గ్రూపు గత ఏడాది భారీగా నియామకాలు చేపట్టింది. వారందరూ కూడా నేర చరిత ఉన్న వాళ్ళు కావడం విశేషం. వాస్తవానికి రష్యాలో కిరాయి సైన్యం మీద నిషేధం ఉంది. కాగా వాగ్నర్ గ్రూప్ 2022లో ఒక కంపెనీగా ఏర్పాటయింది. సెయింట్ పీటర్స్ బర్గ్ లో తన కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఉక్రెయిన్ పై యుద్ధంలో వాగ్నర్ గ్రూపు కీలకంగా మారింది.. తూర్పు ఉక్రెయిన్ లో బఖ్ ముత్ నగరాన్ని స్వాధీనం చేసుకోవడంలో ఈ గ్రూపు కీలకంగా వ్యవహరించింది.. కనికరం అనేది లేకుండా ఉంటుంది అనే పేరు ఈ గ్రూపుకు ఉంది. ఇక ఈ తాజా పరిణామం పుతిన్ కు చెంపపెట్టు లాంటిదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.