World Building of the year: ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన భవనాలు ఉన్నాయి. కొత్త కొత్త ఆర్కిటెక్చర్‌తో వీటిని నిర్మిస్తుంటారు. అయితే ఈ ఏడాది వరల్డ్ బిల్డింగ్ ఆఫ్ ది ఇయర్‌లో ఆస్ట్రేలియాలోని డార్లింగ్టన్ పబ్లిక్ స్కూల్ రికార్డు సృష్టించింది. వరల్డ్ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్ 2024లో వరల్డ్ బిల్డింగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. తరగతి గదుల్లో కూడా సూర్యరశ్మి వచ్చేలా రంపం పళ్లు ఆకారంలో ఉండే రూఫ్‌ను నిర్మించారు. ఈ స్కూల్‌లో ఎటు వైపు చూసిన కూడా పచ్చదనమే ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఎంత మంది అయిన ఆడే పెద్ద బాస్కెట్ బాల్ కోర్టు ఉంటుంది. వీటితో పాటు కమ్యూనిటీ గార్డెన్ ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అందుకే ఈ ప్రపంచంలో ఎన్నో అందమైన నిర్మాణాలు ఉన్నా కూడా ఈ స్కూలే వరల్డ్ బిల్డింగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. మరి ఈ స్కూల్ ప్రత్యేకత ఏంటి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
ఈ స్కూల్ భవనాన్ని 1970లో నిర్మించారు. అయితే ఈ భవనం చాలా పాతది. దీంతో కొత్త ఆర్కిటెక్చర్ సాయంతో పాఠశాలను డిజైన్ చేశారు. ఇందులో ప్రీస్కూల్, కిండర్ గార్టెన్, ప్రైమరీ స్కూల్ ఉంటాయి. ఈ క్యాంపస్‌లో 500 కంటే ఎక్కువ మంది విద్యార్థులకు వసతి కల్పిస్తోంది. అయితే ఈ ప్రాథమిక పాఠశాల భవనంలో విద్యుత్ అవసరం లేదు. ఈ స్కూల్‌లో ప్రతీ గదికి కూడా సూర్యకాంతి వస్తుంది. అలా స్కూల్ నిర్మాణం చేపట్టారు. అయితే సూర్యకాంతి వల్ల ఎలాంటి వేడి ఉండదు. ఇందులో కమ్యూనిటీ హాల్, లైబ్రరీ వంటివి కూడా విద్యార్థులకు ఏర్పాటు చేశారు. అలాగే లోపల ఉండే వ్యక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బిల్డింగ్ నిర్మాణం చేపట్టారు. లోపల ఉండే వ్యక్తుల ప్రైవసీకి ఎలాంటి భంగం కలగకుండా ఉండేందుకు వంపులు తిరిగిన మెటల్ స్క్రీన్స్‌ను ఏర్పాటు చేశారు. అలాగే ఓపెన్ ఎయిర్ టెర్రస్‌ను కూడా ఈ స్కూల్‌లో ఏర్పాటు చేశారు. ఇలా విద్యార్థులకు అన్ని సౌకర్యాలు సహజంగా అందేలా ఈ స్కూల్ నిర్మాణం చేపట్టారు. ఈ కారణం వల్లనే ప్రపంచ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్‌లో వరల్డ్ బిల్డింగ్ ఆఫ్ ది ఇయర్ సంపాదించుకుంది.
ప్రపంచ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్‌లో క్రీడలు, రవాణా, ఆరోగ్యం, గృహనిర్మాణం వంటి మొత్తం 18 కేటగిరీల్లో అవార్డులు ఇస్తారు. 175 మంది ఫెస్టివల్ డెలిగేట్ల ప్యానెల్ వరల్డ్ బిల్డింగ్ ఆఫ్ ది ఇయర్‌కు అన్ని కేటగిరీలకు చెందిన విజేతలను తీసుకుని వారి నుంచి ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది నేషనల్ స్టార్ అబ్జర్వేటరీ ఆఫ్ సైప్రస్, పోలండ్‌లోని ప్రఖ్యాత బస్ స్టేషన్, టర్కీలోని సోలార్ పవర్ ప్లాంట్ వంటి భారీ ప్రాజెక్టులు మొత్తం 220 ఈ అవార్డు కోసం పోటీపడ్డాయి. అన్నింటిని కూడా వెనక్కి పెట్టి ఈ చిన్న పాఠశాల అవార్డును సాధించిందంటే గొప్ప విషయమనే చెప్పవచ్చు.