Sheikh Hasina: 2024 ఆగస్టులో బంగ్లాదేశ్‌లో జరిగిన రిజర్వేషన్ల ఉద్యమం.. అక్కడి ప్రభుత్వాన్ని కుప్పకూల్చింది. రిజర్వేషన్ల విషయంలో షేక్ హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా యావత్ దేశవ్యాప్తంగా యువత నిరసనలు తెలిపింది. దీనిని అణచివేసేందుకు షేక్ హసీనా ప్రభుత్వం యత్నించిందని, కాల్పులుజరిపి పలువురి మరనానికి కారణమైందని బంగ్లాదేశ్ కోర్టు భావించింది. ఇందుకు అప్పటి ప్రధాని షేక్ హసీనా కారణమని అభిప్రాయపడింది. విచారణ జరిపిన న్యాయస్థానం షేక్ హసీనాకు ఉరిశిక్ష విధించింది. అయితే అల్లర్లతో దేశం వీడిన షేక్ హసీనా ఏడాదిగా భారత్‌లోని రహస్య ప్రదేశంలో ఆశ్రయం పొందుతున్నారు.
Also Read: చంద్రబాబు రైతు బాట!
శరణార్థిని అప్పగించే అవకాశం లేదు..
భారత్–బంగ్లా మధ్య నేరస్థులను అప్పగించే ఒప్పందం ఉంది. కానీ రాజకీయ శరణార్థులను అప్పగించే ఒప్పందం ఏమీలేదు. అయినా బంగ్లాదేశ్ ప్రభుత్వం షేక్ హసీనాను అప్పగించాలని భారత్‌ను కోరుతోంది. అప్పగించకుంటే భారత్‌ను కూడా శత్రువుగా పరిగణిస్తామని బెదిరిస్తోంది. అమెరికా, పాకిస్తాన్ అండ చూసుకుని భారత్‌నే బెదిరించాలని చూస్తోంది. భారతదేశంలో శరణార్థిగా ఉన్న బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాను అప్పగించమని భారత్ స్పష్టంగా అధికారికంగా తెలిపింది.
బంగ్లాదేశ్‌కు సమాధానం..
బంగ్లాదేశ్ ఒత్తిడి చేయడంతో భారత్ స్పష్టంగా తెలిపింది. అక్కడి పరిణామాలను పరిశీలిస్తున్నామని పేర్కొంది. షేక్ హసీనాను అప్పగించే విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇది బంగ్లాదేశ్‌కు మరింత కోపం తెప్పిస్తుంది. ఈ నిర్ణయం పరిసర ఆసియాలో సాంఘిక, రాజకీయ పరిణామాలపై తీవ్రమైన ప్రభావాలను కలిగిస్తోంది. భారత్ ఈ విషయంలో సున్నితమైన డిప్లమాటిక్ భాషలో వ్యవహరిస్తూ, బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను సమగ్రంగా అధ్యయనం చేస్తోంది.
మన దేశంలో ఉన్న విదేశీ వ్యక్తుల భద్రతకు గట్టి ప్రాధాన్యత ఇవ్వడం భారత్ యొక్క కీలక విధానంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో పార్టీ రాజకీయాలు, అంతర్జాతీయ సంబంధాలను బట్టి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.