Washington Sundar: ఒకప్పుడు టెస్ట్ ఫార్మాట్లో సీనియర్లు అదరగొట్టేవారు. రోజుల తరబడి బ్యాటింగ్ చేసి సంచలనం సృష్టించేవారు. ప్రస్తుతం క్రికెట్ ను టి20 ఫార్మాట్ ఊపేస్తోంది. ఇలాంటి క్రమంలో స్థిరమైన ఇన్నింగ్స్ ఆడటం ప్లేయర్ల వల్ల కావడం లేదు. అందువల్లే వారు టెస్టులలో విఫలమవుతున్నారు. ఈ జాబితాలో టీమిండియా ప్లేయర్లు కూడా ఉన్నారు.
Also Read: బంగ్లాదేశ్ ఒత్తిడికి భారత్ తలొగ్గుతుందా.. షేక్ హసీనాను అప్పగిస్తుందా?
ఇటీవల దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన కోల్ కతా టెస్టులో యశస్వి జైస్వాల్ నుంచి మొదలు పెడితే కేఎల్ రాహుల్ వరకు అందరూ విఫలమయ్యారు. వాస్తవానికి వీరంతా కూడా గొప్ప ఆటగాళ్లు. కానీ దక్షిణాఫ్రికా బౌలింగ్ ను ఎదుర్కోవడంలో విఫలమయ్యారు. కోల్ కతా లాంటి పిచ్ ల మీద బ్యాటింగ్ చేయాలంటే ఓపిక చాలా అవసరం.. బంతులను సమగ్రంగా ఎదుర్కోవడం అత్యంత అవసరం.. ఇలా చేయడంలో టీమిండియా ప్లేయర్లు విఫలమయ్యారు. వారిలో మాత్రం వాషింగ్టన్ సుందర్ భిన్నంగా కనిపించాడు. దక్షిణాఫ్రికా బౌలింగ్ మొత్తాన్ని ఉన్నంతవరకు సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. దక్షిణాఫ్రికా ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించినప్పటికీ వాషింగ్టన్ సుందర్ అంత ఈజీగా దొరకలేదు. తొలి ఇన్నింగ్స్ లో 29, రెండవ ఇన్నింగ్స్ లో 31 పరుగులు చేశాడు . టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సుందర్ నిలిచాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కీలకమైన మూడవ స్థానంలో సుందర్ కేవలం నాలుగు సార్లు మాత్రమే బ్యాటింగ్ చేశాడు. అయితే ఆ సమయంలో అతడు ఆశించిన విధంగా బ్యాటింగ్ చేయలేదు. అయితే ఇందుకు విరుద్ధంగా ఈడెన్ గార్డెన్స్ లో మాత్రం సత్తా చూపించాడు.. కోల్ కతా లో తొలి ఇన్నింగ్స్ లో 82, రెండవ ఇన్నింగ్స్ లో 92 బంతులు ఎదుర్కొన్నాడు. 2021 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గబ్బా టెస్ట్ ద్వారా అతడు సుదీర్ఘ ఫార్మాట్లోకి అడుగు పెట్టాడు. 16 టెస్టులలో టీమిండియా కు ప్రాతినిధ్యం వహించాడు. తొలి టెస్ట్ లో అతడు స్థిరమైన హాఫ్ సెంచరీ చేశాడు..
ముఖ్యంగా 2021లో ఇంగ్లాండ్ జట్టుతో అహ్మదాబాద్ వేదికగా జరిగిన టెస్టులో రిషబ్ పంత్ , వాషింగ్టన్ సుందర్ సంచలనం సృష్టించారు.. టీమిండియా ఒకానొక దశలో 146/6 వద్ద ఉండగా.. అక్కడి నుంచి ఏకంగా 259/6 దాకా తీసుకొచ్చారు. ఏడో వికెట్ కు 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వాస్తవానికి ఆ మ్యాచ్లో సుందర్ తొలి టెస్ట్ సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో నిలిచాడు. గత ఏడాది జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ లో అతడు హాఫ్ సెంచరీ చేశాడు. ఇంగ్లాండ్ సిరీస్ లో మాంచెస్టర్ మ్యాచ్లో తొలి టెస్ట్ సెంచరీ సాధించాడు. ప్రస్తుత సౌతాఫ్రికా సిరీస్ లో కూడా అతడు అత్యంత సౌకర్యవంతంగా కనిపిస్తున్నాడు. గుహవాటిలో అతడు గనుక అదరగొడితే టెస్టులలో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటాడు.