Wife Kills Husband: మత పెద్దలు.. బంధువులు.. కుటుంబ సభ్యుల మధ్య వారిద్దరికీ వివాహం జరిగింది.. కష్టాల్లో, సుఖాల్లో ఆమెకు తోడుగా, నీడగా ఉంటానని అతడు ప్రతిజ్ఞ చేశాడు. వారి మత ఆచార ప్రకారం వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా భర్తకు చేదోడు వాదోడుగా ఉంటానని.. ఎలాంటి విపత్కర పరిస్థితిలోనైనా అతడి చేయి విడవనని ఆమె భాస చేసింది. కట్టుకున్న భార్య విషయంలో ఆ భర్త పద్ధతి గానే ఉన్నాడు. భార్య మాత్రమే దారి తప్పింది. చివరికి ఎవరూ చేయని దారుణానికి పాల్పడింది.
నేటి కాలంలో ప్రియుళ్ల అండ చూసుకొని కొంతమంది భార్యలు భర్తలను అంతం చేస్తున్నారు.. ఇందుకోసం రకరకాల స్కెచ్ లు వేస్తున్నారు. కనివిని ఎరుగని స్థాయిలో దారుణాలకు పాల్పడుతున్నారు. అయితే ఈ వివాహేతర సంబంధం మాత్రం భిన్నమైనది. అది జరిగిన తీరు సభ్య సమాజాన్ని తలవంపులకు గురిచేస్తోంది.. మేఘాలయ ఘటన నుంచి మొదలుపెడితే వర్ధన్నపేట వరకు ఇటువంటి దారుణాలు రోజుకో తీరుగా వెలుగులోకి వస్తున్నాయి. ఇవన్నీ కూడా నాశనం అవుతున్న వివాహ వ్యవస్థకు ప్రతిరూపంగా నిలుస్తున్నాయి.. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఓ సంఘటన సభ్య సమాజం ఏ తీరుగా నాశనమైందో కళ్ళకు కట్టింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్ షహార్ జిల్లా కాకోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వైరా బాద్షాపూర్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఆసిఫ్ అనే ఒక యువకుడు ఉన్నాడు. ఇతడికి కొంత కాలం క్రితం వివాహం జరిగింది. మొదట్లో ఆసిఫ్, అతని భార్య అన్యోన్యంగానే ఉన్నారు. ఆ తర్వాతే ఆసిఫ్ భార్య ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. గ్రామానికి చెందిన సలీం అనే యువకుడితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇక అప్పటినుంచి ఆసిఫ్ ను మానసికంగా ఇబ్బంది పెడుతోంది. శారీరకంగా వేధిస్తోంది. కట్టుకున్న భార్య అని ఆసిఫ్ ఇవన్నీ కూడా భరించాడు. కాలం గడుస్తున్న కొద్ది ఆమెలో మార్పు రాకపోగా.. మరింత రెచ్చిపోవడం మొదలుపెట్టింది. సలీంతో గడుపుతున్నప్పుడు ఆమె పెద్దల చిత్రాలు చూసేది. ఆమె ఉత్సాహాన్ని చూసిన సలీం.. మరింత ఉద్రేకంగా వ్యవహరించేవాడు. కొద్దిరోజులు అయిన తర్వాత ఆమె మరింత కొత్తదనాన్ని కోరుకుంది. దీంతో సలీం ఓ ఐడియా ఇచ్చాడు. దానికి ఆమె ఒప్పుకొంది. సలీం తనకు తెలిసిన మెడికల్ షాపు వ్యక్తి దగ్గర మత్తు మాత్రలు తీసుకొచ్చేవాడు. వాటిని ఆమెకు ఇచ్చేవాడు. ఆ మత్తు మాత్రలను ఆమె ఆసిఫ్ వివిధ రూపాలలో ఇచ్చేది. ఆ మత్తు మాత్రల ప్రభావం వల్ల ఆసిఫ్ అచేతనుడిగా మారిపోయేవాడు.. అతడు అలా ఉండగానే వారు సరస సల్లాపాలలో మునిగిపోయేవారు. దీనంతటిని వీడియో కూడా తీసేవారు.
ఒక రోజు మత్తు మాత్రల ప్రభావం ఆసిఫ్ మీద అంతగా చూపించలేదు. దీంతో అతడికి త్వరగానే మెలకువ వచ్చింది. అతడు చూస్తుండగానే వారు ఆ వికృత చేష్టలకు పాల్పడుతున్న నేపథ్యంలో అతడు తట్టుకోలేకపోయాడు. ఇదే విషయాన్ని తన కుటుంబ సభ్యులతో చెప్పుకొని బాధపడ్డాడు. చివరికి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆసిఫ్ చెప్పిన వివరాల ఆధారంగా అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి అనేక వివరాలు సేకరించారు. అసిఫ్ సతీమణి, సలీం, షారుఖాన్ అనే మరో వ్యక్తిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆసిఫ్ చనిపోయిన తర్వాత అతడి భార్య, సలీం, షారుక్ ఖాన్ పరారీలో ఉన్నారని తెలుస్తోంది.