Homeఅంతర్జాతీయంUS Women: అమెరికా మహిళలు అబార్షన్‌ మాత్రలు ఎందుకు భద్రపరుస్తున్నారు? ట్రంప్‌ భయమేనా?

US Women: అమెరికా మహిళలు అబార్షన్‌ మాత్రలు ఎందుకు భద్రపరుస్తున్నారు? ట్రంప్‌ భయమేనా?

US Women: అగ్రరాజ్యం అమెరికాలో అబార్షన్‌ అనేది కీలకమైన రాజకీయ సమస్యగా మారింది. 2022లో అబార్షన్‌ హక్కును అక్కడి సుప్రీం కోర్టు రద్దు చేసింది. అయితే ఈ ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న వేళ ఇది మళ్లీ కీలకంగా మారింది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇద్దరూ వారి వ్యక్తిగత నమ్మకాలు కలిగి ఉన్న ప్పటికీ ఈ సమస్యతో ఇద్దరూ ముడిపడి ఉన్నారు.

బైడెన్‌ మద్దతు.. ట్రంప్‌ వ్యతిరేకం..
అబార్షన్‌కు బైడెన్‌ వ్యక్తిగతంగా వ్యతిరేకి. తన క్యాథలిక్‌ విశ్వాసాలే ఇందుకు కారణం. అయితే అబార్షన్‌ ఎంచుకునే మహిళ హక్కుకు మద్దతు ఇస్తాడు. పునరుత్పత్తి స్వేచ్ఛను కాపాడే సమాఖ్య చట్టాల కోసం ఆయన ముందుకు వచ్చాడు. ఇక ట్రంప్‌ తన వైఖరిని తిప్పి కొట్టారు. మొదట్లో తనను తాను అనుకూల ఎంపికగా ప్రకటించుకున్నారు. కానీ, అధికారంలోకి వచ్చాక అబార్షన్‌ వ్యతిరేక భావనలు అవలంబించారు.

ఎన్నికల్లో ప్రభావం..
అబార్షన్‌ హక్కును రద్దు చేసిన నేపథ్యంలో వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో ఈ అంశం ప్రభావం చూపుతుందని అమెరికన్లు అభిప్రాయపడుతున్నారు. బైడెన్‌ విజయం గర్భస్రావం హక్కును పటిష్టం చేస్తుండగా, ట్రంప్‌ తిరిగి ఎన్నిక అయితే పునరుత్పత్తి హక్కుల భవిష్యత్తు గురించి అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఈ అనిశ్చితి మధ్య, చాలా మంది అమెరికన్‌ మహిళలు మిఫెప్రిస్టోన్‌ వంటి అబార్షన్‌ మాత్రలను నిల్వ చేయడం వంటి చురుకైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ మాత్రలను యాక్సెస్‌ చేయడం సవాలుగా, ఖరీదైనదిగా ఉంటుంది. కొందరు మెక్సికో నుంచి వీటిని కొనుగోలు చేస్తున్నారు.

హక్కును కాపాడడం కష్టమే..
అబార్షన్‌ చేసుకునే హక్కును సమర్థించే వ్యక్తులు ఈ హక్కును కాపాడుకోవడం కష్టతరంగా మారింది. నింధనలను సక్రమంగా ఎంచుకుకేందుకు ఒక్కో రాష్ట్రంలో పోరాడాల్సి ఉంటుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా అబార్షన్‌ చేయించుకోవాలా వద్దా అని ఎంచుకునే హక్కును నమ్ముకున్న వారు వదలడం లేదు. మహిళలు తమ సొంత శరీరాలపై, భవిష్యత్‌పై నియంత్రణ కలిగి ఉండడం ముఖ్యం. ట్రంప్‌ అధ్యక్షుడు అయితే అబార్షన్‌ మాత్రలు దొరకడం కష్టంగా మారుతుంది. అబార్షన్లకు అనుమతి ఇస్తే దేశంలో విచ్చలవిడితనం పెరిగుతుంది. మత భావన దెబ్బతింటుంది. అందుకే దీనిని ట్రంప్‌ వ్యతిరేకిస్తున్నారు. ఆ కారణంగానే మాత్రలను అమెరికా మహిళలను దాచిపెట్టుకుంటున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular