Donald Trump: అగ్రరాజ్యం అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. 2025, జనవరి 20న బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి పదవులు, కీలక కార్యవర్గ పదవులకు విధేయులు, సమర్థులను ఎంపిక చేశారు. ఇప్పుడు అమెరికాలో వలసలను ఎలా కట్టడి చేయాలి, యుద్ధాలను ఎలా ఆపాలి, అమెరికా సంపదను ఎలా పెంచాలి అనే అంశాలపై ట్రంప్ దృష్టి పెట్టారు. ఈమేరకు డోజ్(డిపార్ట్‌మెంట్ ఆఫ్ అమెరికా ఎఫీషియన్సీ)తో కలిసి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రంప్ కన్ను గ్రీన్‌లాండ్‌పై పడింది. దీంతో డెన్మార్క్ అప్రమత్తమైంది. గ్రీన్‌లాండ్‌ను కొనాలని ట్రంప్ భావిస్తున్నారు. అయితే డెన్మార్క్ మాత్రం తాము అమ్మకానికి సిద్ధంగా లేమని గ్రీన్ ల్యాండ్ ప్రధాని మ్యూట్ ఎజేడ్, ట్రంప్ ప్రకటనపై స్పందించారు.
రక్షణ బడ్జెట్ పెంపు..
తాజాగా డానిష్ రక్షణ మంత్రి ట్రాల్స్ ఎల్.పౌల్సన్ మాట్లాడారు. ఈ ప్రాంత రక్షణ బడ్జెట్‌ను రెండంకెల బిలియన్ డాలర్లకు పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంవైపు వచ్చే నౌకలను తనిఖీ చేయడం, రెండు లాంగ్ రేంజ్ డ్రోన్లను సమకూర్చుకోవడం, అదనంగా రెండు డాంగ్ స్లెడ్ బృందాలను ఏర్పాటు చేయడం వంటివి ఉన్నాయి. నుక్లోని ఆర్కిటిక్ కమాండ్‌లో సిబ్బందిని పెంచి బలోపేతం చేయనుంది. ఎఫ్–35 సూపర్‌సోనిక్ విమానాలను మోహరించేలా గ్రీన్‌లాండ్‌లోని మూడు పౌర విమానాశ్రయాలను అప్‌గ్రేడ్ చేయాలని భావిస్తోంది. గత కొన్నేళ్లుగా తాము ఆర్కిటిక్ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశామని పాల్సన్ తెలిపారు. ఇకపై ఈ ప్రాంతంలో మోహరింపులు బలంగా ఉంటాయని వెల్లడించారు.
డెన్మార్క్ పరిధిలో…
ఇదిలా ఉంటే గ్రీన్‌లాండ్ డెన్మార్క్ అటానమస్ రీజియన్‌గా ఉంది. ఇక్కడ అమెరికాకు చెందిన భారీ అంతరిక్ష కేంద్రం ఉంది. దీనిని తొలి ఎయిర్‌బస్‌గా పిలుస్తుంటారు. ఉత్తర అమెరికా నుంచి ఐరోపా వెళ్లే షార్ట్‌కట్ మార్గం గ్రీన్‌లాండ్ మీదుగా ఉంది. ఈ ద్వీపంలో అత్యధిక స్థాయిలో ఖనిజ సంపద ఉంది. గ్రీన్‌లాండ్‌ను తమ దేశంలో విలీనం చేసుకోవాలని అమెరికా ప్లాన్ ఇప్పటిది కాదు. 1860లోనే నాటి అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్ కూడా ఈ ప్రాంతంపై ఆసక్తి చూపారు. 2016లో అధ్యక్షుడు అయిన ట్రంప్ తన పదవీకాలం చివరన 2019లో గ్రీన్‌లాండ్ కొనుగోలు చేస్తానని ఆఫర్ ఇచ్చారు. కానీ దీనికి అప్పపట్లో డెన్మార్క్ నుంచి ప్రతీకూల స్పందన వచ్చింది. దీంతో నాడు ట్రంప్ ఆ దేశ పర్యటనను రద్దు చేసుకున్నారు.
గ్రీన్‌లాండ్‌లో ఇంకా..
ఇక ప్రపంచంలోని 13 శాతం చమురు 30 శాతం గుర్తించిన గ్యాస్ నిల్వలు గ్రీన్‌లాండ్‌లో ఉన్నాయి. అతి తక్కువ జనావాసం ఉన్న ప్రాంతంలో ట్రంప్ రియల్ ఎస్టేట్ వెంచర్లు చేపట్టాలని భావించారు. 21 లక్షల చదరుపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ ప్రాంతంలోకి కేవలం 56,500 మంది మాత్రమే జీవిస్తున్నారు. 75 శాతం భూభాగం మంచుతో కప్పబడి ఉంటుంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Why does trump want to buy greenland why does denmark not want to buy it what is the plan
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com