Trump Health: “ట్రంప్ బయటికి రావడం లేదు. ఆరోగ్యం బాగోలేదు. ఏమైందో తెలియదు. ఒకవేళ అత్యవసర పరిస్థితి ఏర్పడితే అధ్యక్ష స్థానంలోకి నేను వెళ్తానని వాన్స్ అంటున్నారు. సుంకాలు విధించి మొన్నటిదాకా వార్తల్లో ఉన్న వ్యక్తి ఇప్పుడు మరో విధంగా ఉంటున్నారు. ఆయనకు ఏం జరిగిందో ఎవరూ చెప్పడం లేదు. వైట్ హౌస్ వర్గాలు నిశ్శబ్దాన్ని పాటిస్తున్నాయి. ప్రపంచ దేశాలలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ట్రంప్ నిజంగానే బతికి ఉన్నారా.. లేదా జరగకూడనిది ఏదైనా జరిగి ఉంటుందా.. అందువల్లే విషయాన్ని దాస్తున్నారా” ట్రంప్ ఆరోగ్య గురించి మీడియాలో ప్రచారం ఇదిగో ఇలా సాగిపోయింది.
Also Read: తండ్రి కారణంగా రోడ్డు మీదకు వచ్చిన హీరో నాని ఫ్యామిలీ..మరీ ఇంత దారుణమా!
ట్రంపు ఆరోగ్యం గురించి క్లారిటీ ఇచ్చిన వారు ఎవరూ లేకపోవడంతో మీడియా తనకు తోచిన కథనాలను ప్రసారం చేసింది. ఒకానొక దశలో కొన్ని మీడియా సంస్థలు ట్రంప్ చనిపోయారని కూడా ప్రకటించాయి. అంతేకాదు ఇటీవల అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ చేసిన వ్యాఖ్యలను పదేపదే ప్రసారం చేయడం మొదలుపెట్టాయి. ఇంత జరిగిన తర్వాత అసలు ట్రంప్ ఎలా ఉన్నాడు.. ఎక్కడున్నాడు.. ఏం చేస్తున్నాడని ఆసక్తి అందరిలో పెరిగింది. చివరికి ట్రంప్ గురించి వైట్ హౌస్ నోరు విప్పింది. కీలక ప్రకటన చేసింది.
సోషల్ మీడియాలో అమెరికా అధ్యక్షుడు ఇకలేరు అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నా నేపథ్యంలో శ్వేత సౌదం స్పందించింది. ట్రంప్ ఆరోగ్యం గురించి కీలక ప్రకటన చేసింది. ట్రంప్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని.. వర్జిన్య రాష్ట్రంలోని గోల్ఫ్ కోర్స్ లో గోల్ఫ్ ఆడుతున్నారని అధికారికంగా ప్రకటించింది. వైట్ పోలో టీ షర్టు.. రెడ్ కలర్ మాగా క్యాప్, బ్లాక్ పాయింట్ ధరించారని పేర్కొంది.. “చూస్తున్నారు కదా మీరు.. ట్రంప్ ఎలా ఉన్నారు ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ట్రంప్ ఆరోగ్యం గురించి రకరకాల వదంతులు వినిపిస్తూనే ఉన్నాయి. వాటిని నమ్మకండి. అవన్నీ కూడా అబద్ధాలు. ఇదిగో మీకు కనిపిస్తున్న ఇది మాత్రమే నిజం అంటూ” వైట్ హౌస్ వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో ఉదయం నుంచి జరిగిన చర్చ మొత్తం గాలిలో కొట్టుకుపోయిన పేలపిండి సామెతగా మారిపోయింది.