Listeria Infection : ఏమిటీ లిస్టెరియా.. అమెరికాలో మరణాలకు.. దీనికి సంబంధం ఏంటి?

అమెరికా.. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలలో ముందు వరుసలో ఉంటుంది.. ప్రపంచ వ్యాప్తంగా అనేకమందికి ఉపాధి కల్పిస్తూ.. అవకాశాలను కల్పిస్తూ.. ప్రపంచ ఆర్థిక రంగాన్ని శాసిస్తూ ఉంటుంది. అందుకే అమెరికా ప్రపంచానికి పెద్దన్న లాగా మారింది.. గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచంపై అమెరికా పెత్తనం చెలాయిస్తోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : August 29, 2024 9:28 pm

Listeria Infection

Follow us on

Listeria Infection :  అమెరికా ఆర్థికంగా బలమైన దేశం. వైద్య పరంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశం. శాస్త్ర సాంకేతిక రంగాలలో సరికొత్త ఒరవడి సృష్టిస్తున్న దేశం. అలాంటి దేశంలో ప్రస్తుతం విపరీతంగా మరణాలు చేసుకుంటున్నాయి. అకస్మాత్తుగా చావులు సంభవిస్తున్నాయి. దీనికి ప్రకృతి విపత్తో, కొవిడో కారణం కాదు.. ప్రస్తుతం అమెరికాలో లిస్టేరియా అనే వ్యాధి ప్రబలుతోంది. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని వైద్యులు చెబుతున్నారు. కలుషితమైన ఆహారం తినడం వల్ల ఈ సమస్య తలెత్తుతుందని వివరిస్తున్నారు.. ఈ వ్యాధి ఎక్కువగా గర్భిణులు, శిశువులు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారిపై ప్రభావం చూపిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు.. ఫ్రిజ్ లలో కలుషిత వాతావరణం, చుట్టుపక్కల ఉండే పరిసరాలు అస్తవ్యస్తంగా ఉండడం వల్ల ఈ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.. పెంపుడు జంతువుల ద్వారా కూడా ఈ బ్యాక్టీరియా అటాక్ చేస్తుంది.

అంటువ్యాధి కావడంతో..

లిస్టేరియా అనేది అంటువ్యాధి కావడంతో చాలామంది దీని బారిన పడుతున్నారు. అమెరికాలో ఇప్పటికే వందల సంఖ్యలో మరణాలు చోటుచేసుకున్నాయి. పలు ప్రాంతాలలో ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. చనిపోయిన వారిలో ఎక్కువగా వృద్ధులు, చిన్నారులు ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాలలో గర్భిణులు కూడా కన్నుమూశారని వివరిస్తున్నారు. ఇలాంటి సమయంలో పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం, ప్రిజ్ లను శుభ్రంగా ఉంచడం, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను స్వచ్ఛంగా ఉంచుకోవడం, పెంపుడు జంతువులు ఉన్నవారు వాటికి ఎప్పటికప్పుడు స్నానం చేయించడం వంటి జాగ్రత్తల ద్వారా లిస్టేరియా వ్యాధిని నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. బ్యాక్టీరియా వల్ల లిస్టేరియా సోకుతుంది కాబట్టి.. సాధ్యమైనంతవరకు పరిశుభ్రంగా ఉండాలని వైద్యులు పేర్కొంటున్నారు. బయటి ఆహారానికి గుడ్ బై చెప్పి.. వీలైనంతవరకు ఇంట్లోనే వండుకోవాలని సూచిస్తున్నారు.. లిస్టేరియా వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో అమెరికా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పలు ప్రాంతాలలో ప్రత్యేకమైన వైద్య శిబిరాలు నిర్వహిస్తోంది. పరిస్థితి తీవ్రంగా ఉన్న ప్రాంతాలలో వైద్యులను ఎక్కువగా నియమించి..లిస్టేరియా వ్యాధిని నియంత్రించే ప్రయత్నం చేస్తోంది.. సాధ్యమైనంత వరకు బయటి ఆహారాన్ని తినకూడదని పౌరులకు సూచనలు చేస్తోంది.

బయట తినడం అలవాటు

అమెరికాలో సాధారణంగానే అక్కడి పౌరులకు బయట తినడం ఎక్కువగా అలవాటు.. అయితే ఇటీవల స్ట్రీట్ ఫుడ్ కల్చర్ అక్కడ పెరిగిపోయింది. పైగా వాతావరణం లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీనివల్ల కొత్త కొత్త రోగాలు వ్యాపిస్తున్నాయి. అందులో భాగంగానే ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అమెరికన్ పౌరులకు సోకుతోందని అక్కడి వైద్యశాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలని.. పరిశుభ్రతను ఎక్కువగా పాటించాలని సూచిస్తుంది.. శుభ్రమైన ఆహారాన్ని తీసుకోవాలని హితవు పలుకుతోంది.