Billionaire Lakshmi Mittal: ప్రపంచంలో అనేక దీవులు ఉన్నాయి. కొన్ని దీవులు ప్రమాదకరంగా ఉండగా, కొన్ని దీవులు అందంగా పర్యాటకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ దీవులపైనే ఆధారపడి కొన్ని దేశాలు మనుగడ సాగిస్తున్నాయి. అయితే తాజాగా దుబాయ్‌లోని ఓ దీవి ఇప్పుడు చర్చనీయాంశమైంది. అదే జుమైరా.. ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ మిత్తల్ బ్రిటన్‌లో పన్ను విధాన మార్పుల కారణంగా తన నివాసాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (దుబాయ్)కు మార్చి పెద్ద స్థాయిలో ఆస్తులు పంపించారు. బ్రిటన్ ప్రభుత్వం తీసుకొచ్చిన నాన్–డోమ్ పన్ను విధాన నిర్మూలన, ఎగ్జిట్ ట్యాక్స్, మాన్షన్ ట్యాక్స్ వంటి కొత్త భారం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో దుబాయ్‌లోని ఓ దీవికి తన మకాం మారుస్తున్నారు.
నయా ఐలాండ్.. విలాసవంతమైన నివాసం
దుబాయ్ నగరంలోని జుమైరా తీరప్రాంతంలో నిర్మిస్తున్న నయా ఐలాండ్‌లో లక్ష్మీ మిత్తల్ విలాసవంతమైన ఇళ్లు నిర్మించుకుంటున్నారు. సముద్రానికి సమీపంలో ఉన్న బీచ్ సదుపాయాలతో కూడుకున్న ప్రత్యేక ప్రైవేట్ ద్వీపంగా రూపొందాయి. ఈ ప్రాజెక్ట్ 2029 వరకు పూర్తి కానుందని అంచనా ఉంది.
నాన్–డోమ్ పన్ను విధానం..
భాతీయుడైన నవీన్‌మిత్తల్ సుమారు మూడు దశాబ్దాలుగా బ్రిటన్‌లో ఉన్నారు. తాజాగా యూకేలో నాన్–డోమ్ పన్ను విధానం ఆధ్వర్యంలో, విదేశాల నుంచి వచ్చే ఆదాయంపై పన్ను వసూలు చేయకపోవడం జరుగుతుంది. ఈ ప్రత్యేక శ్రమ నేటికి 226 సంవత్సరాలుగా అమలులో ఉండేది. అయితే, ప్రస్తుత ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేసి, విదేశీ ఆదాయాలపై పన్ను విధించనున్నది. దీంతో బ్రిటన్‌ను వీడాలని మిత్తల్ నిర్ణయించుకున్నారు.
దుబాయ్‌కి ప్రాధాన్యం..
బ్రిటన్‌ను వీడిన మిత్తల్ భారత్‌కు వస్తాడని కొందరు భావించారు. కానీ ఆయన దుబాయ్‌లో వారసత్వ పన్ను లేకపోవటం, కారుకి భద్రతా ప్రమాణాలు, పన్ను రహిత విధానాలు, సౌకర్యాలు మిత్తల్‌ను ఆకర్షించాయి. ఇప్పటికే దుబాయ్‌లో వివిధ విలాసవంతమైన ఆస్తులు సొంతం చేసుకున్నారు. అయితే, బ్రిటన్‌లో కెన్సింగ్టన్‌లో ఉన్న తన పాముల నేలగారి గార్డెన్స్‌లోని విలాసవంతమైన గృహాలు, నిధులు మాత్రం ఆయన వదలడం లేదు. బ్రిటన్‌లో ఈ స్థిరాస్తులు 300 మిలియన్ యూరోల విలువ కలిగి ఉన్నాయి.
నయా ఐల్యాండ్ ప్రత్యేకతలు..
లక్ష్మీ మిత్తల్ దుబాయ్‌లోని ‘నయా ఐలాండ్‘లో విలాసవంతమైన గృహాన్ని కొనుగొన్నారు. ఈ ప్రైవేట్ ఐలాండ్ జుమైరా తీరం దగ్గర ఉంది, ఇది సంపన్నుల కోసం ప్రత్యేకంగా నిర్మించబడిన ఓ లగ్జరీ జోన్. ఇక్కడి భవనాలు విస్తీర్ణం 21,000 నుంచి 48,000 చదరపు అడుగుల మధ్య ఉంటాయి. ఈ ప్రాజెక్టులోని విల్లాలు బీచ్ సౌకర్యాలతో కూడి ఉంటాయి. సముద్రం పక్కన విలాస నౌకలతో ఆభరణం చేసుకునే వాతావరణం ఏర్పడింది. మిత్తల్ కుటుంబం ఈ ప్రైవేట్ ద్వీపంలో రహస్యంగా ఇల్లు కొనుగోలు చేసింది. ఇక్కడ కొనుగోలుదారులు ముందుగా ఆసక్తి వ్యక్తం చేసే పత్రాన్ని సమర్పించాలి, దశలవారీగా చెల్లింపులు చేయాలి. దుబాయ్ ల్యాండ్ డిపార్ట్‌మెంట్ నాలుగు శాతం ఛార్జీ కూడా వర్తిస్తుంది. ఈ ఆస్తి యొక్క ప్రారంభ ధర సుమారు రూ.109 కోట్లుగా తెలుస్తోంది. 10 సంవత్సరాలకు గోల్డెన్ వీసా పత్రాలు కూడా ఇక్కడ ఉన్న ఆస్తి కొనుగోలుదారులకు లభిస్తాయి.