Homeఅంతర్జాతీయంHuman Heads : మూడు లక్షల సంవత్సరాల క్రితం మనుషుల తలలు ఎలా ఉండేవో తెలుసా?

Human Heads : మూడు లక్షల సంవత్సరాల క్రితం మనుషుల తలలు ఎలా ఉండేవో తెలుసా?

Human Heads : ఆసియా ఖండానికి మిగతా ప్రాంతాలతో పోల్చితే భిన్నమైన నేపథ్యం ఉంటుంది. ఈ ఖండంలో ఉన్న దాదాపు అన్ని దేశాలు చారిత్రాత్మకమైన వైవిధ్యాన్ని కలిగి ఉన్నవే. ఉదాహరణకు ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్ దేశంలో సింధు నాగరికతకు సంబంధించిన ఆధారాలు నేటికీ లభిస్తాయి. పాకిస్తాన్, ఇరాన్ దేశాలలో నేటికీ సింధు ప్రజల కట్టడాలు కనిపిస్తాయి. కాకపోతే వాటి పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడంతో వాటి ఆనవాళ్లు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. అప్పుడప్పుడు చరిత్రకారులు ఆ ప్రాంతాలను పరిశీలించడం.. ఆ ఆనవాళ్లను ఫోటోలు తీసుకోవడం.. కొన్ని అరుదైన వస్తువులను భద్రపరచడం వంటివి జరుగుతున్నాయి. పురాతన కాలం నాటి వస్తువులను భద్రపరచడం వల్ల.. భవిష్యత్ తరానికి నాటి నాగరికత తెలిసే అవకాశం ఉంటుంది. నాటి ప్రజల జీవన విధానాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు, కట్టుబాట్లు అవగతమవ్వడానికి ఆస్కారం ఉంటుంది.

చైనా దేశం భిన్నమైనది

ఆసియాలో మిగతా దేశాలతో పోల్చితే చైనా దేశం చాలా భిన్నమైనది. ఈ ప్రాంతాన్ని ఇతర ప్రాంతాల రాజుల కంటే, చైనా ప్రాంతానికి చెందిన రాజులే ఎక్కువకాలం పరిపాలించారు. అందువల్లే చైనా చుట్టూ బలమైన గోడను కట్టగలిగారు. మొదటినుంచి చైనాలో కమ్యూనిస్టు రాజ్యం ఉంది. దానికంటే ముందు భిన్నమైన రాజులు చైనా దేశాన్ని ఏలారు. అయితే నాటి రోజుల్లో రాజులు కిరాతకంగా ఉండేవారని.. తమకు ఎదురు తిరిగే వారిని అత్యంత దారుణంగా చంపేసేవారని చరిత్రలో ఉంది. అది ఎంతవరకు నిజమో తెలుసుకునేందుకు చరిత్రకారులు కొంతకాలంగా పరిశోధనలు చేపట్టారు. అయితే ఈ పరిశోధనలో విస్మయకర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. చైనా దేశంలో చరిత్రకారులు కొంతకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలో మూడు లక్షల కంటే ఎక్కువ సంవత్సరాల క్రితం మనుషుల అవశేషాలు పరిశోధకులు తవ్వకాలలో బయటపడ్డాయి. వీటిని చైనా హవాయి విశ్వవిద్యాలయం కాలేజీ ఆఫ్ సోషల్ సైన్సెస్ లోని మనోవా విభాగం ఆంధ్ర పాలసీ ప్రొఫెసర్ క్రిస్టోఫర్ జే. బే కనిపెట్టారు. గత 30 సంవత్సరాలుగా ఈయన ఈ పరిశోధనలో ఉన్నారు. తన బృందంతో కలిసి ఆసియాలోని మనుషుల పూర్వీకులపై అధ్యయనం చేస్తున్నారు. ఆయన అధ్యాయంలో భాగంగా హోమో జూలియన్సిస్ అనే పురాతన మనిషి జాతిని గుర్తించారు.. అయితే ఈ జాతిలో తల భాగం పెద్దదిగా ఉంటుందట. మిగతాదేహం చిన్నదిగా ఉంటుందట. అవయవాలు కూడా సాధారణ స్థాయిలోనే ఉంటాయట. అయితే నాటి రోజుల్లో మనుషులకు తలభాగం అంత ఎందుకు పెద్దగా ఉంది? అనే విషయంపై క్రిస్టోఫర్ పరిశోధనలు చేస్తున్నారు. ఒకవేళ ఈ పరిశోధనలో ఏవైనా కొత్త విషయాలు తెలిస్తే.. మనుషుల మనుగడకు సంబంధించి మరిన్ని ప్రయోగాలు చేసే అవకాశాలు లేకపోలేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular