https://oktelugu.com/

Bruce lee : బ్రూస్‌ లీ మరణం వెనుక నీరు.. ఇలా తాగితే మరణమేనట!

చివరికి ఆ నీరు వల్ల అతని మరణించారని శాస్త్రవేత్తలు అంటున్నారు. చనిపోయిన రోజూ కూడా బ్రూస్ లీ గంజాయి తాగి నీరు తాగారని చెబుతున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : August 31, 2024 / 08:10 PM IST

    Bruce Lee

    Follow us on

    Bruce Lee : హాలీవుడ్ సూపర్ స్టార్ అయిన బ్రూస్ లీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇతని గురించి ప్రపంచానికి తెలిసిందే. అయితే బ్రూస్ లీ అనారోగ్య కారణాలతో చిన్న వయస్సులోనే మరణించారు. ఒక విష ప్రయోగం వల్ల బ్రూస్ లీ మరణించాడని అనుమానాలు ఉండేవి. కానీ అతని మరణం వెనుక ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయని ఓ అధ్యయనంలో తేలింది. బ్రూస్ లీ సెరెబ్రల్ ఎడిమా అనే మెదడు వాపు వ్యాధితో మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఎందుకంటే అతను చనిపోయే సమయానికి మెదడు ఉబ్బిందని తెలిపారు. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వినియోగించడం వల్ల ఈ వ్యాధి చనిపోయారనే వైద్యులు తెలిపారు. కానీ బ్రూస్ లీ మరణానికి ఇది కారణం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంతకీ అతని మరణం వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన విషయాలేంటో మరి చూద్దాం.

    మార్షల్ ఆర్ట్స్ కింగ్ బ్రూస్ లీ తన 32 ఏళ్ల వయస్సులోనే చనిపోయారు. పెయిన్ కిల్లర్స్ అధికంగా వాడినందుకు తనకు సెరెబ్రల్ ఎడిమా వచ్చి చనిపోయారని వైద్యులు తెలిపారు. అయితే అతను చనిపోయిన 50 ఏళ్ల తర్వాత శాస్త్రవేత్తలు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిపారు. బ్రూస్ లీ హైపోనాట్రేమియా వల్ల చిన్న వయస్సులో చనిపోయారని తెలిపారు. ఎక్కువగా నీరు తీసుకుంటే శరీరంలో సోడియం స్థాయిలు కరిగిపోతాయి. దీంతో సోడియం లోపం వచ్చి .. మెదడులో వాపు ఏర్పడుతుంది. దీన్నే హైపోనాట్రేమియా అంటారు. బ్రూస్ లీ చనిపోయేటప్పుడు తన మెదడు బరువు 1575 గ్రాములు ఉందని వైద్యులు తెలిపారు. అంటే సాధారణ మానవుడు మెదడు బరువు కంటే బ్రూస్ లీ మెదడు బరువు ఎక్కువగా ఉంది. అయితే మార్షల్ ఆర్ట్స్ చేసే వ్యక్తి అధికంగా నీరు తాగడం వల్ల మరణించారని శాస్త్రేవేత్తలు తెలిపారు. బ్రూస్ లీ ఎక్కువగా నీరు తాగారు. కానీ అదే స్థాయిలో మూత్ర విసర్జన చేయకపోవడం వల్ల మరణించాడు.

    మనిషికి నీరు అనేవి చాలా అవసరం. కానీ సరైన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. కేవలం నీరే కాకుండా ప్రతి పదార్థాన్ని కూడా మితంగా మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా నీరు తాగితే బాడీ ఓవర్ హైడ్రేషన్ అవుతుంది. బాడీలో నీరు ఎక్కువగా ఉంటే మూత్రపిండాలు వాటిని బయటకు పంపలేవు. దీంతో బాడీలో సోడియం స్థాయి తగ్గి హైపోనాట్రేమియాకు దారితీస్తుంది. దీనివల్ల వాంతులు, తలనొప్పి, అలసట, మెదడు వాపు వంటివి వచ్చి చనిపోతారని శాస్త్రవేత్తలు అంటున్నారు. కాబట్టి రోజుకి 8 నుంచి 10 గ్లాసుల నీరు మాత్రమే తాగాలి. ఎక్కువగా నీరు తాగితే మెదడు వాపు వచ్చి మరణించవచ్చు. బ్రూస్ లీ ఎక్కువగా జ్యూస్‌లు, నీరు తీసుకునేవారు. అతను ఎక్కువగా బీ వాటర్ మై ఫ్రెండ్ అనే కోట్‌ను కూడా చెప్పేవార. చివరికి ఆ నీరు వల్ల అతని మరణించారని శాస్త్రవేత్తలు అంటున్నారు. చనిపోయిన రోజూ కూడా బ్రూస్ లీ గంజాయి తాగి నీరు తాగారని చెబుతున్నారు.