Homeఅంతర్జాతీయంIAF historic landing: మోదీ ముందు చూపు.. చైనా, బంగ్లాదేశ్‌ వెన్నులో వణుకు.. వైరల్‌ వీడియో

IAF historic landing: మోదీ ముందు చూపు.. చైనా, బంగ్లాదేశ్‌ వెన్నులో వణుకు.. వైరల్‌ వీడియో

IAF historic landing: ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత స్వశక్తి పెంచుకోవడంపై భారత్‌ దృష్టి పెట్టింది. : ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా సైన్యానికి అవసరమైన అత్యాధునిక ఆయుధాలను తయారు చేస్తోంది. ఇటీవల కేంద్రం బడ్జెట్‌ను కూడా లక్ష కోట్లు అదనంగా కేటాయించింది. మరోవైపు అత్యవసర పరిస్థితిలో విమానాలు ఎక్కడైనా దిగేందుకు వీలుగా జాతీయ రహదారులను నిర్మిస్తోంది. మూడేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించిన రహదారులపై విమానాల ల్యాండింగ్‌ విజయవంతంగా నిర్వహించింది. తాజాగా భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) అస్సాం మొరాన్‌లో ఎన్‌హెచ్‌ –127పై యుద్ధ విమానాల ల్యాండింగ్‌ ట్రయల్స్‌ విజయవంతం చేసింది. ఈశాన్య భారతదేశంలో మొదటి ఈఎల్‌ఎఫ్‌గా, సుఖోయ్, రాఫెల్‌ వంటి యుద్ధ విమానాలు ఇక్కడ నిలిచే సామర్థ్యం ప్రదర్శించాయి. ఇది దేశ రక్షణ వ్యవస్థకు కీలకం.

యుద్ధం, విపత్తులకు కోసం…
యుద్ధ సమయంలో ఎయిర్‌స్ట్రిప్‌లు దెబ్బతిన్నప్పుడు హైవేలను రన్‌వేలుగా దిగడానికి వీలుగా నిర్మించారు. అస్సాం 4.2 కి.మీ. భాగం 4–లేన్‌ రూపంలో నిర్మించారు. ప్రభుత్వ భవనాలు, సైనిక కార్యకలాపాలకు ఉపయోగపడుతుంది. ప్రధాని మోదీ నేరుగా హైవేపై ల్యాండ్‌ చేసి ప్రారంభించనున్నారు.

వ్యూహాత్మక కేంద్రం..
అస్సాం ఈశాన్య రాజకీయ, వ్యూహాత్మక కేంద్రం. చైనా, మయన్మార్‌ సరిహద్దుల సమీపంలో ఈ ఈఎల్‌ఎఫ్‌ యుద్ధ సామర్థ్యాన్ని పెంచుతుంది. విపత్తు సమయంలో రిలీఫ్‌ పనులకు కూడా ఉపయోగపడుతుంది. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఆధునికీకరణలో ఇదో మైలురాయి.

భారతదేశంలో 10కిపైగా ఈఎల్‌ఎఫ్‌లు రానున్నాయి. ఈశాన్యలో మొదటిది మొరాన్‌. స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసి ఆత్మనిర్భర్‌ భారత్‌కు దోహదపడుతుంది. రఫెల్, సుఖోయ్‌ వంటి భారీ విమానాలకు సరిపోతుంది. ఈ నిర్మిణంతో పొరుగున ఉన్న చైనా, బంగ్లాదేశ్‌తో యుద్ధం వస్తే ఇక్కడి నుంచే యుద్ధ విమానాలను పంపే అవకాశం కూడా ఉంటుంది. దీంతో శత్రుదేశాల్లో వణుకు మొదలైంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular