J D Vance : వాన్స్.. స్వీట్ పొటాటో లాంటి వ్యక్తి.. భర్త గురించి చెప్పుకుంటూ మురిసిపోయిన ఉష చిలుకూరి

ఉషతో వాన్స్ స్నేహితుడిగా ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అప్పుడు ఎలా ఉన్నాడు.. ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. తన జీవితంలో కలుసుకున్న అత్యంత ఆసక్తికరమైన వ్యక్తి వాన్స్ అని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించింది. వాన్స్ తన బాల్యంలో అనేక కష్టాలు పడ్డాడు. ఇరాక్ లో కఠినమైన మెరైన్ లో పనిచేశాడు

Written By: Bhaskar, Updated On : July 18, 2024 2:25 pm
Follow us on

J D Vance :  రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష బరిలో ట్రంప్ పోటీలో ఉన్నారు. ఉపాధ్యక్ష పదవికి వాన్స్ బరిలో ఉన్నారు. వాన్స్ చేసుకున్న అమ్మాయి ఉషా చిలుకూరి. ఆమె తెలుగింటి ఆడపడుచు. ఆమె మూలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లాలో ఉన్నాయి. విశాఖపట్నంలోనూ ఆమెకు బంధువులు ఉన్నారు. ఆమె మేనత్త చెన్నై నగరంలో నివసిస్తున్నారు. ఉష – వాన్స్ ది ప్రేమ వివాహం. యేల్స్ యూనివర్సిటీలో లా చదువుతున్నప్పుడు ఉషకు వాన్స్ పరిచయమయ్యాడు. అది కాస్త ప్రేమకు దారితీసింది. అలా వాళ్ళు నాలుగు సంవత్సరాల పాటు డేటింగ్ చేశారు. 2014లో పెళ్లి చేసుకున్నారు. పూర్తి హిందూ సంప్రదాయంలో వారిద్దరి వివాహం జరిగింది. వాన్స్ – ఉష దంపతులకు ముగ్గురు సంతానం. వాన్స్ అమెరికా ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా ఎంపికైన తర్వాత ఉష వార్తల్లో వ్యక్తయ్యారు. ఈ సందర్భంగా పలు మీడియా సంస్థలు ఆయన సంప్రదించగా.. వాన్స్ తో ప్రేమ, పెళ్లి వంటి సంగతులను మిల్వా కిలో గురువారం జరిగిన రిపబ్లికన్ కన్వెన్షన్ లో ఉష పంచుకున్నారు.

శాకాహారిగా మారిపోయాడు

వాన్స్.. క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి. ఉష బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువతి. వీరిద్దరూ హైందవ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. అయితే ఉష శాఖాహారం మాత్రమే తింటుంది. వాన్స్ కు ముక్క లేనిదే ముద్ద దిగదు. కానీ తన భార్య కోసం పూర్తి శాకాహారిగా మారిపోయాడు. ఉష కోసం భారతీయ వంటలను వాన్స్ నేర్చుకున్నాడు. స్వీట్ పొటాటో లాగా ఉష మనసును గెలుచుకున్నాడు. ఆమె అలవాట్లను పూర్తిగా అనుసరించాడు. ఉష తల్లి వద్ద భారతీయ వంటలు నేర్చుకున్నాడు. వారి కుటుంబంలో విడదీయరాని భాగమైపోయాడు.

స్నేహితుడిగా ప్రయాణం

ఉషతో వాన్స్ స్నేహితుడిగా ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అప్పుడు ఎలా ఉన్నాడు.. ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. తన జీవితంలో కలుసుకున్న అత్యంత ఆసక్తికరమైన వ్యక్తి వాన్స్ అని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించింది. వాన్స్ తన బాల్యంలో అనేక కష్టాలు పడ్డాడు. ఇరాక్ లో కఠినమైన మెరైన్ లో పనిచేశాడు. తీరిక సమయంలో కుక్కపిల్లలతో ఆడుకునేవాడు. బోర్ కొడితే జేబ్ అనే చిత్రాన్ని చూస్తూ కాలక్షేపం చేసేవాడు.

వాన్స్ జీవితంపై ఉష ముద్ర

ఇదే సమయంలో ఉష వాన్స్ జీవితంపై తీవ్ర ప్రభావం చూపించింది. ఉష పాటించే హిందూ ధర్మం వాన్స్ కు మార్గదర్శకం చేసింది. సేనెటర్ గా గెలిచిన తర్వాత తన విజయం వెనుక ఉష ఉందని బహిరంగంగానే చెప్పాడు. “ఆమె నన్ను బహిరంగంలోకి తీసుకొచ్చింది. వాస్తవ ప్రపంచాన్ని చూపించింది. గొప్ప విషయాలను నాకు అర్థం అయ్యేలా చెప్పింది. నా కేథలిక్ నమ్మకాలకు.. తన హిందుత్వాన్ని జోడించింది. తన మతం గురించి ఆమె ఎప్పుడూ గొప్పగా చెప్పుకోలేదు. నన్ను కూడా చులకనగా చూడలేదు. తన ప్రేమతో నన్ను లీనం చేసుకుంది. నేను సాధించే విజయాల వెనుక ఆమె బలమైన పాత్ర పోషించింది. ఆమె నాకు మాత్రమే కాదు, చాలామంది మహిళలకు ఒక స్ఫూర్తి.. ఆమె అద్భుతంగా మాట్లాడుతుంది. అద్భుతంగా పనిచేస్తుంది. పిల్లల పెంపకాన్ని కూడా అద్భుతంగానే చేపట్టింది.. తన ఓపికను చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆమె ప్రతిరోజు నాకు కొత్తగానే కనిపిస్తోంది. ఇంతవరకు నన్ను ఒక్కరోజు కూడా పల్లెత్తు మాట అనలేదు. అంతేకాదు నాలో సరికొత్త సానుకూల శక్తిని పెంపొందించిందని” 2020లో ఫాక్స్ న్యూస్ ప్రజెంటర్ మెగన్ కెల్లీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాన్స్ పేర్కొన్నాడు.