Homeఅంతర్జాతీయంKhawaja Asif controversial statement: అమెరికా టాయిలెట్‌ పేపర్‌ అయ్యాం.. బోరుమంటున్న పాకిస్తాన్‌!

Khawaja Asif controversial statement: అమెరికా టాయిలెట్‌ పేపర్‌ అయ్యాం.. బోరుమంటున్న పాకిస్తాన్‌!

Khawaja Asif controversial statement: అవసరం ఉన్నంతవరకు వాడుకుని తర్వాత వదిలేయడం అమెరికాకు అలవాటే. ఇక డబ్బుల కోసం అగ్రదేశాలు అయినా పాకిస్తాన, చైనా వెంటపడడం పాకిస్తాన్‌కు అలవాటే. అమెరికా తంతే చైనా వద్దకు.. చైనా తంతే అమెరికా వద్ద సాగిలపడుతుంది. కొన్నిసార్లు రెండు పడవలపైనా ప్రయాణం చేస్తుంది. ఇటీవలే బలూచిస్తాన్‌లోని మినరల్స్‌ తవ్వుకోవడానికి అమెరికాకు అనుమతిచ్చింది. గతంతో ఇక్కడే చైనాకూ అనుమతి ఇచ్చింది. అవసరం కోసం ఇలాంటి ప్రయోగాలు కూడా చేస్తుంది. అయితే తాజాగా పాక్‌ నేషనల్‌ అసెంబ్లీలో మాట్లాడిన రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, అమెరికా తమ దేశాన్ని ‘టాయిలెట్‌ పేపర్‌లా‘ వాడుకుని వదిలేసిందని ఆరోపించారు. ఆఫ్గాన్‌ యుద్ధాల్లో, 9/11 దాడుల తర్వాత అమెరికా పక్షాన నిలబడి పెద్ద నష్టాలు చవిచూసినామన్నారు. ఇప్పుడు తాలిబాన్‌ దాడులతో బాధపడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశాడు.

గత చరిత్ర ఇలా..
1980ల్లో సోవియట్‌ వ్యతిరేక యుద్ధం, 2001 తర్వాత తాలిబాన్‌పై పోరుల్లో పాకిస్తాన్‌ అమెరికా మద్దతు ఇచ్చింది. కార్గిల్‌ యుద్ధంలో కూడా అమెరికా ప్రభావం చూపిందని ఆసిఫ్‌ పేర్కొన్నారు. జియా–ఉల్‌–హక్, పర్వేజ్‌ ముషారఫ్‌లు డబ్బు కోసం దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శలు ఉన్నాయి.

భారత్‌–అమెరికా డీల్‌తో ఒత్తిడి
భారత్‌–అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందం పాకిస్తాన్‌కు ఇబ్బందికరంగా మారింది. భారత్‌ పెద్ద మార్కెట్‌గా మారడంతో పాక్‌ విషయంలో అమెరికా ఆసక్తి తగ్గింది. చైనాతో సంబంధాలు కూడా అమెరికాను దూరం చేశాయి. ఇప్పుడు ఆసిఫ్‌ ప్రకటన దేశీయ రాజకీయాల్లో చర్చనీయాంశం. అమెరికా, చైనా మధ్య తాత్కాలిక సంబంధాలు పాకిస్తాన్‌కు నష్టంగా మారాయి. అయితే ఆసిఫ్‌ మాటలు జాతీయవాద భావాలను రేకెత్తించి, విదేశాంగ విధాన మార్పుకు దారితీయవచ్చు.

ఆసిఫ్‌ ప్రకటన పాక్‌ ప్రజల్లో అమెరికాపై వ్యతిరేకత పెంచుతుంది. సొంత సాంకేతికత, ఆర్థిక బలం అవసరమని స్పష్టం. భారత్‌ వంటి స్వతంత్ర విధానాలు అమలు చేస్తే మాత్రమే గౌరవం సంపాదించవచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular