Homeఅంతర్జాతీయంBiden Son Hunter: అధికారాంతమున జోబైడెన్‌ చేసిన పక్షపాత పని.. కొడుకు కోసం దారుణం

Biden Son Hunter: అధికారాంతమున జోబైడెన్‌ చేసిన పక్షపాత పని.. కొడుకు కోసం దారుణం

Biden Son Hunter: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. అధికార డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ పోటీ చేశారు. రిపబ్లికన్‌ పార్టీ తరఫున డొనాల్డ్‌ ట్రంప్‌ బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో అమెరికన్లు ట్రంప్‌కు పట్టం కట్టారు. 300లకుపైగా ఎలక్టోరల్‌ ఓట్లతో ట్రంప్‌ అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన 2025, జనవరి 20న బాధ్యతలు చేపట్టారు. అధికార మార్పిడికి సమయం ఉండడంతో ట్రంప్‌ తన క్యాబినెట్‌తోపాటు, వైట్‌హౌస్‌ కార్యవర్గ పదవుల భర్తీపై దృష్టి పెట్టారు. ఇప్పటికే చాలా మందిని మంత్రులు, వివిధ శాఖలకు అధిపతులుగా ప్రకటించారు. ఇలా ఉంటే.. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌ మాత్రం సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడికి భారీ ఊరట కల్పించి విమర్శలపాలవుతున్నారు. ఇప్పటికే డెమొక్రటిక్‌ పార్టీ ఓటమికి ట్రంపే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆయన అధ్యక్ష పీఠం అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న విమర్శలు వస్తున్నాయి. అక్రమంగా ఆయుధాల కోనుగోలుతోపాటు రెండు క్రిమినల్‌ కేసుల్లో ఉపశమనం కలిగించే నిర్ణయం ప్రకటించారు. ఈ కేసులు రాజకీయ ప్రేరేపితమైనవని బైడెన్‌ ప్రకటించారు.

నిజం చెప్పాలి అంటూ..
అమెరికా ప్రజలకు నిజం చెప్పాలి అని.. తన జీవితం మొత్తం ఇదే సూత్రం పాటిస్తున్నానని బైడెన్‌ తెలిపారు. తన కుమారుడు హంటర్‌ను అన్యాయంగా విచారించే సమయంలో నేను చూస్తూ ఉండిపోయాను. రాజకీయ కట్రలో భాగంగానే అతడిపై కేసులు పెట్టారు అని పేర్కొన్నారు. ఇక జరిగింది చాలని, ఈ కేసులో హంటర్‌కు క్షమాభిక్ష పెట్టాలని నిర్ణించుకున్నాని తెలిపారు. ఓ తండ్రిగా, అమెరికా అధ్యక్షుడిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో అమెరికా ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే హంటర్‌ దోషి అని తేలితే క్షమాభిక్ష ప్రసాదించబోనని స్పష్టం చేశారు బైడెన్‌. అయితే తాజా నిర్ణయం అమెరికాలో చర్చనీయాంశమైంది.

హంటర్‌పై ఉన్న కేసులివీ..
బైడెన్‌ తనయుడు హంటర్‌పై కీలకమైన కేసులు ఉన్నాయి. 2018లో తుపాకీ కొనుగోలు సందర్భంగా ఆయుధ డీలర్‌ ఇచ్చిన దరఖాస్తు ఫారంలో హంటర్‌ తప్పుడ సమాచారం ఇచ్చారు. తాను అక్రమంగా డ్రగ్స్‌ కొనుగోలుచేయలేదని, వాఇకి బానిస కాలేదని, తనవద్ద అక్రమంగా ఆయుధం లేదని వెల్లడించారు. అయితే హంటర్‌ డ్రగ్స్‌ అప్పటికే అక్రమంగా కొనుగోలు చేశారని అభియోగాలు ఉన్నాయి. వాటికి బానిసగా కూడా మారాడు. ఇక 11 రోజులు అక్రమంగా ఆయుధం కలిగి ఉన్నాడు. అదేవిధంగా కాలిఫోర్నియాలో 1.4 మిలియన్‌ డాలర్ల పన్ను ఎగవేతపైనా కేసు నమోదైంది.

దోషిగా తేల్చిన న్యాయస్థానం..
అక్రమ ఆయుధం కొనుగోలు కేసుపై ఈ ఏడాది జూన్‌లో న్యాయస్థానం హంటర్‌ను దోషిగా తేల్చింది. అయితే ఇప్పటి వరకు శిక్ష ఖరారు చేయలేదు. దీనిపై అప్పట్లో బైడెన్‌ స్పందించారు. తీర్పును అంగీకరించారు. ఈ కేసులో తన కుమారుడికి క్షమాభిక్ష కోరబోనని ప్రకటించారు. కానీ ఇప్పుడు అధికారం అడ్డు పెట్టుకుని క్షమాభిక్ష ప్రసాదించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular