US-China Agreement : ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్.. ప్రపంచంలో అన్నిరంగాల్లోకి ఎంటర్ అవుతున్న ఊహాతీత టెక్నాలజీ. ఏఐ కారణంగా ఇప్పటికే వేల మంది రోడ్డున పడ్డారు. లక్షల మంది తమ ఉద్యోగాలు ఎప్పుడు ఊడుతాయో అని ఆందోళన చెందుతున్నారు. ఇక ఏఐ కారణంగా వీవీఐపీలు, వీఐపీలు, సినీ నటులు, దేశాల అధినేతలు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఏఐతో లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉందని గుర్తించారు. దీంతో ఏఐని పరిమిత రంగాల్లోనే వినియోగించాలని నిర్ణయించారు. అయితే ఏఐ ఇప్పటికే అసాంఘిక శక్తుల చేతిలోకి వెళ్లింది. దీంతో టార్గెట్‌లను ఇబ్బంది పెడుతున్నారు. ఇక చాలా దేశాలు ఏఐని ఇప్పటికే సైన్యంలోకి తీసుకొచ్చాయి. యుద్ధ వ్యూహాలు, శత్రు దేశాల కుట్రలను పసిగట్టేందుకు, రహస్యంగా దాడులు చేయడానికి దీనిని ఇపయోగిస్తున్నాయి. చైనా, రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్ వంటి దేశాలు ఈ టెక్నాలజీని అణ్వాయుదాలకు ఉపయోగించే ముప్పు ఉందని అమెరికా భావిస్తోంది. ఈ నేపథ్యంలో చైనాతో కీలక ఒప్పందం చేసుకుంది.
అణ్యాయుధాల తయారీకి దూరంగా ఏఐ..
ఊహాతీతంగా ప్రవర్తించే ఏఐ టెక్నాలజీని అణ్వాయుధాల తయారీ, నిర్వహణకు ఏ దేశం ఎప్పుడూ వాడకూడదని అమెరికా భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో బలమైన దేశాల్లో ఒకటిగా ఉన్న చైనాతో ముందుగా ఒప్పందం చేసుకుంది. అభివృద్ధి చెందిన దేశాలే ఏఐని విరివిగా వినియోగిస్తున్నాయి. మరోవైపు చైనాతో అమెరికాకు ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో చైనాకు అగ్రరాజ్యం ముందస్తు కల్లెం వేసేలా ఒప్పందం చేసుకుంది. అమెరికా కూడా తామూ ఏఐని అణ్వాయుధాల తయారీలో వాడబోమని తెలిపింది. ఈమేరకు ఇరు దేశాలు అంగీకరించాయి. పెరులో జరిగిన ఏపీఈసీ సదస్సులో భేటీ అయిన జోబైడెన్, జిన్ పింగ్.. అణ్వాయుధాలను మనుషులు మాత్రమే హ్యాండిల్ చేయాలని నిర్ణయించారు. రక్షణ రంగంలో ఏఐని బాధ్యతగా వాడాలని ఏకాభిప్రాయానికి వచ్చారు.
ముందే చెప్పిన భారత్..
ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ అనేది అణ్యావయుధాత తర్వాత అంతటి ప్రమాదకరమైనదని భారత్ ఇప్పటికే ప్రపంచ దేశాలను హెచ్చరించింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్, ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహించిన సమావేశంలో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ మాట్లాడారు. ఏఐ పరిణామాల కోసం సిద్ధం కావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. వాస్తవికతను ముందే స్పష్టం చేశారు. ఒకప్పుడు న్యూక్లియర్ బాంబులు ఉన్నంత ప్రమాదకరమైనవి ప్రపంచానికి అని పేర్కొన్నారు. రాబోయే దశాబ్దంలో ప్రపంచీకరణను ఆయుధం చేయవచ్చని, ప్రపంచం అప్రమత్తంగా ఉండాలని జైశంకర్ హెచ్చరించారు. ఈ సంభావ్య ఆయుధీకరణ యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి జాగ్రత్తగా ప్రణాళిక మరియు వ్యూహాత్మక ఆలోచన యొక్క అవసరాన్ని అతను నొక్కి చెప్పాడు.