Homeఅంతర్జాతీయంUnknown Gunmen: ఉగ్ర నెట్ వర్క్ కట్.. ఓవర్ గ్రౌండ్ వర్కర్లను లేపేస్తున్న అజ్ఞాత సాయుధులు

Unknown Gunmen: ఉగ్ర నెట్ వర్క్ కట్.. ఓవర్ గ్రౌండ్ వర్కర్లను లేపేస్తున్న అజ్ఞాత సాయుధులు

Unknown Gunmen: ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో భద్రతా సంస్థలు యోజనాత్మక మలుపు తిరిగాయి. మొదటి పంజా ఉగ్రవాదులపై ఉండగా, ఇప్పుడు వారి మద్దతు వ్యవస్థపై కేంద్రీకరిస్తున్నాయి. ఇది దీర్ఘకాలిక విజయానికి మార్గం సుగమం చేస్తోంది.

మూలాలు, మధ్యవర్తులే కీలకం..
పాకిస్తాన్‌లోని ఉగ్రవాద నాయకులు కేవలం ఆదేశాలు ఇవ్వడంతో ఆగరు.. రిక్రూట్‌మెంట్, శిక్షణ, ఆయుధ సరఫరా చేస్తారు. అయతే భారత్‌లోకి ఉగ్రవాదులను చొరవడానికి ఓవర్‌గ్రౌండ్‌ వర్కర్లు కీలకం. కశ్మీర్‌లో హథ్రాస్‌ లాంటి ప్రాంతాల్లో ఉండి లాజిస్టిక్స్‌ సామగ్రి అందించే వ్యక్తులు గుర్తించారు. ఈ వ్యక్తులు సామాన్యంగా కనిపించి, ఉద్యోగాలు చేస్తూ సురక్షిత ఆవాసాలు, తప్పించుకునే మార్గాలు, నకిలీ డాక్యుమెంట్లు సిద్ధం చేస్తారు.

2014 తర్వాత వ్యూహంలో మార్పు..
బాలాకోట్, పఠాంకోట్, ఉరి, సర్జికల్‌ స్ట్రైక్‌లు ఉగ్రవాదులను అంతం చేశాయి కానీ సమస్య మొత్తం తీరలేదు. 2014 నుంచి దృష్టి మారి, ఓవర్‌గ్రౌండ్‌ నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ఉదాహరణగా, పుల్వామా దాడి తర్వాత జైష్‌–ఇ–మొహమ్మద్‌కు మద్దతు ఇచ్చిన 20 మంది వర్కర్లను అరెస్ట్‌ చేశారు. ఇది నాయకులు–ఉగ్రవాదుల మధ్య కనెక్షన్‌ను బలహీనపరుస్తోంది, దాడులు తగ్గుతున్నాయి.

ఓవర్‌గ్రౌండ్‌ వర్కర్ల కీలక పాత్ర
వీరు డబ్బు, ఆయుధాలు స్మగ్లింగ్, చొరబాటు దారులు పరిచయం చేస్తారు. సమస్యల సమయంలో తప్పించుకునే ప్రణాళికలు రూపొందిస్తారు. ఉదాహరణకు, లష్కర్‌–ఇ–తొయబా నెట్‌వర్క్‌లో భాగమైన ఒక వ్యక్తి ఆయుధాలు దాచి, ఉగ్రవాదులకు ఆహారం అందించాడు. వారి విస్తృత నెట్‌వర్క్‌ ఉగ్రవాదానికి బలమైన మూలాలు అందిస్తుంది. ఈ లింక్‌లను ధ్వస్తం చేస్తే మొత్తం వ్యవస్థ కుప్పకూలుతుంది.

తాజాగా అజ్ఞాతుల ఆపరేషన్‌..
ఎల్‌ఓసీ రెండు వైపులా గుర్తింపు పెరిగింది. బలూచిస్తాన్‌కు చెందిన బిలాల్‌ సద్దామ్‌ హుస్సేన్‌ వంటి వ్యక్తి లాజిస్టిక్స్, ప్రణాళికలు, భయాందోళనలకు కారణమయ్యాడు. అజ్ఞాత సాయుధులు అతన్ని అంతం చేశారు. మరో ఉదాహరణగా, రీసెంట్‌గా జమ్మూ ప్రాంతంలో ఒక ఓజీ డ్రోన్‌ల ద్వారా ఆయుధాలు సరఫరా చేస్తున్నట్టు గుర్తించి లేపారు. పాకిస్తాన్‌ దీన్ని పట్టించుకోకపోయినా, ఇది వ్యూహ విజయాన్ని సూచిస్తోంది.

ఓవర్‌గ్రౌండ్‌ వర్కర్లపై దాడులు ఉగ్రవాదాన్ని మూలాల వద్ద నియంత్రిస్తాయి. ఇది భద్రతా దళాల సామర్థ్యాన్ని పెంచుతూ, దాడులు తగ్గిస్తుంది. దీర్ఘకాలంలో ఇది ప్రాంతీయ స్థిరత్వానికి దోహదపడుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version