United States: ఏ కంపెనీలో అయిన బాస్ అంటే చాలా మందికి కోపం ఉంటుంది. వర్క్ ఎక్కువగా ఇచ్చి టార్చర్ పెడుతుంటారని చాలా మంది భావిస్తారు. కొన్నిసార్లు బాస్‌ను కొట్టాలని, తిట్టాలని భావిస్తుంటారు. కానీ బాస్ కదా.. ఏదైనా చేస్తే ఉద్యోగంలో నుంచి తీసేస్తారు ఏమోనని భయపడి ఏం అనకుండా ఉంటారు. అయితే యూనైటెడ్ స్టేట్స్‌లోని ఓ కంపెనీ బాస్‌లను తిట్టడానికి ఓ సరికొత్త సర్వీస్‌ను తీసుకొచ్చింది. ఈ సర్వీస్‌లో ద్వారా మీరు బాస్‌ను తిట్టిన అది మీ ఉద్యోగంపై ఎలాంటి ప్రభావం చూపదు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది. యూనైటెడ్ స్టేట్స్‌లో ఓసీడీఏ అనే సర్వీస్‌ను స్టాండ్ అప్ కమెడియన్, నటుడు కాలిమార్ వైట్ స్టార్ట్ చేశారు. ఈ సర్వీస్‌లో ఫిర్యాదు చేసుకుంటే డైరెక్ట్‌గా ఆఫీస్‌కి వెళ్లి బాస్‌ను తిట్టవచ్చు. ఈ సర్వీస్‌ను ఉపయోగించిన తర్వాత అందరూ బాగుందని, బాస్ మీద ఉన్న కోపం అంతా తిట్టేయడం వల్ల ప్రశాంతంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు
ఈ సర్వీస్ ఎలా పని చేస్తుందంటే?
ఉద్యోగస్తులు క్లయింట్‌లకు అభ్యర్థనలు పంపుతారు. ఓసీడీఏ ద్వారా బాస్ సహోద్యోగితో తిట్టించుకోవడానికి గల కారణం ఏంటి? బాస్ చేసిన తప్పు ఏంటని? స్కాల్డర్ కార్యాలయానికి పంపుతారు. అక్కడ ఎందుకు తిట్టాలనుకుంటున్నారో.. ముందుగానే మాట్లాడుకుంటారు. దానికి అనుగుణంగా ఫోన్ కాల్ లేదా డైరెక్ట్‌గా బాస్‌ను తిడతారు. అయితే ఇలా బాస్‌ని తిట్టించుకోవడానికి కంపెనీ కొంత మొత్తంలో ఛార్జ్ చేస్తుంది. కానీ ఎంత అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏదో విధంగా బాస్‌ను తిట్టవచ్చని చాలా మంది ఈ కొత్త సర్వీస్‌పై ఆస్తకి చూపిస్తున్నారు.
ఇటీవల ఓ ఉద్యోగస్థుడు ఈ సర్వీస్ ద్వారా తన బాస్‌ను తిట్టాడు. ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. 17 సంవత్సరాలు చేసిన తర్వాత కూడా నాకు ఇప్పటికీ హైక్ ఇవ్వడం లేదు. అనుభవం ఉన్నవారి కంటే కొత్త వారికే ఎక్కువగా జీతాలు ఇస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలియజేయడంతో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ ఓసీడీఏ ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా స్కార్డర్‌లను తీసుకుని ఈ సర్వీస్‌ను అందజేస్తోంది. ఈ సర్వీస్‌ను పూర్తిగా కంపెనీ ఏజెంట్ల ద్వారా నిర్వహిస్తారు. ఆఫీస్‌లో ఉద్యోగాలు చేసే వారు ఇబ్బంది పడకుండా మెరుగైన వాతావరణాన్ని పెంచేందుకు ఈ సర్వీస్‌ను తీసుకొచ్చినట్లు వైట్ తెలిపారు.
ఈ సరికొత్త సర్వీస్ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో వస్తే.. ఇక బాస్‌గా ఉండాలని ఎవరూ కోరుకోరు. కింది స్థాయి ఉద్యోగులు ఇలా తిడతారని అందరూ కూడా ఉద్యోగస్తులుగానే ఉండాలని అనుకుంటారు. ఇలాంటి సర్వీస్ వల్ల కారణం లేకుండా తిట్టే బాస్‌ల సంఖ్య కూడా తగ్గుతుంది. కొందరు వ్యక్తిగత కారణాలను దృష్టిలో పెట్టుకుని రీజన్ లేకుండా ఉద్యోగస్తులను తిడుతుంటారు. ఇలాంటి బాస్‌లకు ఈ కొత్త సర్వీస్ బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. మరి ఈ కొత్త సర్వీస్‌పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.
https://twitter.com/AgentRatliff/status/1854747093010653382