https://oktelugu.com/

Mexico : మెక్సికోలో బట్టలు విప్పేసి సైకిల్‌ ర్యాలీ.. ఫొటోలు వైరల్‌!

Mexico : సైకిలిస్టులు ఎక్కువగా కనిపించేలా చేయడం, సైకిలిస్టుల భద్రతకు డ్రైవర్లకు అవగాహన కల్పిచడమే ఈ ర్యాలీ ఉద్దేశమని సైకిల్‌ రైడర్లు తెలిపారు.

Written By:
  • NARESH
  • , Updated On : June 10, 2024 / 02:28 PM IST

    Mexico

    Follow us on

    Mexico : కాలుష్య నియంత్రణపై దేశ ప్రజలకు అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో మెక్సికో సైకిలిస్ట్‌లు.. బట్టలు విప్పేసి రైడ్‌చేసి ఆశ్చర్యపర్చారు. కార్ల వినియోగాన్ని వ్యతిరేకిస్తూ.. బైక్‌ల వినియోగంతో పెరుగుతున్న ప్రమాదాలపై నిరసన కూడా తెలిపారు.

    కార్ల సంస్కృతికి వ్యతిరేకంగా..

    మెక్సికో సిటీలో కార్ల వినియోగం పెరుగుతోంది. దీంతో వాతావరణం కలుషితం అవుతోంది. కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సైకిలిస్ట్‌లు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం(జూన్‌ 8న) వందల మంది సైకిలిస్టులు నగ్నంగా మెక్సికో సిటీలో సైకిల్‌ రైడ్‌ నిర్వహించారు. ఇందులో కొందరు లోదుస్తులతో పాల్గొనగా, మరికొందరు పూర్తిగా నగ్నంగా పాల్గొన్నారు.

    ప్రమాదాలు నివారించాలని..

    ఇటీవలి సంవత్సరాల్లో ప్రపంచంలోని అతిపెద్ద మరియు అత్యంత కలుషితమైన నగరాలలో ఒకటిగా మెక్సికో సిటీ గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణకు అక్కడి ప్రభుత్వం కార్ల వినియోగం తగ్గించేందుకు బైక్‌–షేరింగ్‌ పథకాన్ని ప్రారంభించింది. ఇందుకోసం సిటీలో బైక్‌ లేన్‌లను నిర్మించింది. బైక్‌ల వినియోగం పెరుగుతున్నా.. కార్లు కూడా ఎక్కువగానే తిరుగుతున్నాయి. దీంతో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. బైక్‌ రైడర్లు తమకు కేటాయించిన లేన్‌లతోపాటు రోడ్లపై కూడా రైడ్‌ చేస్తున్నారు. దీంతో యాక్సిడెంట్లు జరిగి ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో సైకిలిస్ట్‌లు ఈ నిరసన చేపట్టారు. బైకర్లకు మెరుగైన, సురక్షితమైనసదుపాయాలు కల్పించాలని కోరారు. సైకిలిస్టులు ఎక్కువగా కనిపించేలా చేయడం, సైకిలిస్టుల భద్రతకు డ్రైవర్లకు అవగాహన కల్పిచడమే ఈ ర్యాలీ ఉద్దేశమని సైకిల్‌ రైడర్లు తెలిపారు.