Ukraine Russia War: పురాణ నేపథ్యంగా సాగే సినిమాల్లో యుద్ధాలు విచిత్రంగా ఉంటాయి. దూసుకు వచ్చే బాణాలు ఒక్కసారిగా రూపులు మార్చుకుంటాయి. చిత్ర విచిత్రాలు రూపాలలోకి మారిపోతుంటాయి. యుద్ధం రీతిని పూర్తిగా మార్చేస్తుంటాయి. అందువల్లే పురాణ కాలంలో యుద్ధాలు సుదీర్ఘంగా సాగాయని ప్రచారంలో ఉంది. ఆధునిక కాలంలో అనేక రకాల బాంబులు, యుద్ధ విమానాలు, జెట్ లు, ఇతర సామగ్రి అందుబాటులోకి వచ్చింది. అందువల్ల యుద్దాల రూపు పూర్తిగా మారిపోయింది.
యుద్ధం అనేది ఏ దేశానికి కూడా మంచిది కాదు. కాకపోతే, పెత్తనానికి మరిగిన దేశాధినేతల వల్ల యుద్ధాలు వస్తుంటాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల మధ్య సున్నితమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇవి యుద్దాలకు దారి తీస్తున్నాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య ప్రస్తుతం యుద్ధం జరుగుతోంది. సుదీర్ఘకాలంగా జరుగుతున్న ఈ యుద్ధంలో రెండు దేశాలు నష్టపోతున్నాయి. అయినప్పటికీ పట్టు విడవడంలో ఈ రెండు దేశాలు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు.
ఆర్థికంగా పరిపుష్టమైన రష్యా.. ఉక్రెయిన్ మీద డ్రోన్ల ద్వారా విరుచుకుపడుతోంది. భారీగా శాహెద్ ఆత్మహుతి డ్రోన్లను ఉపయోగిస్తోంది. వీటివల్ల నష్టం తీవ్రంగా ఉంటుందని భావించిన ఉక్రెయిన్.. ఇంటర్ సెప్టార్ డ్రోన్లను తయారుచేసి.. వాటిని ప్రయోగిస్తోంది. ఇవి చూసేందుకు చిన్న పరిమాణంలో ఉంటాయి. వీటిని మర కందిరీగలని యుద్ధ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇవి ఎక్కువ ఎత్తులో ప్రయాణిస్తాయి. వైల్డ్ హార్నెట్స్ అనే సంస్థ వీటిని రూపొందించింది. వీటికి సైంటిఫిక్ భాషలో స్టింగ్ డ్రోన్లు అని నామకరణం చేసింది. ఇవి గగనతనంలో రష్యా శాహెద్ లపై దాడులు చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలను వైల్డ్ హార్నెట్స్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
ఉక్రెయిన్ లోని పెద్దపెద్ద నగరాలను, విద్యుత్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకొని రష్యా దాడులు చేస్తోంది. అయితే వీటిని నిలువరించడానికి ఉక్రెయిన్ ఇంటర్ సెప్టర్ డ్రోన్లను మోహరించింది. వాస్తవానికి గగనతల రక్షణ క్షిపణుల ప్రయోగానికి విపరీతంగా ఖర్చవుతుంది. అయితే అంత ఖర్చు పెట్టుకోలేని ఉక్రెయిన్ ఈ డ్రోన్లపై దృష్టి సారించింది. ఇవి 11 కిలోమీటర్ల ఇంతవరకు వెళతాయి. జెట్ ఇంజిన్ తో ముందుకు సాగుతాయి. రష్యా గత మంగళవారం 600కు పైగా డ్రోన్లను, 30 కి పైగా మిసైల్స్ ను ఉక్రెయిన్ మీదకు ప్రయోగించినట్లు తెలుస్తోంది. తద్వారా ఉక్రెయిన్ దేశంలో విద్యుత్ సరఫరా కు ఆటంకం ఏర్పడింది.
Warriors of the 1020th Anti-Aircraft Missile and Artillery Regiment shot down four Shaheds using interceptor STING drones.
The video quality comes — the digital daytime camera system pic.twitter.com/iFml4diksP
— Wild Hornets (@wilendhornets) December 23, 2025