Homeఅంతర్జాతీయంTrump Tariffs: ట్రంప్‌ దెబ్బకు పాపం అమెరికన్ల పరిస్థితి ఇలా అయ్యింది

Trump Tariffs: ట్రంప్‌ దెబ్బకు పాపం అమెరికన్ల పరిస్థితి ఇలా అయ్యింది

Trump Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై ప్రతీకార సుంకాలను (Trump Tariffs) విధించడంతో ఆర్థిక వ్యవస్థలో కలకలం మొదలైంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా వివిధ దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ఈ టారిఫ్‌(Tariff)లు అమల్లోకి రావడంతో, ఇప్పటికే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న అమెరికన్లు ధరలు మరింత పెరగనున్నాయనే ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ధరలు పెరగకముందే వస్తువులను కొనుగోలు చేసేందుకు స్టోర్ల వద్ద క్యూలు కడుతున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు(Electronic Products), కార్లు(Cars), గృహోపకరణాలకు(Home needs) డిమాండ్‌ గణనీయంగా పెరిగింది.

Also Read: గోదావరి జిల్లాల రొయ్యకు ట్రంప్ దెబ్బ!

ఎలక్ట్రానిక్స్‌ ధరల పెరుగుదల
తైవాన్‌(Taiwan)పై 32 శాతం సుంకాలు విధించడంతో ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే ల్యాప్‌టాప్‌(Laptops)లు, కంప్యూటర్లు(Computers), కెమెరాలు, స్మార్ట్‌ఫోన్‌ల వంటి ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల ధరలు గణనీయంగా పెరగనున్నాయి. ఈ పరిణామంతో అమెరికన్లు ఇప్పటి నుంచే ఈ వస్తువులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. టెక్సాస్‌కు చెందిన యువకుడు జాన్‌ గుటిరెచ్‌ ఇలా అన్నాడు: ‘‘ఏడాదిగా తైవాన్‌ బ్రాండ్‌ ల్యాప్‌టాప్‌ కొనాలని ఆలోచిస్తున్నా. సుంకాల ప్రకటన వచ్చిన రోజే ఆర్డర్‌ చేశా, లేకపోతే ధరలు రెట్టింపు అవుతాయని భయం.’’ ఇదే విధంగా, కార్లు, రిఫ్రిజిరేటర్లు(Refidgarators), వాషింగ్‌ మిషన్ల వంటి గృహోపకరణాలకు కూడా ఆర్డర్లు పెరుగుతున్నాయని కంపెనీలు తెలిపాయి.
ఆర్థికవేత్తల హెచ్చరికలు

నిత్యావసరాల ధరలు..
ఈ సుంకాలు అమెరికాలో నిత్యావసర వస్తువుల(Daily wares) ధరలను భారీగా పెంచుతాయని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నిరుద్యోగం, ద్రవ్యోల్బణ సమస్యలతో అల్లాడుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఈ నిర్ణయం మరింత ఒత్తిడిని తెస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఈ సుంకాల వల్ల వస్తువుల ధరలు సగటున 10–20 శాతం పెరిగే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో ఇది ఆర్థిక మాంద్యానికి దారితీసే ప్రమాదం ఉంది,’’ అని ఒక ప్రముఖ ఆర్థికవేత్త విశ్లేషించారు. చైనా (34%), యూరోపియన్‌ యూనియన్‌ (20%), ఇండియా (26%) వంటి దేశాలపై విధించిన సుంకాలు కూడా ఈ ప్రభావాన్ని మరింత తీవ్రతరం చేయనున్నాయి.

సుంకాల అమలు ప్రారంభం
ట్రంప్‌ ప్రకటించిన సుంకాలు అమెరికా కాలమానం ప్రకారం ఏప్రిల్‌ 5, 2025 అర్ధరాత్రి 12:01 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రారంభంలో అన్ని దేశాలపై 10 శాతం బేస్‌లైన్‌ టారిఫ్‌ వసూలు చేస్తున్నారు. అదనపు సుంకాలను (ఉదా: తైవాన్‌పై 32%, చైనాపై 34%) ఏప్రిల్‌ 10 నుంచి అమలు చేయనున్నట్లు అగ్రరాజ్య ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలో యూఎస్‌ సముద్ర ఓడరేవులు, విమానాశ్రయాలు, కస్టమ్స్‌ వేర్‌హౌస్‌ల వద్ద దిగుమతి వస్తువులపై సుంకాల వసూలు జోరుగా సాగుతోంది. ‘‘ఈ రోజు నుంచి దిగుమతులపై 10 శాతం సుంకం వసూలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మిగతా రేట్లు కూడా అమలవుతాయి,’’ అని కస్టమ్స్‌ అధికారి ఒకరు తెలిపారు.

ప్రపంచవ్యాప్త ప్రభావం
ఈ సుంకాలు కేవలం అమెరికాకే పరిమితం కాదు. తైవాన్, చైనా, ఇండియా వంటి ఎగుమతి ఆధారిత దేశాల ఆర్థిక వ్యవస్థలపై కూడా తీవ్ర ప్రభావం చూపనున్నాయి. తైవాన్‌ నుంచి ఎలక్ట్రానిక్స్‌ ఎగుమతులు తగ్గితే, అక్కడి సెమీకండక్టర్‌ పరిశ్రమలు ఒడిదుడుకులను ఎదుర్కోవచ్చు. అదే విధంగా, చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువుల ధరలు పెరగడంతో అమెరికన్‌ కంపెనీలు ఇతర దేశాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఈ పరిణామాలు ప్రపంచ వాణిజ్య వ్యవస్థలో పెను మార్పులకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అమెరికన్లు ఈ సుంకాలను ఎలా ఎదుర్కొంటారు? ధరల పెరుగుదలను తట్టుకునేందుకు వారి వినియోగ అలవాట్లు ఎలా మారతాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబోయే రోజుల్లోనే తెలియనున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version