Donald Trump controversial statement: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టి ఏడాది దాటింది. రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఇటు ప్రపంచ దేశాలతోపాటు అటు సొంత దేశ ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. వివాదాస్పద నిర్ణయాలతో అగ్రరాజ్యం పరువును ట్రంప్ బజారుకు ఈడుస్తున్నాడు. అధ్యక్షడికి ఉన్న గౌరవాన్ని మంటగలుపుతున్నాడు. ఎలాంటి కవ్వింపు లేకుండానే ఇరాన్‌పై యుద్ధం ప్రకటించిన ట్రంప్ ఆ యుద్ధం నుంచి బయటపడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవలే ఇరాన్ అమెరికా మధ్య సీజ్‌ఫైర్ కుదిరింది. తాజాగా ఇజ్రాయెల్, లెబనాన్ మద్య కూడా పది రోజుల సీజ్‌ఫైర్ కుదిరింది. దీంతో ఇరాన్ హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచింది. దీనిపై ట్రంప్ గంటల వ్యవధిలో ఏడు అబద్ధాలు ఆడడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
గంటలో ఏడు అబద్ధాలు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్క గంటలో చేసిన ఏడు ప్రకటనలను ‘పూర్తి అబద్ధాలు‘ అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ ఘలీబాఫ్ ఖండించారు. హార్ముజ్ జలసంధి చుట్టూ అమెరికా నావికాదళ దిగ్బంధనం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వాక్య యుద్ధం ఉద్రిక్తతలను మరింత పెంచింది. హార్ముజ్ రాకపోకలు ఇరాన్ అనుమతితోనే జరుగుతాయని, దిగ్బంధనం కొనసాగితే మూసివేస్తామని ఘలీబాఫ్ హెచ్చరించారు. ట్రంప్ ప్రకటనలు యుద్ధ విజయం, చర్చల పురోగతిని కల్పిస్తున్నాయని, కానీ క్షేత్ర పరిస్థితులు నిర్ణయిస్తాయని వాదించారు. లెబనాన్ కాల్పుల విరమణ సమయంలో జలసంధి తెరిచినా వాణిజ్య నౌకలు భద్రతా ఆంక్షలు వల్ల వేచి చూస్తున్నాయి.
గంటలో ట్రంప్ ఏడు ప్రకటనలు..
ఇరాన్ హర్మూజ్ జలసంధిని తెరిచిన తర్వాత ట్రంప్ గంట వ్యవధిలో ఏడు ప్రకటనలు చేశారు. మొదట ఇరాన్ హర్మూజ్ తెరిచినా అమెరికా అనుమతి తప్పనిసరి అని ప్రకటించారు. తర్వాత నావికాదళ ఆంక్షలు త్వరలో ముగుస్తాయని, దిగ్బంధం కొనసాగుతుందని పేర్కొన్నారు. తర్వాత ఇరాన్ యుద్ధంలో ఓడిపోయింది. తాము గెలిచాం అని ప్రకటించాడు. మొదటి దశ చర్చలు విఫలమయ్యాయి. రెండో దశ చర్చలు మొదలు కాలేదు. కానీ చర్చలు పూర్తయ్యాయని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్‌లోని శుద్ధి చేసిన యురేనియం అమెరికాకు తరలిస్తున్నట్లు తెలిపారు. కానీ ఇందులో వాస్తవం లేదు. హర్మూజ్ వద్ద టోల్ విధించాలని పేర్కొన్నారు. త్వరలో ఇరాన్–అమెరికా డీల్ కుదురుతుందని, చర్చలు క్లిష్ట దశలో ఉన్నాయని వెల్లడించాడు.
హార్ముజ్ వ్యూహాత్మక ప్రాముఖ్యత..
పర్షియన్ గల్ఫ్‌ను హిందూ మహాసముద్రంతో కలుపుతూ 21 మైళ్ల వెడల్పు, 90 మైళ్ల పొడవు ఉన్న ఈ జలసంధి ప్రపంచ చమురు రవాణాలో 20–30 శాతం భాగం. రెండు నెలల మూతతో ముడి చమురు ధరలు డబుల్ అయ్యాయి. ట్రాఫిక్ సెపరేషన్ స్కీమ్‌లో 2 మైళ్ల మార్గాలు ఉన్నా, ఇరాన్ ఉత్తర, యూఏఈ/ఒమాన్ దక్షిణ తీరాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.
ట్రంప్ ప్రకటనలను ‘మానసిక యుద్ధం‘గా ఇరాన్ చూస్తోంది. ఘలీబాఫ్ జలసంధి మూత ఇరాన్ ‘పవర్‌ఫుల్ కార్డ్‘గా పేర్కొన్నారు. ట్రంప్ అల్టిమేటం డెడ్‌లైన్‌లు జారీ చేస్తూ ఇరాన్ నౌకలను పేల్చినట్లు ప్రకటించారు. ఇరాన్ పొరుగు దేశాల ఓడరేవులపై దాడులు బెదిరిస్తోంది. చర్చలు జరగకపోతే యుద్ధం తీవ్రరూపం రావచ్చు.