Homeఎంటర్టైన్మెంట్Prakash Raj controversial comments: శ్రీరాముడి పై ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. నాగబాబు దిమ్మ...

Prakash Raj controversial comments: శ్రీరాముడి పై ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. నాగబాబు దిమ్మ తిరిగే కౌంటర్..

Prakash Raj controversial comments: సెక్యులరిజం పేరుతో హిందూ మతం పై , హిందూ దేవుళ్లపై విషం చిమ్మే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వారిలో ఒకరు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్. సినీ నటుడిగా ఆయన ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారు, ఇప్పటికీ ఆయన ఇండియా లోనే మోస్ట్ డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులలో ఒకరు. కానీ వ్యక్తిగతం గా మాత్రం రోజురోజుకి ఆయన తన స్థాయిని దిగజార్చుకుంటూ వెళ్తున్నాడు. ఇలాంటి వ్యక్తులు సమాజం లో తిరగడం అత్యంత ప్రమాదకరం అని అనిపించేలా ఆయన చేసే పలు వ్యాఖ్యలు పై కేసులు కూడా నమోదు అయ్యాయి. రీసెంట్ గా కేరళలోని ఒక ఈవెంట్ కి వెళ్లిన ఈయన, అక్కడ కోట్లాది మంది ఇండియన్స్ దైవంగా కొలిచే రామలక్ష్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేసాడు. నార్త్ ఇండియా నుండి సౌత్ కి వలస వచ్చిన వీళ్లిద్దరు, రావణుడి తోటలోకి ప్రవేశించి అక్రమంగా పండ్లని దొంగతనం చేసి తిన్నారని, ఈ విషయాన్ని గ్రహించిన సూర్పనక్క రావణుడికి చెప్పగా పాపం వాళ్ళు ఆకలి తో ఉన్నారు తిననివ్వు అని అన్నట్టు చెప్పుకొచ్చాడు.

అంతే కాకుండా తిన్న తర్వాత సూర్పనక్క 2000 డాలర్లు జీఎస్టీ తో సహా చెల్లించామని రామలక్ష్మణులను అడగడం , అందుకు వాళ్ళు నిరాకరించడం తో యుద్ధం మొదలైంది అంటూ అత్యంత చిల్లర గా కామెంట్స్ చేసాడు ప్రకాష్ రాజ్. దీనిపై సోషల్ మీడియా లో తీవ్రమైన విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రకాష్ రాజ్ రోడ్డు మీదకు వస్తే హిందువులు కొట్టి చంపేసెంత కోపం తో ఉన్నారు. అయితే ప్రకాష్ రాజ్ చేసిన ఈ కామెంట్స్ పై జనసేన పార్టీ నాయకుడు , పవన్ కళ్యాణ్ సోదరుడు, శాసనమండలి సభ్యుడు నాగబాబు స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఈయన కూడా ఒక నాస్తికుడే. ఒక నాస్తికుడు శ్రీరాముడి గొప్పతనం గురించి మాట్లాడుతూ ట్వీట్స్ వేయడం వింతగా అనిపిస్తోంది అంటూ సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేశారు.

ఇంతకీ ఆయన ఏమి మాట్లాడాడంటే ‘శ్రీరాముడిని కించపరచడం గొప్ప సాహసం అని ఎవరైనా భావిస్తే , అది వారి మూర్ఖత్వానికి నిదర్శనమే అవుతుంది. ధర్మానికి వ్యతిరేకంగా నిలబడిన వాళ్ళు చరిత్రలో మట్టిలో కలిసిపోయారు. కాలమే అలాంటి దుర్మార్గులకు సమాధానం చెప్తుంది ‘ అంటూ నాగబాబు వేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనం గా మారింది. గతం లో ‘మా ఎలక్షన్స్’ సమయంలో నాగబాబు ప్రకాష్ రాజ్ ని ఏ రేంజ్ లో సపోర్ట్ చేశాడో మన అందరికీ తెలిసిందే. ఆయనకు సపోర్టుగా నిలబడడమే కాకుండా, లెజండరీ కోట శ్రీనివాస రావు పై ఇష్టమొచ్చినట్టు నోరు పారేసుకున్నాడు, మంచు విష్ణు కి కూడా ఆయన కౌంటర్లు ఇచ్చాడు. ప్రకాష్ రాజ్ కోసం అంత దూరం వెళ్లిన నాగబాబు నుండి , ఇలాంటి రియాక్షన్ అసలు ఊహించలేదు ఫ్యాన్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version