Trump: కళ్లెంలేని గుర్రం లాగా రెచ్చిపోతున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ మొత్తాన్ని ఇబ్బంది పెడుతూనే.. అమెరికాను అప్పుల ఊబిలాగా మార్చుతున్నాడు. ట్రంప్ వ్యవహార శైలి వల్ల అమెరికా ప్రజలు అనవసరమైన ట్యాక్స్ లు కడుతున్నారు. ట్రంప్ వ్యవహార శైలి పట్ల అమెరికా ప్రజలు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అమెరికా ప్రజల కంటే ఎక్కువగా అక్కడి సెనేట్ తీవ్రంగా స్పందిస్తోంది.
అరుదైన పరిణామం
అమెరికాలో అధ్యక్షుడికి అపరిమితమైన అధికారాలు ఉంటాయి. ఈ పవర్స్ ను ఆయన కేవలం దేశం బాగు కోసం మాత్రమే ఉపయోగించాలి. కానీ ట్రంప్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచ దేశాల మీద యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు. అమెరికా ప్రజలు చెల్లించిన పన్నులను యుద్ధం కోసం ఖర్చు పెడుతున్నారు. దీనివల్ల అమెరికాలో అభివృద్ధి ఆగిపోతుంది. ఒకరకంగా అమెరికా ప్రజల్లో తీవ్రమైన అశాంతిని కలగజేస్తోంది. ఇదంతా కూడా అమెరికా పెత్తనాన్ని ప్రపంచం మీద తగ్గిస్తోంది. ఇదే సమయంలో పోటీదేశాలు ఘోరంగా రెచ్చిపోతున్నాయి. చైనా.. భారత్.. యూరప్ దేశాలు ఆర్థికంగా శక్తివంతమవుతున్నాయి. ఈ పరిణామాలు అమెరికా సెనెట్ కు ఏ మాత్రం నచ్చడం లేదు. అందువల్లే ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
ట్రంప్ కు ఉన్న అధికారాలను తగ్గిస్తూ అమెరికా సెనెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కీలకమైన ఈ నిర్ణయాన్ని ఆమోదించింది… అమెరికా అత్యున్నత సభ అనుమతి లేకుండా యూఎస్ రక్షణ దళాలను ఇరాన్ లో దించకూడదని.. ఎటువంటి ఘర్షణలోకి దించకూడదని సెనేట్ తీర్మానం చేసింది. దీనికి తోడు ట్రంప్ పరిపాలన యంత్రాంగం మిలిటరీ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. దీని పట్ల ట్రంప్ సొంత పార్టీలో నాయకులే తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు డెమోక్రాట్లతో వారు చేతులు కలపడం చర్చకు దారి తీస్తోంది.
సెనేట్ ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా 50 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 48 ఓట్లు వచ్చాయి.. ఇక్కడ అధికార రిపబ్లిక్ పార్టీకి సంబంధించిన నలుగురు సేనేటర్లు డెమోక్రాట్లకు అనుకూలంగా ఓటు వేయడం విశేషం. మరోవైపు డెమొక్రటిక్ పార్టీకి సంబంధించిన ఒక సేనేటర్ ఈ తీర్మానానికి వ్యతిరేకంగా స్వరం కలిపారు. మరోవైపు దీనిపై ట్రంప్ తీవ్రస్థాయిలో స్పందించారు. దీనిని పనికిమాలిన వ్యవహారం లాగా కొట్టిపడేశారు.
