Homeఅంతర్జాతీయంTrump pause migration: పాకిస్తాన్ సహా ఈ దేశాలకు షాకిచ్చిన అమెరికా

Trump pause migration: పాకిస్తాన్ సహా ఈ దేశాలకు షాకిచ్చిన అమెరికా

Trump pause migration: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు సమీపంలో గురువారం(నవంబర్‌ 27)న జరిగిన కాల్పులతో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అలర్ట్‌ అయ్యారు. ఈ కాల్పులను ఉగ్రదాడిగా గుర్తించారు. కాల్పుల్లో ఒక నేషనల్‌ గార్డ్‌ సభ్యురాలు మరణించగా, మరొకరు గాయపడ్డారు. నిందితుడు అఫ్గాన్‌ నేపథ్యం కలిగిన వ్యక్తిగా గుర్తించబడ్డాడు, ఇది అధ్యక్షుడిని వలస విధానాలపై పునరాలోచనలో పడేసింది. ఈ సంఘటన దేశ భద్రతా విధానాల్లో తక్షణ చర్యల అవసరాన్ని స్పష్టం చేసింది.

పేద దేశాల నుంచి వలసల నిషేధం
అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, తక్కువ ఆదాయ దేశాల నుంచి వలసలను శాశ్వతంగా ఆపేస్తామని ప్రకటించారు. బైడెన్‌ కాలంలో జరిగిన అక్రమ అనుమతులను రద్దు చేస్తూ, దేశాన్ని ప్రేమించని వారిని బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. అమెరికా పౌరులు కానివారికి ప్రభుత్వ సహాయాలు, ప్రయోజనాలను కట్టడి చేస్తూ ఈ మార్పులు అమలవుతాయి.

నిషేధిత జాబితాలో పాకిస్తాన్‌..
ఈ నిషేధం దక్షిణ సూడాన్, సోమాలియా, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, సిరియా వంటి దేశాల నుండి వలసలను ప్రభావితం చేస్తుంది. గ్రీన్‌ కార్డ్‌ ధారకులను సమీక్షించడం, దేశ ఆర్థిక, సామాజిక వ్యవస్థలను రక్షించడానికి ఉద్దేశించిన చర్యలు. ఇది అధికారుల్లో భద్రతా పరిశీలనలను వేగవంతం చేస్తోంది. జాబితాలో పాకిస్తాన్‌ ఉండడం గమనార్హం. ఇంతకాలం పాకిస్తాన్‌లో పెట్టుబడులు పెట్టి.. పాకిస్తాన్‌ను మిత్ర దేశంగా ప్రకటించిన ట్రంప్‌.. ఒక్కసారిగా వలసలు నిషేధించి షాక్‌ ఇచ్చారు.

ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌ పోస్టుల ద్వారా ఈ విధానం అమెరికా పునరుద్ధరణకు కీలకమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ చర్యలు దేశ ఐక్యతను బలోపేతం చేస్తాయని అభిప్రాయం. ఇది వలస సంబంధిత వివాదాలకు ఒక మలుపుగా మారనుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular