Donald Trump Pakistan Peace Claims: పశ్చిమాసియా యుద్ధం తాత్కాలికంగా ఆగింది. ఇరాన్, అమెరికా మధ్య రెండు వారాల సీజ్‌ఫైర్ కుదిరింది. అయినా ఇజ్రాయెల్ లెబనాన్‌పై దాడులు కొనసాగిస్తోంది. ఈ తరుణంలో తాత్కాలిక సీజ్‌ఫైర్‌ను శాశ్వత శాంతిగా మార్చేందుకు పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇదంతా తామే చేశామని పాకిస్తాన్ కాలర్ ఎగరేస్తోంది. ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ తాను ప్రపంచ యుద్ధాలు ఆపానని, తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని గతేడాది నానా యాగి చేశాడు. ఇక ఇప్పుడు పాకిస్తాన్ కూడా తాము శాంతి దూరతలమని చెప్పుకుంటోంది. శాంతి చర్చలకు ఇస్లామాబాద్‌ను వేదిక చేసింది. ఇదంతా ట్రంప్ వెనక ఉండి నడిపిస్తున్న నాటకమే అని ఇరాన్ ఆరోపిస్తోంది. అమెరికాను, పాకిస్తాన్‌ను అంత ఈజీగా నమ్మమని ప్రకటించింది. మరోవైపు ఉగ్రవాదులకు నిలయమైన పాకిస్తాన్ తాము శాంతి దూతగా ప్రచారం చేసుకోవడం చూసి ప్రపంచం నవ్వుతోంది.
సమస్యల పరిష్కారంపై భారత్ దృష్టి..
యుద్ధానికి ముదే పాకిస్తాన్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. యుద్ధం, హర్మూజ్ మైసివేత కారణంగా పాకిస్తాన్ పరిస్థితి లాక్‌డౌన్ వరకు వచ్చింది. శాంతి చర్చలకు కూడా డబ్బులు లేకపోవడంతో ప్రజలపై భారం మోపింది. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచింది. మరోవైపు యుద్ధ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించడంపై భారత్ దృష్టిపెట్టింది. సార్వభౌమత్వాన్ని ముందుగా పెట్టుకుని, దీర్ఘకాలిక భద్రతా వ్యూహాన్ని రూపొందిస్తోంది.
ట్రంప్ మాటలు నీటిమీది రాతలే..
డొనాల్డ్ ట్రంప్ 2019లో భారత–పాక్‌తో మాట్లాడి శాంతి తెచ్చేస్తాను అని ప్రకటించారు. అది ఎన్నికల ప్రచార హామీగా మిగిలిపోయింది. తాజాగా ఆపరేషన్ సిందూర్ తానే ఆపానని ప్రచారం చేసుకున్నాడు. దీంతో పాకిస్తాన్ ట్రంప్‌ను ’శాంతి దూత’గా ప్రచారం చేసింది. కానీ ప్రజలు దాన్ని జోకుగా చూస్తున్నారు. ఇక ఇప్పుడు పాకిస్తాన్ చేసుకుంటున్న ప్రచారాన్ని కూడా చూసి జనం జోకులేసుకుంటున్నారు. నిషేధిత ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ నిలయం. ఇలాంటి దేశం.. తాము శాంతి దూతలం అని చెప్పుకోవడం నవ్విపోదురుగాక, నాకేటి సిగ్గు అన్న చందంగా మారింది.
శాంతి ప్రచారం వెనుక బలహీనత
పాకిస్తాన్ తనను శాంతి ప్రేరకుడిగా చూపించుకుని, ట్రంప్‌కు దగ్గరవ్వాలని చూస్తోంది. భారత్ మాత్రం 26/11 ముంబై, బాలాకోట్, పఠాన్‌కోట్‌పై జరిపిన ఉగ్రదాడులను గుర్తు చేస్తోంది. వీలైనంత ఎక్కువగా పాకిస్తాన్‌ను డ్యామేజ్ చేయాలని చూస్తోంది.
ఈ రాజకీయ డైనమిక్స్ భారతదేశానికి అవకాశాలను తెరుస్తోంది. ట్రంప్ లాంటి నాయకులపై ఆధారపడకుండా, బలపడుతూ, దక్షిణాసియా ఆధిపత్యాన్ని స్థిరపరచుకోవచ్చు. పాకిస్తాన్‌కు ఇది మార్పు సమయం. ఉగ్రవాదాన్ని వదులుకుని, నిజమైన శాంతి దేశంగా గుర్తింపు తెచ్చుకుంటే మంచింది.