Homeఎంటర్టైన్మెంట్Spirit Movie Update: 'ఉస్తాద్ భగత్ సింగ్' మేకర్స్ చేతుల్లోకి వెళ్లిన 'స్పిరిట్' మూవీ.. వణికిపోతున్న...

Spirit Movie Update: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మేకర్స్ చేతుల్లోకి వెళ్లిన ‘స్పిరిట్’ మూవీ.. వణికిపోతున్న ప్రభాస్ ఫ్యాన్స్..

Spirit Movie Update: ప్రభాస్(Rebel Star Prabhas) , సందీప్ వంగ(Sandeep Reddy Vanga) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్'(Spirit Movie) మూవీ పై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అవలీలగా ఈ చిత్రం వెయ్యి కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంటుందని అభిమానులు చాలా గట్టిగా నమ్ముతున్నారు. ఎందుకంటే ఆ కాంబినేషన్ అలాంటిది మరీ. సందీప్ వంగ కూడా ఈ చిత్రాన్ని అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా , అంచనాలకు మించేలాగానే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఏ రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడు అని చెప్పడానికి ఫస్ట్ లుక్ ఒక ఉదాహరణ. సోషల్ మీడియా మొత్తం ఆ ఫస్ట్ లుక్ ఒక ఊపు ఊపేసింది. వచ్చే ఏడాది మార్చి 5 వరకు అభిమానులు ఆగలేకపోతున్నారు. ఇదంతా పక్కన పెడితే , ఈ సినిమా గురించి లేటెస్ట్ గా సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక వార్త , అభిమానులను కంగారుకి గురి చేస్తోంది.

అది ఏమిటంటే ఈ సినిమాకు సంబంధించిన తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ని మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కొనుగోలు చేశారట. ఈ రెండు సంస్థలు రీసెంట్ గా ఎలాంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలను అందించారో మనమంతా చూశాం . మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నుండి విడుదలైన పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం డిజాస్టర్ అయ్యింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఒక మాయని మచ్చలాగా మిగిలింది ఈ చిత్రం. అదే విధంగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రభాస్ తో చేసిన ‘రాజా సాబ్’ చిత్రం సంక్రాంతికి విడుదల అయ్యినప్పటికీ కూడా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. ‘మైత్రీ మూవీ మేకర్స్’ కి గతం లో భారీ హిట్స్ ఉన్నాయి, భవిష్యత్తులో కూడా ఈ సంస్థ నుండి ఎంతో ప్రతిష్టాత్మకమైన సినిమాలు రాబోతున్నాయి. కానీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పరిస్థితి వర్ణనాతీతం.

ఇప్పటి వరకు వీళ్ళు తీసిన సినిమాల్లో కేవలం ఒకటి రెండు మినహా, మిగిలిన సినిమాలన్నీ ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. అలాంటి సంస్థ ‘స్పిరిట్’ లాంటి భారీ ప్రాజెక్ట్ ని తెలుగు స్టేట్స్ లో డీల్ చేయడాన్ని ప్రభాస్ అభిమానులు అసలు తీసుకోలేకపోతున్నారు. గతం లో ‘ఆదిపురుష్’ చిత్రాన్ని కూడా ఈ రెండు సంస్థలే తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేశాయి . ఫలితం ఎలాంటిది వచ్చిందో మన కళ్లారా చూసాం. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతుందేమో అని భయపడుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. మరి ఏమి జరగబోతుందో రాబోయే రోజుల్లో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version