spot_img
Homeఅంతర్జాతీయంDonald Trump NATO Exit Plan Impact: నాటో బయటకి వచ్చే యోచనలో ట్రంప్‌.. అదే...

Donald Trump NATO Exit Plan Impact: నాటో బయటకి వచ్చే యోచనలో ట్రంప్‌.. అదే జరిగితే యురోపియన్‌ యూనియన్‌ కొలాప్స్‌!

Donald Trump NATO Exit Plan Impact: పశ్చిమాసియా యుద్ధం నెల రోజులు దాటినా ముగియం లేదు. ఇరాన్‌ తలొగ్గడం లేదు. ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్, ఆర్థిక సంక్షోభం తీవ్రమవుతోంది. మరోవైపు యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేని పరిస్థితి ఉంది. దీంతో అమెరికా ఆర్థికంగా నష్టపోతోంది. దీంతో అధ్యక్షుడు ట్రంప్‌ చిర్రెత్తిపోతున్నాడు. యుద్ధం నుంచి వైదొలగలేక.. అసహనానికి గురవుతున్నాడు. ఈ క్రమంలో తలతిక్క నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్‌ సంయుక్తంగా చేపట్టిన సైనిక చర్యలకు నాటో దేశాలు మద్దతు ఇవ్వకపోవడంతో నాటో నుంచి వైదొలగాలని భావిస్తున్నారు. బ్రిటన్, ఇటలీ, స్పెయిన్‌ వంటి మిత్రదేశాలు తమ గగనతలాలను, సైనిక స్థావరాలను అమెరికా విమానాలకు ఇవ్వడానికి నిరాకరించాయి. ఇది ట్రంప్‌కు కోపం తెప్పించింది.

ట్రంప్‌ ఆగ్రహానికి మూల కారణాలు
ఇరాన్‌ యుద్ధంలో నాటో దేశాలు పాల్గొనకపోవడాన్ని ట్రంప్‌ ‘విశ్వసనీయత లోపం‘గా విశ్లేషకులు భావిస్తున్నారు. నాటో మొత్తం రక్షణ ఖర్చులో అమెరికా వాటా సుమారు 62–70 శాతం ఉంది. మిగిలిన దేశాలు తమ వాటా (జీడీపీలో 2%) భరించడం లేదని ట్రంప్‌ వాదన. అందుకే తాను ఏం చెబితే అది చేస్తాయని భావించాడు. కానీ తాజాగా ట్రంప్‌ నాటో గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. 2017 నుంచే నాటో ‘పేపర్‌ టైగర్‌‘ (కాగితం పులి)గా మారిందని విమర్శించారు. యుక్రెయిన్‌ విషయంలోనూ అమెరికానే ఎక్కువ భారం మోసిందని, యూరప్‌ దేశాలు తమ భద్రత కోసం తాము ప్రయత్నించడం లేదని భావిస్తున్నాడు.

నాటో పరిస్థితి ఏమిటి?
అమెరికా లేని నాటో ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. సైనిక బడ్జెట్‌ గణనీయంగా పడిపోతుంది. ఆ భారం యూరప్‌ దేశాలపై పడుతుంది. అత్యాధునిక గూఢచారి వ్యవస్థలు, డ్రోన్లు, సైబర్‌ వార్‌ఫేర్‌అమెరికాదే. దీంతో సమాచార లోపం, నిఘా సామర్థ్యం క్షీణిస్తుంది. ప్రస్తుతం అమెరికా అణు ఛత్రం యూరప్‌కు భద్రత కల్పిస్తోంది. రష్యా ముప్పు ఎదుర్కోవడం కష్టమవుతుంది. సమష్టి రక్షణ హామీ బలంగా ఉంది. హామీ అమలు చేయగల సామర్థ్యం తగ్గిపోతుంది. రష్యా నుంచి వచ్చే ముప్పును ఎదుర్కోవడానికి యూరప్‌ దేశాలు తమ సైనిక సామర్థ్యాన్ని రాత్రికి రాత్రి పెంచుకోలేవు. అమెరికా సాయం లేకపోతే యుక్రెయిన్‌ను రష్యా సులభంగా ఆక్రమించుకోవచ్చని ట్రంప్‌ కూడా అంగీకరించారు. నాటో సెక్రటరీ జనరల్‌ మార్క్‌ రుటే ఎంత ప్రయత్నించినా, అమెరికా లేని కూటమి దిశానిర్దేశం చేయడం కష్టం.

అమెరికాకు కలిగే నష్టమేంటి?
ట్రంప్‌ వాదన ప్రకారం, నాటో అమెరికాకు ‘వన్‌ వే స్ట్రీట్‌‘ (ఒక వైపు ప్రయాణం) లా మారింది. అమెరికా యుద్ధవిమానాలు మిడిల్‌ ఈస్ట్‌కు వెళ్లడానికి బ్రిటన్, ఇటలీ, స్పెయిన్‌ అనుమతి నిరాకరించడం ఇందుకు నిదర్శనం.. అయితే, విశ్లేషకుల ప్రకారం.. అమెరికా సైనిక స్థావరాలు యూరప్‌లో ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా త్వరితగతిన సైనిక చర్యలు తీసుకోవడం సాధ్యమవుతోంది. నాటో ద్వారా అమెరికా యూరప్‌ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఇది లేకపోతే చైనా, రష్యా ప్రభావం పెరిగే ప్రమాదం ఉంది.

వైదొలగడం అంత ఈజీ కాదు..
ట్రంప్‌ ఎంత కోరుకున్నా, నేటో నుంచి ఏకపక్షంగా బయటకు రావడం సులభం కాదు. 2023 చివర్లో అమెరికా కాంగ్రెస్‌ నేటో నుంచి వైదొలగడాన్ని వ్యతిరేకిస్తూ చట్టం చేసింది. నాటో నుంచి నిష్క్రమించాలంటే సెనేట్‌లో మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం. రిపబ్లికన్‌ పార్టీలోనే చాలా మంది నేటోకు మద్దతు ఇస్తున్నారు. విదేశాంగ మంత్రి మార్కో రుబియో కూడా ‘ఘర్షణ ముగిసిన తర్వాత పరిశీలిద్దాం‘ అని మధ్యస్థ వైఖరి తీసుకున్నారు.

ట్రంప్‌ వాస్తవానికి నాటో నుంచి పూర్తిగా బయటకు రావాలనుకుంటున్నారా? లేక యూరప్‌ దేశాలపై ఒత్తిడి తెచ్చి, మరింత ఖర్చు చేయించాలనుకుంటున్నారా? అనేది కీలక ప్రశ్న. 2019లోనూ ఇలాంటి బెదిరింపులే చేశారు, ఫలితంగా యూరప్‌ దేశాలు తమ రక్షణ బడ్జెట్లు పెంచుకున్నాయి. కానీ, ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు మరింత తీవ్రంగా ఉన్నాయి. అమెరికా వైదొలిగితే ప్రపంచ భద్రతా వ్యవస్థలో చారిత్రాత్మక మార్పులు జరిగి, యూరప్‌ కొత్త భద్రతా సంక్షోభంలో చిక్కుకునే ప్రమాదం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version