Trump job policy backlash: అమెరికాలో జాబ్‌లు అమెరికన్లకే దక్కాలని ట్రంప్ అనేక చర్యలు చేపడుతున్నారు. విదేశీయకు ఉద్యోగాలు ఇవ్వొద్దని పెద్ద పెద్ద కంపెనీలకు హుకూం జారీ చేశారు. అమెరికా ఫస్ట్ అని ఆదేశాలు జారీ చేస్తున్నారు. షాపింగ్ మాల్‌లు, కేఫేలు, ఫుడ్ కోర్టులు వంటి చోట్ల స్థానిక అమెరికన్ల కంటే ఆసియా దేశాల వర్కర్లను ఎక్కువగా నియమించుకోవడం సాధారణమైంది. తాజాగా విదేశాల నుంచి అమెరికా వెళ్లిన వారు అక్కడ పార్ట్ టైం జాబ్‌లు చేయకుండా దేశించారు. అమెరికన్లకే జాబ్‌లు ఇవ్వాలని స్పష్టం చేశారు. అయితే అమెరికన్లను పెట్టుకుంటే వ్యాపారం గిఒట్టుబాటు కాదని అమెరికా వ్యాపారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ట్రంప్‌కు షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు.
అమెరికన్ వర్కర్‌కు గంటకు 17 డాలర్లు…
ఒక స్థానిక ఉద్యోగికి గంటకు 17 డాలర్లు చెల్లించాలి. అదే పనిని భారతదేశం లేదా పాకిస్తాన్ నుంచి వచ్చిన వలసవారికి 5 డాలర్లకే చేయించుకోవచ్చు. రోజువారీ లెక్కలో ఇది యజమానులకు భారీగా ఆదా అవుతోంది. అయితే, దీని ఫలితంగా స్థానిక అమెరికన్లకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. భారతీయుల దృష్టిలో అమెరికాలో పార్ట్‌టైమ్ ఉద్యోగం అంటే రోజుకు దాదాపు రూ.4 వేల వరకు వచ్చే మంచి అవకాశం. కానీ అదే పరిణామం స్థానిక ఆర్థిక వ్యవస్థకు సంక్షోభాన్ని తెచ్చింది. స్థానిక వేతనాలు పెరగడం, జీవన వ్యయాలు అధికమవడం వల్ల వ్యాపారులు తక్కువ వేతనంతో పనిచేసే విదేశీ కార్మికులను ప్రాధాన్యంగా తీసుకుంటున్నారు.
ట్రంప్ నిర్ణయాలకు చెక్..
ఈ సవాలును ఎదుర్కోవడానికే ట్రంప్ ప్రభుత్వం విద్యార్థులు, డిపెండెంట్లు పార్ట్‌టైమ్ వర్క్ చేయకుండా నియమాలు కఠినతరం చేసింది. అధికారికంగా ఉద్యోగాలు అమెరికన్లకే ఇవ్వాలనే ఉద్దేశం ఉన్నా, వ్యాపారులు దానికి ప్రత్యామ్నాయ పద్ధతులు కనుగొనడంలో దిట్టలే. ఇప్పుడున్న పరిస్థితుల్లో సాంకేతికత వ్యాపారాలకు మరింత సౌలభ్యాన్ని ఇచ్చింది. అమెరికాలోని కేఫేల్లో కౌంటర్ వద్ద కూర్చొని బిల్లు వేయడంలో పాల్గొనేవాడు వాస్తవానికి ఇతర దేశంలో ఉన్న వర్చువల్ క్యాషియర్. ఆన్లైన్ సహకార ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా విదేశీ ఉద్యోగులు ఒక్క గంటకు 3 డాలర్లకు పని చేస్తున్నారు. దీంతో వ్యాపార ఖర్చులు తగ్గినా, స్థానిక ఉపాధి నష్టపోతోందన్నదే స్పష్టమైన సంకేతం.
ఈ మార్పులు కేవలం ట్రంప్ విధానాల ఫలితమేగాక, ప్రపంచ వ్యాప్తంగా నమూనా మార్పు సూచనలు. డిజిటల్ కనెక్టివిటీ, రిమోట్ జాబ్ మోడల్‌లతో వ్యాపారాలు గ్లోబల్ కార్మికశక్తిని ఆదుకుంటున్నాయి. కానీ దీని దీర్ఘకాల ప్రభావం స్థానిక కార్మిక విధానాలపై తీవ్రమైందిగా మారవచ్చు. ఆర్థిక లెక్కల్లో వ్యాపారులకు లాభం, కానీ సామాజికంగా సంక్షోభం. అమెరికాలో వస్తున్న ఈ మార్పులు భవిష్యత్ ఉపాధి నమూనాలను పూర్తిగా మార్చే దిశలో ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు.