Homeఅంతర్జాతీయంTrump Unemployment Crisis: ట్రంప్‌ ఎఫెక్ట్‌.. అగ్రరాజ్యంలో నిరుద్యోగ సంక్షోభం..!

Trump Unemployment Crisis: ట్రంప్‌ ఎఫెక్ట్‌.. అగ్రరాజ్యంలో నిరుద్యోగ సంక్షోభం..!

Trump Unemployment Crisis: అమెరికా ఫస్ట్‌.. మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌.. అంటూ అధ్యక్ష ఎన్నికల్లో నినదించిన ట్రంప్‌.. బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆయన ఇవే అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, వీటి కోసం ఆలయ తీసుకుంటున్న దుందుడుకు చర్యలు, అర్థం పర్థం లేని నిర్ణయాలు.. అమెరికాను అప్రతిష్టపాలు చేస్తోంది. ఒకవైపు ఒకత్త ఉద్యోగాలు రాకపోగా, ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయి. దీంతో నిరుద్యోగం పెరుగుతోంది. భారతీయులను ఉద్యోగాల్లో నియమించుకోవద్దని ట్రంప్‌ ఇటీవల ప్రముఖ కంపెనీలకు వార్నింగ్‌ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజా సర్వే అమెరికాలో నిరుద్యోగ తీరును బయటపెట్టింది.

Also Read: ట్రంపూ.. నికిదేం పోయేకాలంరా అయ్యా..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రవేశపెట్టిన టారిఫ్‌ విధానాలు, ప్రపంచ వాణిజ్య యుద్ధం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అమెరికన్‌ లేబర్‌ స్టాటిస్టిక్స్‌ బ్యూరో (బీఎల్‌ఎస్‌) తాజా నివేదిక ప్రకారం, జులై 2025లో నిరుద్యోగ రేటు 4.2%కు చేరుకోగా, కేవలం 73 వేల మందికి మాత్రమే ఉద్యోగాలు లభించాయి. ఇది డౌజోన్స్‌ అంచనాలైన లక్ష ఉద్యోగాల కంటే గణనీయంగా తక్కువ. ఈ నేపథ్యంలో, ట్రంప్‌ టారిఫ్‌లు, ఆర్థిక మాంద్య భయాలు అమెరికా కార్మిక మార్కెట్‌ను దెబ్బతీస్తున్నాయి. అమెరికన్‌ లేబర్‌ స్టాటిస్టిక్స్‌ బ్యూరో నివేదిక ప్రకారం, జులై 2025లో నిరుద్యోగ రేటు 4.1% నుంచి 4.2%కు పెరిగింది, ఇది ఆర్థిక వ్యవస్థలో బలహీనతలను సూచిస్తుంది. ఈ నెలలో కేవలం 73 వేల మందికి మాత్రమే కొత్తగా ఉద్యోగాలు వచ్చాయ. మే, జూన్‌ నెలల్లో నివేదించిన ఉద్యోగాల సంఖ్యను బీఎల్‌ఎస్‌ 2,58,000 తగ్గించింది (మేలో 1,44,000 నుంచి 19,000కి; జూన్‌లో 1,47,000 నుంచి 14,000కి). ఇది కార్మిక మార్కెట్‌లో ఊహించని ఒడిదొడుకులను సూచిస్తుంది. అదనంగా, హౌస్‌హోల్డ్‌ సర్వే ప్రకారం కార్మిక శక్తి పాల్గొనే రేటు 62.2%కు తగ్గింది, దాదాపు 40 వేల మంది కార్మిక శక్తి నుంచి బయటకు వెళ్లారు. ఈ గణాంకాలు ట్రంప్‌ టారిఫ్‌లు కార్మిక మార్కెట్‌పై చూపుతున్న ప్రతికూల ప్రభావాన్ని స్పష్టం చేస్తున్నాయి.

ఆర్థిక మాంద్య భయాలు..
ట్రంప్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఏప్రిల్‌ 2025లో ప్రవేశపెట్టిన సమగ్ర టారిఫ్‌లు (చైనాపై 145%, కెనడా, మెక్సికోపై 25%, ఇతర దేశాలపై 10–20%) అమెరికా ఆర్థిక వ్యవస్థను ఒత్తిడిలోకి నెట్టాయి. ఈ టారిఫ్‌లు వినియోగదారులకు, వ్యాపారాలకు ధరల పెరుగుదల రూపంలో భారం మోపాయి, ఫలితంగా వినియోగ వ్యయం తగ్గింది. ఈ టారిఫ్‌లు 2025లో జీడీపీని 0.8% తగ్గించి, నిరుద్యోగ రేటును 5.3%కు పెంచే అవకాశం ఉంది. ఈ విధానాలు ఆర్థిక మాంద్యంలోకి దారితీస్తాయని ఎక్స్‌పర్ట్స్‌ హెచ్చరించారు. కంపెనీలు ఖర్చులను తగ్గించేందుకు నియామకాలను నిలిపివేస్తూ, లే ఆఫ్‌లను ప్రకటిస్తున్నాయి. ఇది ఆర్థిక అనిశ్చితిని మరింత పెంచుతోంది.

మూడు రంగాల్లోనే కొత్త జాబ్‌స..
జులై 2025లో కల్పించిన 73 వేల ఉద్యోగాలు కూడా ఆరోగ్య సంరక్షణ, సామాజిక సేవలు, రిటైల్‌ రంగాల్లో మాత్రమే నమోదయ్యాయి. ఇదే సమయంలో తయారీ (మాన్యుఫాక్చరింగ్‌) రంగంలో 11 వేల ఉద్యోగాలు, ఫెడరల్‌ ప్రభుత్వ రంగంలో 12 వేల ఉద్యోగాలు తగ్గాయి. ట్రంప్‌ పరిపాలన ఫెడరల్‌ ఉద్యోగాలను గణనీయంగా తగ్గిస్తుండటం, టారిఫ్‌లు తయారీ రంగంపై చూపుతున్న ప్రతికూల ప్రభావం ఈ రంగాల్లో ఉద్యోగ నష్టాలకు కారణమవుతున్నాయి. ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సప్లై మేనేజ్‌మెంట్‌ సర్వేలో ఒక ఫ్యాక్టరీ మేనేజర్, ‘టారిఫ్‌ యుద్ధాలు మమ్మల్ని అలసిపోయేలా చేస్తున్నాయి, భవిష్యత్తు అనిశ్చితంగా ఉంది‘ అని వ్యాఖ్యానించారు, ఇది వ్యాపార వర్గాల్లో నెలకొన్న అస్థిరతను సూచిస్తుంది.

ఫెడరల్‌ రిజర్వ్‌పై ఒత్తిడి..
ట్రంప్‌ టారిఫ్‌ల వల్ల ధరల పెరుగుదల, ఆర్థిక అనిశ్చితి కారణంగా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను తగ్గించే ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ట్రంప్, ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌పై విమర్శలు గుప్పిస్తూ, వడ్డీ రేట్లను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. అయితే, పావెల్‌ టారిఫ్‌ల వల్ల ధరల పెరుగుదల దీర్ఘకాలిక ద్రవ్యోల్బణానికి దారితీస్తుందనే ఆందోళనతో రేట్లను యథాతథంగా ఉంచారు. సెప్టెంబర్‌ 2025లో జరిగే ఫెడ్‌ సమావేశంలో రేట్‌ కోతలపై అంచనాలు పెరిగాయి, కానీ టారిఫ్‌ల ప్రభావం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.

Also Read: ఇండియాతో కటీఫ్.. పాకిస్తాన్ తో దోస్తీ.. దెబ్బకొట్టిన ట్రంప్.. కారణం ఇదే

ఆర్థిక మాంద్యం..
ట్రంప్‌ టారిఫ్‌లు అమెరికా ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి నెట్టే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. 2025 మొదటి త్రైమాసికంలో జీడీపీ 0.3% తగ్గింది. ఇది టారిఫ్‌లు, వినియోగదారుల విశ్వాసం తగ్గుదలకు సంకేతం. కన్ఫరెన్స్‌ బోర్డ్‌ కన్సూ్యమర్‌ కాన్ఫిడెన్స్‌ ఇండెక్స్‌ ఐదు నెలలుగా తగ్గుతూ, 2009 తర్వాత అత్యల్ప స్థాయికి చేరింది. పెన్‌ వార్టన్‌ బడ్జెట్‌ మోడల్‌ అంచనా ప్రకారం, టారిఫ్‌లు జీడీపీని 8%, వేతనాలను 7% తగ్గించవచ్చు, మధ్య–ఆదాయ కుటుంబాలకు జీవితకాలంలో 58 వేల డాలర్ల నష్టం వాటిల్లవచ్చు. ఈ పరిస్థితులు ఆర్థిక మాంద్య భయాలను మరింత బలపరుస్తున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular