Homeఅంతర్జాతీయంDonald Trump Border Wall: ట్రంప్ గోడ కట్టేస్తున్నాడు.. ఇలాగైతే అమెరికా అడుక్కు తినడమే..

Donald Trump Border Wall: ట్రంప్ గోడ కట్టేస్తున్నాడు.. ఇలాగైతే అమెరికా అడుక్కు తినడమే..

Donald Trump Border Wall: పరిపాలకుడికి దూర దృష్టి ఉండాలి. మూర్ఖత్వం ఉండకూడదు. ఆలోచన ఉండాలి.. ఆవేశం ఉండకూడదు. పరిపాలన మీద పట్టు ఉండాలి. పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా వ్యవహరించకూడదు. ఇవన్నీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

ప్రపంచ దేశాల మీద ఇప్పటికే టారిఫ్ లు విధించాడు ట్రంప్ మహాశయుడు. ఇరాన్ దేశం మీద అనవసరమైన యుద్ధాన్ని ప్రకటించాడు. నెలల పాటు యుద్ధం చేసి ప్రపంచాన్ని ఇబ్బందుల్లో పెట్టాడు. చివరికి అమెరికా ప్రజలకు చుక్కలు చూపించాడు. యుద్ధం మీద అమెరికా పార్లమెంట్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ట్రంప్ వెనక్కి తగ్గాడు. అంతేకాదు ఇప్పుడు శాంతి వచనాలు వల్లిస్తున్నాడు.

ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయమే కాదు.. అమెరికాకు పొరుగున ఉన్న దేశాల మీద తీసుకుంటున్న నిర్ణయాలు కూడా వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇప్పటికే మెక్సికో సరిహద్దుల్లో గోడను మరింత పటిష్టంగా నిర్మిస్తున్నడు ట్రంప్. అమెరికా దేశంలో ఉంటున్న మెక్సికో ప్రజలను బలవంతంగా యుద్ధ ఖైదీల మాదిరిగా తరలించాడు. అమెరికాలో ఉంటున్న మెక్సికో దేశస్థులను వెళ్ళగొడుతున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ మెక్సికో ప్రజలు అమెరికా నుంచి వెళ్ళిపోతే.. శ్వేత దేశ ప్రజలు అడుక్కుతినాల్సిందే.

మనదేశంలో వివిధ రాష్ట్రాల్లో బీహార్.. ఉత్తర్ ప్రదేశ్.. వెస్ట్ బెంగాల్ కూలీలు పని చేస్తుంటారు. ఎందుకంటే ఆ రాష్ట్రాలలో జనాభా ఎక్కువగా ఉంటుంది. అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ మూడు రాష్ట్రాల కూలీలు గనుక లేకపోతే భారత దేశంలో అనేక ప్రాంతాలలో అన్ని పనులు ముందుకు సాగవు. చాలావరకు కార్యకలాపాలు ఆగిపోతాయి. తద్వారా నష్టం చోటు చేసుకుంటుంది. సేమ్ అమెరికాలో కూడా ఇదే పరిస్థితి. అమెరికాలో ఇంటి పని.. వంట పని.. మూత్రశాలలు.. మరుగుదొడ్లు శుభ్రపరచడం.. గార్డెన్ లో గడ్డి కత్తిరించడం.. వీధులు ఊడ్చడం.. కొమ్మలు కత్తిరించడం వంటి పనులను మెక్సికో కార్మికులు చేస్తుంటారు.

మెక్సికో దేశంలో అంతగా సదుపాయాలు ఉండవు. అందువల్లేవారు ఉపాధి కోసం అమెరికా వస్తుంటారు. ఇప్పుడు మెక్సికో సరిహద్దుల్లో ట్రంప్ గోడ కట్టిస్తున్నాడు. మెక్సికో ప్రజలు రావద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఇదే గనక దీర్ఘకాలంలో జరిగితే అమెరికాలో పనిచేసే వారు ఉండరు. అప్పుడు అమెరికా మొత్తం మురికి మయంగా మారుతుంది. పనిచేసే వారు ఉండరు కాబట్టి అమెరికా అడుక్కుతినాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version