https://oktelugu.com/

Toughest Exam: ప్రపంచంలో అత్యంత కష్టమైన పరీక్ష.. క్వాలిఫై కావాలంటే కష్టమే

మన దేశంలో ఎన్నో కష్టతరమైన పరీక్షలు ఉన్నాయి. ఎవరికి అయిన ఈ ప్రశ్న వేసిన.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని అంటారు. ఎందుకంటే ఐఏఎస్ కావడం చాలా కష్టం. అయితే ఈ పరీక్ష ప్రపంచంలో అన్నింటికంటే కఠినమైనదని అందరూ అనుకుంటారు. కానీ ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్ష Gaokao. ఈ పరీక్షను చైనాలో హైస్కూల్ చివరి ఏడాది చదువుతున్న పిల్లలకు పెడతారు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 5, 2025 / 02:31 AM IST

    Exams

    Follow us on

    Toughest Exam: మన దేశంలో ఎన్నో కష్టతరమైన పరీక్షలు ఉన్నాయి. ఎవరికి అయిన ఈ ప్రశ్న వేసిన.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని అంటారు. ఎందుకంటే ఐఏఎస్ కావడం చాలా కష్టం. అయితే ఈ పరీక్ష ప్రపంచంలో అన్నింటికంటే కఠినమైనదని అందరూ అనుకుంటారు. కానీ ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్ష Gaokao. ఈ పరీక్షను చైనాలో హైస్కూల్ చివరి ఏడాది చదువుతున్న పిల్లలకు పెడతారు. అంటే విద్యార్థులు కాలేజీలో జాయిన్ కావడానికి ఈ పరీక్షను రాస్తారు. ఏటా జరిగే ఈ పరీక్షను రెండు రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో పాస్ కావడం చాలా కష్టం. ఈ పరీక్ష 750 మార్కులకు ఉంటుంది. చైనాలోని ఉత్తమ విశ్వవిద్యాలయాలలో విద్యార్థులు సీటు సంపాదించాలంటే 600 కంటే ఎక్కువ మార్కులు రావాలి. ఇంతకంటే తక్కువ వస్తే మళ్లీ రెండోసారి కూడా పరీక్ష రాసుకోవచ్చు.

    Gaokao పరీక్ష ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్ష. అయితే చైనాలోని అగ్ర జాతీయ విశ్వవిద్యాలయాలలో సుమారు 50,000 నుంచి 60,000 సీట్ల కోసం 13 మిలియన్లకు పైగా విద్యార్థులు పరీక్షకు హాజరవుతారు. అంటే ఒక్కో సీటుకు 260 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు. పరీక్ష వ్యవధి 9 గంటలు. దీని బట్టి రెండు నుంచి మూడు రోజుల్లో నిర్వహిస్తారు. ఈ పరీక్షకు చైనీస్ భాషతో పాటు సైన్స్, మ్యాథమెటిక్స్, సోషల్ సైన్సెస్, లాంగ్వేజెస్ వంటి సబ్జెక్టులు ఉంటాయి. అయితే విద్యార్థులు ఒక అంతర్జాతీయ భాషను కూడా ఎంచుకోవచ్చు. చైనా పరీక్ష తర్వాత జేఈఈ అడ్వాన్స్‌డ్ రెండవ స్థానంలో ఉంది. భారత దేశంతో పాటు ప్రపంచంలో కూడా ఇది రెండవ అత్యంత క్లిష్టమైన పరీక్షగా ఉంది. ప్రఖ్యాత ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాస్తారు.

    మూడవ స్థానంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష ఉంది. ప్రపంచంలోని అత్యంత కఠినమైన పరీక్షల్లో ఇది మూడవది. ప్రిలిమ్స్, మెయిన్స్ , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి IAS, IPS, IFS, IRS వంటి సెంట్రల్ సివిల్ సర్వీసెస్‌లో ఉద్యోగం ఇస్తారు. ఈ పరీక్షకు చదవడం చాలా కష్టం. ఎందుకంటే ఈ సిలబస్ కఠినమైనది. భారతీయ చరిత్ర, ప్రభుత్వం, సైన్స్, కరెంట్ ఎఫైర్స్ వంటి అనేక సబ్జెక్టులు చదవాలి. ప్రతీ ఏడాది ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఏటా ఎందరో ఈ పరీక్షను రాయగా.. కేవలం వందల సంఖ్యల్లో మాత్రమే అర్హత సాధిస్తారు.