https://oktelugu.com/

Maldives: చేతులు కాలాక ఆకులు పట్టుకున్న మాల్దీవులు.. భారత్‌తో చర్చల వెనుక అసలు కథ ఇదే!

ప్రకృతిపరంగా అందమైన దేశాల్లో మనకు అత్యంత సమీపంలో ఉన్న మాల్దీవులు ఒకటి. పూర్తిగా టూరిజంపై ఆధారపడి ఉన్న ఈ దేశంలో గతేడాది జిరిగిన ఎన్నికల్లో ముయిజ్జు నేతృత్వంలోని భారత వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడింది. చైనాతో చేతులు కలిపింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 13, 2024 / 12:16 PM IST

    Maldives

    Follow us on

    Maldives: భారత దేశానికి నైరుతిన హిందు మహాసముద్రంలోని కొన్ని పగడపు దీవుల సముదాయాలతో ఏర్పడిన దేవం మాల్దీవులు. 26 పగడపు దిబ్బలతో మొత్తం 1,196 దీవులు ఉన్నాయి. గతేడాది నవంబర్‌లో మాల్దీవుల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో భాకత అనుకూల అధ్యక్షుడిగా గుర్తింపు ఉన్న ఇబ్రహీం మహ్మద్‌ సోలి ఓడిపోయారు. భారత వ్యతిరేకి అయిన మహమ్మద్ ముయిజ్జు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో భారత్, మాల్దీవుల మధ్య అప్పటి వరకు ఉన్న సంబంధాలు దెబ్బతిన్నాయి. చైనాతో సంబంధాలు పెట్టుకున్న ముయిజ్జు.. మనతో వ్యాపార సంబంధాలు దెబ్బతీసుకున్నాడు. ముయిజ్జు క్యాబినెట్‌లోని మంత్రులు మన ప్రధాని నరేంద్రమోదీపై నేరుగా విమర్శలు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది. తర్వాత క్షమాపణ చెప్పినా అప్పటికే మోదీ మాల్దీవులను దెబ్బ కొట్టేందుకు వ్యూహ రచన చేశారు. లక్ష్యద్వీప్‌ను తెరపైకి తెచ్చారు. టూరిస్టులు లక్ష్యద్వీప్‌కు వెళ్లాలని తాను స్వయంగా లక్ష్యద్వీప్‌కు వెళ్లి ప్రచారం చేశారు. దీంతో మాల్దీవులు టూరిజం ఒక్కసారిగా దెబ్బతిన్నది. మాల్దీవులు టూరిజంలో మెజారిటీ వాటా మన దేశం నుంచే ఉంది. మన టూరిస్టులు తగ్గిపోవడంతో మాల్దీవులకు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. మరోవైపు అండగా ఉంటామన్న చైనా.. హ్యాండిచ్చింది. చైనా టూరిస్టులతో వచ్చే ఆదాయం యూడా పెద్దగా లేదు. దీంతో భారత వ్యతిరేకిగా ఉన్న ముయిజ్జు మళ్లీ భారత్‌తో సత్సంబంధాలు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే భారత్‌ను వాళ్ల దేశానికి ఆహ్వానించి చర్చలు జరిపారు. వాణిజ్య సంబంధాల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నారు. తప్పు దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు.

    విదేశాంగ మంత్రి జయశంకర్‌తో చర్చలు..
    మూడు రోజుల క్రితం మూడు రోజుల పర్యటన కోసం భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ మాల్దీవులకు వెళ్లారు. ఆదే శ అధ్యక్షుడు మెహమ్మద్‌ మెయిజ్జుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ అనేక అంశాలపై చర్చలు జరిపారు. ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపైనా చర్చించారు. 2023 జనవరిలో చివరిసారిగా జైశంకర్‌ మాల్దీవులకు వెళ్లారు. భారత్‌– మాల్దీవుల మధ్య సత్సంబంధాలను బలోపేతం కోసం ఇరు దేశలు కట్టుబడి ఉన్నాయని తెలిపారు. తమ మిత్ర దేవాలకు భారత్‌ అండగా ఉంటుందని తెలిపారు. అవసరమైన సహాయం అందిస్తుందని పేర్కొన్నారు.

    భారత్, మాల్దీవుల మధ్య ఉద్రిక్తత
    2023 నవంబర్‌లో చైనాకు అనుకూలమని భావించే ముయిజ్జు అత్యున్నత కార్యాలయ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మాల్దీవులకు చేరుకోవడం సంతోషంగా ఉందని జైశంకర్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. విమానాశ్రయంలో నాకు స్వాగతం పలికినందుకు విదేశాంగ మంత్రి మూసా జమీర్‌కు ధన్యవాదాలు. మా నైబర్‌హుడ్‌ ఫస్ట్‌ పాలసీ, ఓషన్‌ అప్రోచ్‌లో మాల్దీవులు ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి.

    ఆరు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం..
    మాల్దీవులలో కమ్యూనిటీ సాధికారత కోసం భారతదేశం నిబద్ధతలో మరో మైలురాయి అని మూసా జమీర్‌ అన్నారు. డా. ఎస్‌. జైశంకర్‌తో కలిసి భారతీయ గ్రాంట్‌ సహాయం కింద సంయుక్తంగా పూర్తి చేసిన ఆరు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు.