Countries Name Change: ప్రస్తుతం మనకు తెలిసిన ప్రపంచం.. ఒకప్పటి ప్రపంచం రెండు భిన్న ధ్రువా లాంటివి. నాగరికత పెరుగుతున్న కొద్దీ తారతమ్యాలే కాక అడ్డుగోడలు కూడా కట్టుకొని ఎవరికి వారుగా ప్రపంచ దేశాలు విడిపోయాయి. సహజంగానే కొన్ని దేశాలు కొండలు , సముద్రాలు లాంటి సహజ అడ్డుగోడల వల్ల వేరుగా ఉంటే కొన్ని మాత్రం కులం ,మతం, ప్రాంతం, భాష, సంస్కృతి ఇలా రకరకాల కారణాలవల్ల వేరు పోయిన దేశాలు ఉన్నాయి.
ప్రస్తుతం మనకు తెలిసిన దేశాల పేర్లు కూడా ఒకప్పుడు ఉండేవి కాదు. భారతదేశంలో మనిషి అభివృద్ధికి కొలమానంగా తీసుకునే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సమయంలో ఉన్న ప్రాంతాలు ఇప్పుడు పలు రకాల రాష్ట్రాలగా దేశాలుగా విభజించబడ్డాయి. అయితే మనకు తెలిసి చాలా దేశాలు తమ పేరు మార్చుకున్నాయి. ఇందుకోసం రకరకాల కారణాలు ఉన్నాయి. సరే ఆ విషయం పక్కన పెడితే ఇంతకీ ఈ రకంగా పేర్లు మార్చుకున్న ఏడు దేశాలు ఏవో ఓ లుక్ వేద్దాం పదండి…
1. రిపబ్లిక్ ఆఫ్ మెసిడోనియా …. నార్త్ మెసిడోనియా
ఈ మార్పు 2019లో జరగడం వల్ల చాలా మందికి తెలిసే ఉంటుంది. మాసిడోనియా అనే పేరు ఉపయోగించడం వల్ల గ్రీస్‌లో వ్యక్తమైనటువంటి పలు రకాల అభ్యంతరాలకు తెరదింపింది. పైగా ఇలా చేయడం వల్ల ఉత్తర మాసిడోనియా యొక్క నాటో సభ్యత్వం, రెండు దేశాల మధ్య సంబంధ బాంధవ్యం మెరుగుపరచడానికి మంచి మార్గం కూడా ఏర్పడింది.
2.సిలోన్ … శ్రీలంక
రావణుడి లంకగా భారతీయుల మహాకావ్యమైన రామాయణంలో వర్ణించబడిన .. సింహళం…సిలోన్ ద్వీపం.. 1972 ప్రాంతంలో తన పేరు మార్చుకొని శ్రీలంకగా అవతరించింది. సింహల భాషలో శ్రీలంక అంటే ప్రకాశవంతమైన భూమి అని అర్థం వస్తుంది.. కాబట్టి తమ దేశం యొక్క సహజ సౌందర్యాన్ని అభివర్ణించడానికి ఈ పేరు సరిపోతుంది అని లంకవాసులు అభిప్రాయపడ్డారు.
3. బర్మా …మయన్మార్
అఖండ భారత భూమిలో భాగమైన బర్మా…బ్రిటిష్ వాళ్ళ పుణ్యమా అని…మన పొరుగు దేశంగా అవతరించింది. అయితే 1989లో బర్మాను పరిపాలిస్తున్న మిలిటరీ జుంటాచే ఈ దేశం పేరు మయన్మార్ గా మార్చబడింది.
4. కాంగో డెమోక్రటి …రిపబ్లిక్‌కి జైర్
1997లో ఆఫ్రికా ఖండానికి చెందిన జైర్ దేశం తన పేరును డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో గా మార్చుకుంది. మూడు దశాబ్దాల నిరంకుశ పాలన చేసిన మొబుటు సేసే సెకో నియంత పాలన నుంచి ప్రజాస్వామ్య పాలన వ్యవస్థకు మారే క్రమంలో ఈ మార్పు సంభవించింది.
5. సియామ్ .. థాయిలాండ్
1939లో సియామ్ తన పేరును థాయిలాండ్ గా మార్చడం జరిగింది. థాయిలాండ్ అంటే స్వేచ్ఛ భూమి అనే అర్థం వస్తుంది.. సాయి ప్రజల యొక్క ఐక్యత మరియు స్వేచ్ఛ భావాలను ప్రకటించడం కోసం ఈ పేరును ఎంచుకున్నారు.
6. చెకోస్లోవాకియా … చెక్ రిపబ్లిక్ , స్లోవేకియా
1993లో అప్పటివరకు చెకోస్లోవాకియా గుర్తింపు పొందిన దేశం కాస్త.. చెక్ రిపబ్లిక్, స్లోవేకియా …రెండు దేశాలుగా విడిపోయింది.
7. తూర్పు పాకిస్తాన్ .. బంగ్లాదేశ్
భారత్ భూభాగంలో భాగమైన ఈస్ట్ బెంగాల్ ప్రాంతం స్వాతంత్రం సమయంలో పాకిస్థాన్ వైపు వెళ్లిపోయింది. ఆ తర్వాత 1971లో పశ్చిమ పాకిస్తాన్తో జరిగినటువంటి ఘోరమైన యుద్ధం తర్వాత తూర్పు పాకిస్తాన్ స్వాతంత్రాన్ని ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ అనే పేరుతో కొత్త దేశంగా ఆవిర్భవించింది.
Web Title: There is so much history behind the name change of a country how many countries have changed their names
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com