Bird Flu: ప్రపంచానికి మరో ఉపద్రవం!

మెక్సికో వ్యక్తికి ఏవియన్‌ ఫ్లూ లక్షణాలు బయట పడడానికి మూడు వారాల ముందే సదరు వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు అధికారులుతెలిపారు. అతడికి వైరస్‌ ఎక్కడి నుంచి సోకిందనేది మాత్రం వైద్యులు గుర్తించలేదు.

Written By: Raj Shekar, Updated On : June 6, 2024 12:42 pm

Bird Flu

Follow us on

Bird Flu: బర్డ్‌ ఫ్లూ హెచ్‌5ఎన్‌2 వేరియంట్‌తో ప్రపంచంలో తొలి మరణం నమోదైంది. మెక్సికోలో ఓ వ్యక్తి మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించింది. ఈ వైరల్‌ కారణంగా ప్రపంచలో నమోదైన తొలి మరణం ఇదే అని పేర్కొంది. తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, డయేరియా, వాంతులు వంటి లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన 59 ఏళ్ల వ్యక్తి ఏప్రిల్‌ 24న మరణించినట్లు మెక్సికో తమకు సమాచారం ఇచ్చిందని తెలిపింది. అయితే అతను అనారోగ్యంతో బాధపడుతున్నాడని, వైరస్‌ సోకిన తర్వాత ఆరోగ్యం మరింత క్షీణించిందని తెలిపింది.

వైరస్‌కు ముందే అనారోగ్యం..
మెక్సికో వ్యక్తికి ఏవియన్‌ ఫ్లూ లక్షణాలు బయట పడడానికి మూడు వారాల ముందే సదరు వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు అధికారులుతెలిపారు. అతడికి వైరస్‌ ఎక్కడి నుంచి సోకిందనేది మాత్రం వైద్యులు గుర్తించలేదు. మెక్సికో పౌల్ట్రీలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ వైరస్‌ను గుర్తించారు. అయితే అక్కడ ఇనుంచి మనుషులకు సోకే ప్రమాదం చాలా తక్కువ అని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.

కొత్త వేరియంట్‌ విజృంభణ..
మరోవైపు బర్డ్‌ ఫ్లూలోనే మరో వేరియంట్‌ హెచ్‌5ఎన్‌1 అమెరికా డెయిరీల్లో వ్యాపిస్తున్నట్లు గుర్తించారు. అక్కడ పనిచేస్తున్న కొందరికి ఇది సోకినట్లు నిర్ధారించారు. కానీ, మనిషి నుంచి మనిసికి సోకుతున్నట్లు మాత్రం ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు.

భారత్‌లో కూడా..
ఇటీవల భారత్‌లోని పక్షులు, కోళ్లలో కూడా వైరస్‌ కనిపించింది. అసాధారణ మరణాలతో అప్రమత్తమైన కేంద్రం జాగ్రత్తగా ఉండాలని అన్ని రాష్ట్రాలను అలర్ట్‌ చేసింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని పశుసంవర్ధక విభాగంతో పంచుకోవాలని సూచించింది. దీనితో ఏవియన్‌ ఇన్‌ప్లూయెంజాపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ప్రజారోగ్య కార్యాచరణ చేపట్టాలని