https://oktelugu.com/

World: ప్రపంచమా ఊపిరి పీల్చుకో..

బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని ఇటీవల దుబాయ్‌లో జరిగిన కాప్‌ 28 అంతర్జాతీయ పర్యావరణ సదస్సు తీర్మానించింది. పర్యావరణ పరిరక్షణకు కొన్నేళ్లుగా జరుగుతున్న ప్రయత్నాల్లో ఈ తీర్మానం కీలకం.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 26, 2023 2:36 pm
    World Holds Its Breath
    Follow us on

    World:  కొన్ని దశాబ్దాలుగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కాలుష్యం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఓజోన్‌ పొర గండి పూడుతోంది. ప్రధాని నరేంద్రమోదీ చొరవతోపాటు ప్రపంచ దేశాలు కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చొరవతో వాయు కాలుష్యం క్రమంగా తగ్గుముఖం పట్టింది. పెట్రోలియం వాహనాల వినియోగం తగ్గడం అదే సమయంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు వినియోగం పెరగడం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వాయు కాలుష్యం నియంత్రణలోకి వస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. మరోవైపు బ్రెజిల్‌ అమెజాన్‌ అడవుల రక్షణకు తీసుకుంటున్న చర్యలతో క్షీణత బాగా తగ్గింది. మరోవైపు శిలాజ ఇంధన వినియోగం తగ్గించి సోలార్‌ ఇంధన వినియోగం పెరగడం కూడా కాలుష్య నియంత్రణలో కీలకంగా మారింది.

    శిలాజ ఇంధనాలకు స్వస్తి..
    శిలాజ ఇంధనాలకు వీలైనంంత త్వరగా స్వప్తి పలికితేనే గో6్లబల్‌ వార్మింగ్‌ భూతాన్ని రూపుఆపడం సాధ్యమని పర్యావరణ వేత్తలంతా ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు.జ సౌర విద్యుత్‌ వంటి సంప్రదాయేతర ఇంధన వనరులకు మళ్లడం ఇందుకు ముఖ్య మార్గంగా సూచించారు. ఈ విషయంలో ప్రపంచ దేశాలు 2023లో చెప్పుకోదగిన ప్రగతిని సాధించాయి. అంతర్జాతీయంగా సంప్రదాయేతర ఇంధనోత్సత్తి ఈ ఒక్క ఏడాదే 30 శాతం అంటే 107 గగిగా బైట్లకు పైగా పెరిగిందని అంతర్జాతీయ ఇంధన సంస్థ వెల్లడించింది. కాలుష్య కారక దేశాల్లో మొదటి స్థానంలో ఉన్న చైనా ఈ విషయలలో అందరికన్నా ముందు ఉంది. చైనా సౌర విద్యుత ఉత్పత్తి సామర్థ్యం జూన్‌ నాటికే ప్రపంచ ఉమ్మడి సామర్థ్యాన్ని మించి పోయింది. అదే సమయంలో బొగ్గు ఉత్పత్తి కూడా పెరిగింది. అయితే త్వరలోనే అది తగ్గుతుందని భావిస్తున్నారు. ఇక హోలోవీన్‌ వేడుకల సందర్భంగా అక్టోబర్‌ 31 నుంచి వరుసగా ఆరు రోజులు కేవలం సంప్రదాయ ఇంధన వనరులను మాత్రమే వినియోగించిన చైనా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది.

    శిలాజ ఇంధనాలపై తీర్మానం..
    బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని ఇటీవల దుబాయ్‌లో జరిగిన కాప్‌ 28 అంతర్జాతీయ పర్యావరణ సదస్సు తీర్మానించింది. పర్యావరణ పరిరక్షణకు కొన్నేళ్లుగా జరుగుతున్న ప్రయత్నాల్లో ఈ తీర్మానం కీలకం. ఏకంగా 100కుపైగా దేశాలు దీనికి సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఈ దిశగా శక్తివంచన లేకుండా ప్రయత్నించాలని మరో 50కిపైగా దేశాలు అభిప్రాయపడ్డాయి. గతంలో పలు కాప్‌ సదస్సుల్లో ఈ దిశగా ప్రయత్నాలు జరిగినా అవి చర్చల స్థాయిలోనే ఆగిపోయాయి. 28వ సదస్సు మాత్రం కీలక నిర్ణయం తీసుకోవడం కాలుష్య నియంత్రణలో ఒక మైలురాయి.

    పెరిగిన ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాలు..
    పర్యావరణ హిత ఎలక్ట్రిక్‌వ ఆహనాలు ప్రపంచమంతటా దుమ్మురేపుతున్నాయి. 2023లో వాటి అమ్మకాల్లో అంతర్జాతీయంగా భారీగా పెరుగుదల నమోదైంది. అగ్రరాజ్యం అమెరికాలో ఈవీల అమ్మకాలు రికార్డుస్థాయిలో జరిగాయి. 2023లో 10 లక్షలకుపైగా పూర్తిస్థాయి ఎలక్ట్రిక్‌ వాహనాలు అమ్మకాలు జరిగినట్లు బ్లూంబర్గ్‌ నివేదిక వెల్లడించింది. చైనాలో మొత్తం వాహనాల అమ్మకాల్లో 18 శాతం ఈవీలదే. యూరప్‌ దేశాల ప్రజలు కూడా ఈవీల వినియోగం పెంచారు. 2022తో పోలిస్తే 55 శాతం ఈవీల వినియోగం యూరప్‌లో పెరిగింది. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా వాహనాల కొనుగోళ్లలో 15 శాతం ఎలక్ట్రిక్‌ వాహనాలు కొంటున్నారు.

    పూడుతున్న ఓపోన్‌..
    అతినీలలోహిత కిరణాల నుంచి భూమిని రక్షించే కీలకమైన ఓజోన్‌ పొర క్రమంగా కోలుకుంటోంది. కాలుష్యంతో ఓజోన్‌కు ఏర్పడిన రంధ్రం క్రమంగా పూడుతోంది. 2023లో ఇది వేగం పుంజుకుంది. విచ్చలవిడిగా క్లోరోఫోరోకార్బన్ల విడుదల కారణంగా ఓజోన్‌కు రంధ్రం ఏర్పడింది. అది రోజురోజుకూ పెరుగుతూ వచ్చింది. దీంతో 1980 నుంచి శాస్త్రవేత్తలు కాలుష్యం తగ్గించాలని హెచ్చరిస్తూనే వస్తున్నారు. తాజాగా అంతర్జాతీయంగా జరిగిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. పోరో క్లోరో కార్బన్లకు స్వస్తి పలికేందుకు ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలతో ఓపోన్‌ రంధ్రం క్రమంగా పూడుకుంటోంది. ఆరోగ్యంగా తయారవుతోంది.

    అమేజాన్‌ అడవుల రక్షణ..
    అమేజాన్‌ అడవులను ప్రపంచ పాలిట ఊపిరితిత్తులుగా భావిస్తారు. ప్రపంచంలో అతిపెద్ద వర్షాధారిత అడవులివి. బ్రెజిల్‌లో కొన్నేళ్లుగా అడ్డూ అదుపు లేకుండా అడవుల నరికివేత జరిగింది. అయితే ఆ దేశం ఈ ఏడాది అడవుల నరికివేతకు బ్రేక్‌ వేసింది. 60 శాతంపైగా అమేజాన్‌ అడవులు ఆదేశంలో ఉండడం, పెద్ద ఎత్తున నరికివేతలు జరుగడం పర్యావరణానికి ముప్పుగా మారింది. 2023లో ఆ దేశం తీసుకున్న చర్యలు ఇప్పుడు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. కాలుష్య నియంత్రణకు తోడ్పడుతోంది. దీంతో ప్రపంచం మొత్తం ఊపిరి పీల్చుకుంటోంది.