America: ప్రపంచంలో ఐదో ఆర్థిక శక్తిగా ఎదిగిన భారత్‌తో మైత్రికి అమెరికా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. రెండో స్థానంలో ఉన్న చైనా అమెరికాను పడగొట్టాలని చూస్తోంది. ఈతరుణంలో అమెరికా భారత్‌ను బలోపేతం చేసే దిశగా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా దైపాక్షిక బంధాలను మరింత బలపరిచే చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా భారతీయులకు వరుసగా రెండో ఏడాది ఏకంగా 10 లక్షలకన్నా ఎక్కువ నాన్ ఇమ్మిగ్రేషన్ వీసాలు జారీ చేసింది.
అమెరికాలో భారతీయుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఇందులో చదువుకోవడానికి వెళ్లేవారితోపాటు సందర్శన క ఓసం వెళ్లే పర్యాటకుల సంఖ్య కూడా ఎక్కువ. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇటీవల జారీ చేసిన 10 లక్షల నాన్ ఇమ్మిగ్రేషన్ వీసాలలో ఎక్కువ భాగం విజిటర్ వీసాలు ఉన్నట్లు తెలిసింది. ఇక హెచ్–1బీ వీసాల రెన్యూవల్‌కు సంబంధించిన కార్యక్రమాన్ని నకూడా రిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ అమలు చేసింది. దీంతో ఎంతో మంది భారతీయులకు ప్రయోజనం కలుగుతుంది.
ఐదు రెట్లు పెరిగిన సందర్శకులు..
నాలుగు సంవత్సరాలలో భారత్ నుంచి అమెరికా వెళ్లే సందర్శకుల సంఖ్య ఐదు రెట్టు పెరిగింది. 2024లో మొదటి 11 నెలల్లో భారత్ నుంచి 20 లక్షల కన్నా ఎక్కువ మంది అమెరికా వెళ్లారు. 2023తో పోలిస్తే ఈ సంఖ్య 26 శాతం పెరిగింది. ఇప్పటికే 50 లక్షల మంది భారతీయులు యూఎస్‌ఏను సందర్శించడానికి నాన్ ఇమిగ్రేషన్ వీసా కలిగి ఉన్నట్లు సమాచారం. ఇలాంటి వీసాలను ప్రతీరోజు జారీ చేస్తున్నట్లు అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది.
హెచ్–1ఈ వీసాలు కూడా..
ఇక చదువు కోవడానికి అమెరికా వెళ్లే భారతీయులకు జారీ చేసే హెచ్–1బీ వీసాల సంఖ్య కూడా పెరుగుతోంది. అక్కడ ఉన్నత విద్య కోసం వెళ్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. 2009, 2009లో అమెరకాకు ఎక్కువ మంది విద్యార్థులను పంపిన దేశంగా భారత్ రికార్డు బ్రేక్ చేసింది. ఆ రెండేళ్లలో 3,31,000 మంది అమెరికా వెళ్లారు. ఇక ఎక్సేంజ్ విజిట్ వీసాలు పొందిన భారతీయులు కూడా యూఎస్‌లు ఉంటున్నారు. వారి ప్రోగ్రామ్‌లను పూర్తిచేసిన తర్వాత రెండేళ్లపాటు అక్కడే ఉండొచ్చు. ఇది వారి కేరీర్, విద్యను కొనసాగించడానికి అనుకూలంగా ఉంది. అయితే ఎక్సేంజ్ విజిటర్స్ స్కిల్స్ లిస్ట్ నుంచి ఇండియాను తొలగించడం వలన భారతీయులు నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా హోల్డర్లకు ఎక్కువ సౌలభ్యం లభించింది.