Bangladesh Crisis : బంగ్లాదేశ్‌లో ప్రజాస్వమ్యంగా ఎన్నికైన అధ్యక్షురాలు దేశం విడిచిన తర్వాత ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో అరాచకాలు సాగుతున్నాయి. ప్రధానంగా మైనారిటీలు అయిన హిందువులపై దాడులు ఆగడం లేదు. హిందువులే లక్ష్యంగా అక్కడి ముస్లింలు దాడులు చేస్తున్నారు. తాత్కాలిక ప్రభుత్వం కూడా హిందువులపై దాడులను ప్రోత్సహిస్తోంది. దీంతో భారత్‌లో హిందూ సంఘాలు ఆందోళన, నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇస్కాన్‌కు చెందిన కృష్ణదాసును దేశద్రోహం కేసులో అరెస్టు చేయడంతో మళ్లీ హిందువులపై దాడులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో పరిస్థితిని గమనిస్తున్న అగ్రరాజ్యం అమెరికా కీలక సూచనలు చేసింది.
స్వేచ్ఛకు భంగం కలిగించొద్దు..
బంగ్లాదేశ్‌లో పరిణామాలపై అమెరికా కీలక సూచనలు చేసింది. అక్కడ పౌరుల ప్రాథమిక స్వేచ్ఛకు భంంగం కలిగించొద్దని మద్యంతర ప్రభుత్వానికి సూచించింది. మత, ప్రాథమిక, మానవ హక్కులను గౌరవింలని ఆదేశించింది. ఈమేరకు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వాలన్నీ చట్టాలను గౌరవించాలన్నారు. నిర్బంధంలో ఉన్నవారికి కూడా ప్రాథమిక స్వేచ్చని ఇస్తూ మానవ హక్కులకు భంగం కలుగకుండా చూడాలని కోరారు.
భారత్ చొరవతోనే స్వాతంత్రం..
మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌కు భారత్ చొరవతోనే స్వాత్రంత్యం వచ్చింది. మొదట్లో పాకిస్తాన్‌లో భాగంగా ఉంది. అయితే స్వతంత్ర దేశంగా ఉండేందుకు అంతర్గత పోరాటం మొదలైంది. ఈ నేపథ్యంలో భారత్ కూడా బంగ్లాదేశ్‌కు స్వతంత్ర దేశంగా ఏర్పడానికి సాయం చేసింది. దాయాది దేశంతో యుద్ధానికి కూడా వెనుకాడలేదు. కానీ అన్నం పెట్టిన చేతికే సున్నం పెట్టిన్లు.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం వ్యవహరిస్తోంది. షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నంతకాలం ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగాయి.