https://oktelugu.com/

UK Visa Rules 2024: వీసా నిబంధనలపై వెనక్కి తగ్గిన యూకే.. బ్రిటిష్‌ పౌరులు, శాశ్వత నివాసితులు తమ బంధువులకు ఊరట!

అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగం చేయాలంటే.. ఉన్నత విద్య అభ్యసించాలంటే హెచ్‌–1బీ వీసా తప్పనిసరి. భారతీయు టెకీలకు అక్కడి కోర్టు ఉపశమనం కల్పించే వార్త చెప్పింది. ఇక యూకే కూడా తాజాగా మరో శుభవార్త చెప్పింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 7, 2024 / 11:54 AM IST

    UK Visa Rules 2024

    Follow us on

    UK Visa Rules 2024: అమెరికాలోని భారతీయ టెకీలకు ఇది శుభవార్త. హెచ్‌–1బీ వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములు అమెరికాలో పని చేయడానికి అపీలేట్‌ఓర్టు అనుమతి ఇచ్చింది. డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా సర్క్యూట్‌ కోసం అమెరికా కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌పై ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్‌ ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికాలో జన్మించిన టెక్‌ వర్కర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రూప్‌ అయిన సేవ్‌ జాబ్స్‌ నుండి వచ్చిన సవాల్‌ను కోర్టు తోసిపుచ్చింది. తాజాగా బ్రిటన్‌లోని భారతీయులకు ఊరట కలిగించే విషయం చెప్పింది ప్రభుత్వం. బ్రిటిష్‌ పౌరులు, శాశ్వత నివాసితులు (భారత వారసత్వం ఉన్నవారితో సహా) తమ బంధువులను కుటుంబ వీసాపై తీసుకువచ్చేందుకు ఉన్న నిబంధనలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇందుకు సంబంధించి వార్షిక ఆదాయ పరిమితిని పెంచుతూ రిషి సునాక్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పక్కనపెట్టింది. దీంతో వార్షికాదాయం 38 వేల పౌండ్లు (రూ.41.5 లక్షలు) ఉండనవసరం లేదు. లేబర్‌ పార్టీ నిర్ణయం అక్కడ నివసిస్తోన్న అనేక మంది భారతీయులకు ఉపశమనం కలిగించనుంది.

    ఆదాయ పరిమితి పెంపు..
    బ్రిటిష్‌ పౌరులు, శాశ్వత నివాసితులు (భారత వారసత్వం ఉన్నవారితో సహా) తమ బంధువులను కుటుంబ వీసాపై తీసుకువచ్చేందుకు పటుంబ ఆదాయ పరిమితిని రిషి సునక్‌ సర్కార్‌ పెంచింది. 29 వేల పౌండ్ల నుంచి 38,700 పౌండ్లకు పెంచాలని నిర్ణయించింది. అయితే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్లు తెలిపింది. ఈమేరకు బ్రిటన్‌ హోంశాఖ మంత్రి యెవెట్‌ కూపర్‌ ఇటీవల ప్రకటించారు. 2025 నుంచి అమల్లోకి తీసుకురానున్న ఈ విధానాన్ని వలసవాద సలహా కమిటీతో సమీక్షించాలని నిర్ణయించామన్నారు. అంతవరకు ప్రస్తుతం ఉన్న కుటుంబ ఆదాయ పరిమితి 29 వేల పౌండ్లుగానే ఉండనుందని చెప్పారు. వలసలకు సంబంధించి తమ ప్రభుత్వం కొత్త విధానాన్ని అనుసరిస్తుందని కూపర్‌ తెలిపారు. విదేశీయులను నియమించుకునే ముందు, స్థానిక శ్రామిక శక్తికి నైపుణ్యాలను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తామన్నారు.

    వార్షిక ఆదాయం ఇలా..
    ఎవరైనా కుటుంబ వీసాకు స్పాన్సర్‌ చేయాలంటే. వారి కనీస వార్షిక ఆదాయం 29 వేల జీబీపీ (గ్రేట్‌ బ్రిటన్‌ పౌండ్‌)లుగా ఉండాలి. గతంలో ఈ పరిమితి 18,600 జీబీపీలుగా ఉండగా.. దాన్ని ఇటీవలే 55 శాతం మేర పెంచారు. 2025 నుంచి దీనిని 38,700 పౌండ్లకు పెంచాలని రిషి సునాక్‌ ప్రభుత్వం నిర్ణయించింది. వలసలను అడ్డుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఇదీ ఒకటి. అయితే, బ్రిటన్‌ ఇచ్చే కుటుంబ వీసా కేటగిరీల్లో భారతీయులు కూడా భారీ సంఖ్యలో లబ్దిపొందుతుంటారు. 2023లో 5,248 మంది వీసా పొందారు. తాజాగా కీర్‌ స్టార్మర్‌ తీసుకున్న నిర్ణయంతో అనేక మంది భారతీయులతో సహా విదేశీయులకు ఉపశమనం లభించనుంది.