Japan : ఈ ప్రపంచంలో అన్ని దేశాల కంటే జపాన్ టెక్నాలజీలో దూసుకుపోతుంది. అన్ని సౌకర్యాలు ఈ దేశంలో ఉంటాయి. ప్రపంచంలోని అన్ని దేశాలు 2022లో ఉంటే.. జపాన్ మాత్రం 2050లో ఉంటుందని చెప్పవచ్చు. అక్కడి వాతావరణం, పట్టణాలు అన్ని కూడా చూడటానికి చాలా కొత్తగా ఉంటాయి. అయితే ప్రస్తుతం జపాన్‌లో భూత్ బంగ్లాల సంఖ్య పెరిగిపోతుంది. టెక్నాలజీలో దూసుకుపోతున్న జపాన్‌లో ఇంత దారుణంగా భూత్ బంగ్లాల సంఖ్య పెరిగిపోవడంతో ప్రస్తుతం అక్కడి పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రస్తుతం జపాన్‌లో జనాభా తగ్గిపోవడంతో చాలా ఇళ్లు ఖాళీగా ఉంటున్నాయి. ఉన్న జనాభా చివరికి ఆఫీసులు, మిగతా దేశాలకు వెళ్లిపోవడం వల్ల చాలా ఇళ్లు ఖాళీగా ఉంటున్నాయి. జపాన్‌లో మనుషులు చేసే పనులు కూడా రోబోలతో చేయిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ టెక్నాలజీ ఉహకు కూడా అందదు. అలాగే వృద్ధుల సంఖ్య కూడా పెరిగిపోతుంది. దీనివల్ల దేశంలో భూత్ బంగ్లాల సంఖ్య పెరిగిపోతుందని తెలుస్తోంది.
ఇప్పటి వరకు ఇళ్ల కట్టుకున్న వాళ్లు ఉద్యోగాలు పేరుతో ప్రాంతాలు మారడం, అలాగే ఇండిపెండింట్‌గా కటుకున్న ఇంట్లో కంటే అపార్ట్‌మెంట్‌లో ఉండటానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా వీరు ఉద్యోగాల కోసం పట్టణాలకు వెళ్లడం వల్ల ఈ సమస్య ఏర్పడుతోంది. అలాగే వృద్ధులు చనిపోయిన తర్వాత వారికి వారసులు కూడా ఎవరూ లేరు. దీంతో ఆ ఇళ్లన్నీ ఖాళీగా ఉంటున్నాయి. వీటినే భూత్ బంగ్లాలు లేదా అకియా అని పిలుస్తారు. ఈ అకియాకి ముఖ్య కారణం అపార్ట్‌మెంట్‌లు పెరిగిపోవడమేనని నిపుణులు చెబుతున్నారు. పూర్తిగా ఎవరూ ఆ ఇళ్లలో ఉండకపోతే అవన్నీ దుమ్ము, ధూళి పడుతున్నాయి. చివరికి భూత్ బంగ్లాల మారుతున్నాయి. చివరకు ఎవరూ కూడా వెళ్లడానికి ఇష్టపడటం లేదు. దీంతో ప్రజలు ఈ అకియా అంటే చాలా భయపడుతున్నారు. ఇలా ఖాళీగా ఉంటున్న ఇళ్లలో దెయ్యాలు ఉంటున్నాయని భావిస్తున్నారు. ముఖ్యంగా ఆ ఇంట్లో ఎవరైనా మరణిస్తే వారి ఇళ్లు అయితే అసలు ఎవరూ కొనుగోలు చేయడం లేదు. దీనివల్లే ఈ సమస్య ఏర్పడుతుంది. అయితే జపాన్‌లో ఒక ఇళ్లు ఉంటే పర్లేదు. కానీ రెండు ఇళ్లు ఉంటే మాత్రం తప్పకుండా పన్ను చెల్లించాలనే రూల్ ఉంది. ఇది కూడా ఒక కారణం అని చెప్పవచ్చు.
జపాన్‌లో కేవలం పట్టణాలే కాకుండా గ్రామాలు కూడా అకియా విలేజ్‌లా మారుతున్నాయి. ఎంతో మంది గ్రామీణ యువత, కుటుంబాలు ఉపాధి కోసం పట్టణాలకు వెళ్తున్నారు. దీనివల్ల గ్రామాలన్నీ కూడా అకియాలుగా మారుతున్నాయి. అయితే నగరాల్లో అయితే ఈ సమస్య వచ్చే రోజుల్లో ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ఇలాంటి అకియా ఇళ్లను తీసుకోవడం వల్ల వారు భయపడుతున్నారు. దీనికి బదులు కొత్త ఇంటిని నిర్మించుకోవడం మంచిదని భావిస్తున్నారు. ఎంత టెక్నాలజీలో దూసుకుపోతే ఏంటి? దేశంలో మాత్రం ఈ అకియాల సమస్య పెరిగిపోతుంది. ఇది తగ్గాలంటే మాత్రం అందరూ కూడా ఇళ్లను విడిచి వెళ్లకుండా ఉండాలి.