Turkey Plane: ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రయాణాలు పెరుగుతన్నాయి. కాలంతో పాటు పరిగెత్తాల్సిన నేటి పరిస్థితిలో చాలా మంది వృత్తి, వ్యాపారం, ఇతర అవసరాల దృష్ట్యా విమానాల్లో ప్రయాణించేందుకే మొగ్గు చూపుతున్నారు. దీంతో విమానాల సంఖ్య పెరుగుతోంది. విమానయాన సంస్థలు ప్రత్యేకంగా డిమాండ్‌కు అనుగుణంగా విమానాలు నడుపుతున్నాయి. విమాన ప్రయాణం ఎంత వేగమో.. అంతే ప్రమాదకరం కూడా. టేకాఫ్ అయిన విమానం సేఫ్‌గా ల్యాండ్ అయ్యే వరకూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో ఊహించలేం. ప్రమాదం జరిగినా.. ప్రయాణికులు బయట పడడం చాలా అదృష్టం. చచ్చి బితికాం అనుకున్నట్లుగా.. తాజాగా టర్కీ విమానంలోని ప్రయాణికులు ఆ పరిస్థితి ఎదుక్కొన్నారు.
ఏం జరిగిందంటే..
రష్యా నుంచి వచ్చిన టర్కీ విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. ప్యాసింజర్ ప్లేన్‌లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఎయిర్‌పోర్టు సిబ్బంది అప్రమత్తతతో ప్రయాణికులు, విమాన సిబ్బంది అందరూ సురక్షితంగా బయట పడ్డారు. అజిముత్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన సుఖోయ్ సూపర్ జెట్ విమానం(రష్యా) నల్ల సముద్రం తీరాన ఉనన సోచి రిసార్ట్ నుంచి ప్రయాణికులను తీసుకుని టర్కీ అంటల్యా ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అయితే ల్యాండింగ్ సమయంలో ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. క్రమంగా విమానం మొత్తం వ్యాపించాయి.
89 మంది ప్రయాణికులు..
ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 89 మంది ప్రయాణికులతోపాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. వెంటనే పైలట్ విమానాన్ని రన్‌వే ర్యాష్ ల్యాండింగ్ చేశాడు. అయితే సకాలంలో ఎయిర్‌పోర్టు సిబ్బంది స్పందించారు. సినిమాల తరహాలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. విమానం నుంచి అందరినీ సురక్షితంగా బయటకు రప్పించారు. మంటలు ఆర్పేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విమానం ఏడేళ్ల క్రితమే సర్వీస్‌కు వచ్చిందని తెలుస్తోంది. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తుచేస్తున్నట్లు విమానయాన సంస్థ ప్రకటించింది.
This was the terrifying moment a plane the #Russian-made #Sukhoi Superjet 100 passenger plane from #AzimuthAirlines went up in flames following a nightmare landing at a #Turkish #Antalya airport. pic.twitter.com/QY3EmzdQBY
— Hans Solo (@thandojo) November 25, 2024