America: తమకన్నా అభివృద్ధి చెందిన దేశం.. తమకన్న తెలివైనవారు.. తమకన్నా సంపన్నులు లేరనుకుంటారు అమెరికన్లు. పాలకుల నుంచి ప్రజల వరకు అందరూ ఇలాగే భావిస్తారు. కానీ, అమెరికాలో అనేక లోపాలు ఉన్నాయని ఎత్తి చూపుతున్నారు విదేశీయులు. అక్రమంగా అమెరికాలోకి చొరబడుతున్నారు పొరుగు దేశ పౌరులు. ఇక హెచ్–1బీ వీసాల జారీలోనూ అనేక అవకతవకలు జరుగుతున్నాయి. ఇక రక్షణ విషయంలో అయితే చాలా లోపాలు ఉన్నాయి. గన్ కల్చర్ కారణంగా ఎవరు ఎవరిపైద ఆడిచేస్తారో తెలియని పరిస్థితి. ఈ లోపాలనే చాల మంది తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. నేరం చేసి తప్పించుకుతిరుగుతున్నారు.
తెలుగువారు కూడా…
ఇక అమెరికాకు ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం వెళ్తున్నవారు అక్కడ పలు నేరాలకు పాల్పడుతున్నారు. గతంలో దొంగతనాలు చేశారు. వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. వీసాల జారీలోనూ తమ ఇన్‌ఫ్లూయెన్స్‌తో అవకతవకలకు పాల్పడ్డారు. తాజాగా అమెరికాలో వెళ్లిన తెలుగు యువకులు ఓ ముఠాగా ఏర్పడి అక్కడి తెలుగు వ్యాపారులను టార్గెట్ చేశారు. బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. కొందరు వ్యాపారులు వీరిని గమనించి.. నిలదీశారు. పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీనికి సబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.
డల్లాస్ ప్రాంతంలో..
అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో తెలుగు రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్‌ను తెలుగు యువకులు టార్గెట్ చేశారు. వ్యాపారాల్లో లోపాలు ఉన్నాయని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఫిర్యాదు చేయకుండా ఉండాలంటే లక్ష డాలర్లు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. ఐదారు రోజులుగా ఇలా దౌర్జన్యం చేస్తున్న యువకులను అక్కడి వ్యాపారులు పట్టుకున్నారు. వారిని నిలదీశారు. ముగుర్గరు యువకులను వీడియో తీస్తూ నిలదీశారు. లోపాలు ఉంటే అధికారులకు ఫిర్యాదు చేయాలనిగానీ డబ్బులు డిమాండ్ చేయడం ఏంటని ప్రశ్నించారు. అంతేకాకుండా వారి గురించిన వివరాలను ఆరా తీయగా ముగ్గురిలో ఒకరిపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసులు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. డల్లాస్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
గతంలో కూడా...
గతంలో టెక్సాస్‌లోని డెంటన్‌లో బలవంతపు వ్యభిచారాన్ని కట్టడి చేసేందుకు హాయ్‌లాండ్ విలేజ్ పోలీసులు స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో నిఖిల్ బండి, మోనిష్ గల్లా, నిఖిల్ కుమ్మరి, జైకిరణ్ వంటి తెలుగు యువకులు పట్టుపడ్డారు. హెచ్–1బీ వీసాల జారీ విషయంలోనూ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ నాయకుడు అవకతవలలకు పాల్పడినట్లు అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయి. ఇక హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో నలుగురు తెలుగు వారు అరెస్ట్ అయ్యారు. క్లీవ్‌ల్యాండ్‌లో డ్రగ్స్ అమ్మే ముఠా మాస్టర్స్ చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్ అహ్మద్‌ను కిడ్నాప్ చేసింది.
తల్లిదండ్రుల ఆశలపై నీళ్లు..
తమ పిల్లలు అమెరికా వెళ్లి బాగా చదువుకుంటున్నారని తల్లిదండ్రులు భావిస్తున్నారు. కానీ, అక్కడికి వెళ్లిన కొందరు ఇలా అక్రమ దందాలు, బెదిరింపిలు, బ్లాక్‌మెయిల్స్‌కు పాల్పడుతున్నారు. ఉద్యోగాలు వెతుక్కోకుండాడ తెలుగువారి పరువును విదేవీగడ్డపై తీస్తున్నారు.
అమెరికాలో తెలుగు ముఠా
లక్ష డాలర్లు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్
అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో తెలుగు రెస్టారెంట్లు, షాపులు టార్గెట్ చేసి తూనికలు సరిగా లేవంటూ బెదిరిస్తూ లక్ష డాలర్లు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్
రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ తెలుగు యువకులు pic.twitter.com/eoJmPjnRx9
— Telugu Scribe (@TeluguScribe) December 31, 2024