Chocolates Eating Country: చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరికీ కూడా చాక్లెట్లు అంటే ఇష్టం ఉంటుంది. అందులోనూ పిల్లలు అయితే వీటిని చాలా ఇష్టంగా తింటారు. ఉదయం లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు తింటూనే ఉంటారు. తల్లిదండ్రులు ఇవ్వకపోయినా కూడా మారం చేస్తుంటారు. వీటిని ఎక్కువగా తినడం వల్ల పళ్లు పుచ్చిపోతాయి. అయినా కూడా పిల్లలకు కొందరు తల్లిదండ్రులు ఇస్తుంటారు. వీటిలోని తీపి పదార్థాల వల్ల పిల్లలతో పాటు అందరికీ కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. అయినా కూడా చాలా మంది టేస్టీగా ఉన్నాయని ఎక్కువగా తింటారు. ఆ తర్వాత దంతాల సమస్యలు అన్నింటిని కూడా ఎదుర్కొంటారు. పిల్లలకు అయితే తప్పకుండా చాక్లెట్ల నుంచి దూరంగా ఉంచాలి. అయితే ఈ ప్రపంచంలో ఓ దేశం ఎక్కువగా చాక్లెట్లను తింటుంది. ఇంతకీ ఆ దేశం ఏది? ఈ దేశంలో సగటున ఒక్కో మనిషి ఎన్ని చాక్లెట్లు తింటాడు? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగానే చాక్లెట్ ప్రియులు ఉన్నారు. ఎక్కువగా పశ్చిమ ఐరోపా, ఉత్తర అమెరికాలోని ప్రజలు తింటారు. ప్రపంచంలో అత్యధికంగా చాక్లెట్లు తింటున్న దేశం స్విట్జర్లాండ్. ఈ దేశంలో ఒక వ్యక్తి దాదాపుగా ప్రతీ ఏడాది 8.8 కిలోల చాక్లెట్ తింటాడు. స్విట్జర్లాండ్‌లో చాక్లెట్లు కూడా ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ప్రపంచంలోని అత్యుత్తమ చాక్లెట్లు కూడా ఇక్కడే ఉత్పత్తి అవుతాయి. దీని తర్వాత రెండో స్థానంలో జర్మనీ ఉంది. ఇక్కడ సగుటున ఒక వ్యక్తి ఏడాదికి 8.4 కిలోల చాక్లెట్లు తింటారు. అయితే స్విట్జర్లాండ్‌లో చాక్లెట్లు తయారీకి అనేది వారికి వారసత్వంగా వస్తోంది. 19వ శతాబ్దం నుంచే స్విట్జర్లాండ్‌లో చాక్లెట్లు తయారు చేస్తున్నారు. ఇక్కడ ఎక్కువగా స్విస్ చాక్లెట్లు ఉత్పత్తి చేస్తారు. ఈ చాక్లెట్ల నాణ్యతలో స్విట్జర్లాండ్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. చాక్లెట్ తయారీలో స్విట్జర్లాండ్ ముందంజలో ఉంది. డేనియల్ పీటర్ మిల్క్ చాక్లెట్‌ను కనిపెట్టారు అప్పటి నుంచి ఇక్కడ చాక్లెట్ బాగా ఫేమస్ అయ్యింది. ప్రతి సంవత్సరం ఇక్కడ అధిక మొత్తంలో చాక్లెట్లను ఎగుమతి చేస్తుంటారు.
స్విట్జర్లాండ్‌లో ఫేమస్ చాక్లెట్లు ఉన్నట్లు జర్మనీలో కూడా ఉన్నాయి. ఇక్కడ టార్చెన్, లియోనిడాస్ చాక్లెట్లు ఎక్కువగా ఫేమస్. అలాగే బెల్జియంలో కూడా మంచి వెరైటీ చాక్లెట్లు ఉన్నాయి. అయితే ఒక్కో దేశంలో ఒక్కో వ్యక్తి ఏడాదికి చాక్లెట్లు తింటారు. స్విట్జర్లాండ్‌లో ఒక వ్యక్తి 8.8 కిలోలు చాక్లెట్లు తినగా, జర్మనీలో 8.4 కిలోలు, ఐర్లాండ్ 8.3 కిలోలు, యునైటెడ్ కింగ్‌డమ్ 8.2 కిలోలు, నార్వే 8 కిలోలు, స్వీడన్ 7.9 కిలోలు, డెన్మార్క్ 7.5 కిలోలు, నెదర్లాండ్స్ 7.4 కిలోలు, ఫిన్లాండ్ 7.2 కిలోలు, బెల్జియంలో 6.8 కిలోలు తింటారు.