Israel: ఎందుకీ యుద్ధం? ఎవరు మోయాలీ పాపం?

వాస్తవానికి గాజానగరం నుంచి పాలస్తీనా వాసులను వెలగొట్టే అధికారం ఇజ్రాయిల్ దేశానికి లేదు. ఎందుకంటే 1948 లోనే దీనికి సంబంధించి అంతర్జాతీయ ఒప్పందం కుదిరింది. దీనిని ఎట్టి పరిస్థితుల్లో అతిక్రమించబోమని ఇజ్రాయిల్ అప్పట్లో వాగ్దానం చేసింది.

Written By: Suresh, Updated On : February 17, 2024 11:49 am

Israe

Follow us on

Israel: “మంచి యుద్ధం చెడ్డ శాంతి ఉండవు” అని ప్రఖ్యాత తత్వవేత్త జార్జ్ బెర్నార్డ్ షా అప్పట్లో రాశారు. యుద్ధం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని.. కేవలం కొన్ని దేశాల సామ్రాజ్య కాంక్ష మాత్రమే నెరవేరుతుందని ఆయన అప్పట్లో ప్రకటించారు.. ఆయన చెప్పినట్టుగానే ఇప్పటివరకు ప్రపంచంలో జరిగిన యుద్ధాలను పరిశీలిస్తే అదే జరిగినట్టు కనిపిస్తోంది. ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ పై అమెరికా సాగించిన యుద్ధం.. ఉక్రెయిన్ దేశం పై రష్యా సాగిస్తున్న యుద్ధం, తాజాగా పాలస్తీనా పై హమాస్ తీవ్రవాదుల ఏరివేత పేరుతో ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధం.. వీటిల్లో యుద్ధం అనేది కామన్ గా ఉంది. దేశాలు మాత్రమే మారుతున్నాయి. ఆ యుద్ధం వల్ల ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికా ఇరాక్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ పై యుద్ధం సాగించడం వల్ల ప్రపంచ దేశాలు చమురు కొరతతో ఇబ్బంది పడ్డాయి. పెరిగిన ధరలతో ఇబ్బంది పడ్డాయి. ఎండు ఫలాలు అందక ఇబ్బంది పడ్డాయి. ఇక రష్యా ఉక్రెయిన్ పై సాగిస్తున్న యుద్ధంతో యూరప్ దేశాలు సహజవాయువు అందక ఇబ్బంది పడుతున్నాయి.. ఇక ఇజ్రాయిల్ చేస్తున్న దాడులతో పాలస్తీనా నరకం చూస్తోంది. అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తినేందుకు తిండి లేక, తాగడానికి నీరు లేక నరకం చూస్తున్నారు.

తమ దేశానికి భద్రత కల్పించే ఐరన్ డోమ్ పై దాడులు చేశారనే కారణంతో ఇజ్రాయిల్ పాలస్తీనా పై యుద్ధం ప్రకటించింది. దీనికి హమాస్ తీవ్రవాదుల ఏరివేత అని పేరు పెట్టింది. అప్పటినుంచి ఇప్పటివరకు ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్నప్పటికీ ఇజ్రాయిల్ తన ధోరణి మార్చుకోలేదు. పైగా పాలస్తీనాకు గుండెకాయ లాంటి గాజానగరంపై బాంబుల మోత మోగిస్తోంది. ఆ నగరంలో 22 లక్షల వరకు జనాభా ఉంటే.. దానిని రెండు లక్షల వరకు తగ్గిస్తామని ఇజ్రాయిల్ ప్రధానమంత్రి నెతన్యాహు అంటున్నారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గాజా నగరం నుంచి పాలస్తీనా వాసులను వెళ్ళగొట్టడాన్ని నక్బా గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం దానిని ఇజ్రాయిల్ విజయవంతంగా అమలు చేస్తోంది.

వాస్తవానికి గాజానగరం నుంచి పాలస్తీనా వాసులను వెలగొట్టే అధికారం ఇజ్రాయిల్ దేశానికి లేదు. ఎందుకంటే 1948 లోనే దీనికి సంబంధించి అంతర్జాతీయ ఒప్పందం కుదిరింది. దీనిని ఎట్టి పరిస్థితుల్లో అతిక్రమించబోమని ఇజ్రాయిల్ అప్పట్లో వాగ్దానం చేసింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో దానిని విస్మరిస్తోంది. ఇజ్రాయిల్ తీరును నిరసిస్తూ దక్షిణాఫ్రికా అంతర్జాతీయ న్యాయస్థానంలో ఒక తీర్మానం ప్రవేశపెడితే.. 50 ఇస్లామిక్ దేశాలతో పాటు బెల్జియం, బ్రెజిల్, బొలివియా, నమీబియా, కొలంబియా లాంటి దేశాలు దానిని సమర్థిస్తున్నాయి. ఎ
చివరికి పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా దక్షిణాఫ్రికా తీర్మానాన్ని బలపరుస్తున్నాయి. కానీ భారత్ మాత్రం ఈ వ్యవహారంలో అంటి ముట్టనట్టు వ్యవహరిస్తోంది. ఇజ్రాయిల్ దేశం పాలస్తీనా పై బాంబుల మోత మోగిస్తుండగా… అక్కడి ప్రజలకు కనీసం ఔషధాలు, ఆహార పదార్థాలు అందకుండా చేస్తోంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో యూదులు ఏ విధంగానైతే సామూహిక హననానికి గురయ్యారో.. ప్రస్తుతం గాజాలో పాలస్తీనా వాసులు అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మరి ఈ సమయంలో అంతర్జాతీయ సమాజం మేల్కొని పక్షంలో నెతన్యాహు చెప్పినట్టే గాజా జనాభా 22 లక్షల నుంచి 2 లక్షల కు పడిపోతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు.