https://oktelugu.com/

Crime News : తల్లిదండ్రుల మధ్య భీకరమైన గొడవ.. పక్క గదిలో వీడియో గేమ్ ఆడుతున్న కుమారుడు.. ఆ తర్వాత జరిగిన దారుణం ఏంటంటే..

ఇది సోషల్ కాలం. పక్క మనిషి తోనే కాదు.. రక్తసంబంధీకులతోనూ మాట్లాడుకోలేని కాలం. బాధలను, దుఃఖాలను, సంతోషాలను, ఆనందాలను పంచుకోలేని కాలం. ప్రతిదీ సెల్ ఫోన్ ద్వారానే జరిగిపోతుండడంతో.. మనుషులు మనుషులతో మాట్లాడుకోవడం మానేస్తున్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 11, 2024 / 11:59 AM IST

    Crime News

    Follow us on

    Crime News :  సోషల్ మీడియా వల్ల మనిషి జీవితం ఎలా మారిపోతుందో..సెల్ ఫోన్ అదేపనిగా ఉపయోగించడం వల్ల ఎంతటి దారుణం జరిగిపోతుందో ఇప్పటివరకు ఎన్నో సంఘటనలు మనం చూసి ఉన్నాం. మరెన్నో దారుణాలను చదివి ఉన్నాం. కానీ సొంత మనుషులు ప్రాణాలు కోల్పోయినా పట్టించుకోలే ని పరిస్థితి. కనీసం అటువైపు చూడలేని దుస్థితి. ఈ దారుణం అమెరికాలో చోటుచేసుకుంది. ఈ సంఘటన సభ్య సమాజంలో చోటుచేసుకున్న మార్పులు. సెల్ ఫోన్ తీసుకొచ్చిన దుష్పరిణామాలను కళ్ళకు కడుతోంది.. అయితే ఈ సంఘటన గత నెల 31వ తేదీన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇది కాస్త మీడియాలో ప్రసారం కావడంతో సంచలనంగా మారింది.

    ఇంతకీ ఏం జరిగిందంటే

    అమెరికాలోని వాషింగ్టన్ లోని లాంగ్ వ్యూ ప్రాంతంలో అల్వరాడో(38), రోబుల్స్(39) భార్య భర్తలు నివసిస్తున్నారు. వీరికి 11 సంవత్సరాల కుమారుడు ఉన్నారు.. కొంతకాలంగా అల్వరాడో, రోబుల్స్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో వారిద్దరూ ఎడమొహం పెడ మొహం గా ఉంటున్నారు. అయితే గత నెల 31న వారిద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. విచక్షణ కోల్పోయి ఇద్దరు పరస్పరం దాడులు చేసుకున్నారు. అల్వ రాడో, రోబుల్స్ తుపాకి, కత్తితో పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో వారిద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయారు. అయితే అదే పక్క గదిలో వారిద్దరి 11 సంవత్సరాల కుమారుడు వీడియో గేమ్ ఆడుతున్నాడు. తల్లిదండ్రులు తీవ్రంగా గొడవ పడుతున్నప్పటికీ అతడు తన వీడియో గేమ్ లో మునిగిపోయాడు. ఇద్దరు రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకొని చనిపోయిన తర్వాత అతడు.. తన గేమ్ ను ముగించుకొని వచ్చి చూశాడు. చూడగానే ఇద్దరు చనిపోయి కనిపించారు. దీంతో అతడు ఒక్కసారిగా హతాశుడయ్యాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. జరిగిన ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. అయితే అలా వారు చనిపోవడానికి కారణాలు ఏమిటో తెలియ రాలేదు. అయితే ఈ ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. స్మార్ట్ ఫోన్లు, వీడియో గేమ్ లు మనుషుల జీవితాల పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో గుర్తు చేసింది. అందుకే అంటారు యంత్రాలను వాడుకోవాలి. మనుషులను ప్రేమించాలి. కానీ ఇందుకు విరుద్ధంగా ప్రస్తుతం జరుగుతోంది. యంత్రాలను ప్రేమిస్తూ.. మనుషులను వాడుకోవడం వల్ల బంధాలు, అనుబంధాలు కనుమరుగైపోతున్నాయి. “ఈ ఘటన గురించి తెలిసిన తర్వాత బాధ కలుగుతోంది. ఇంతటి దారుణం జరిగినప్పటికీ ఆ కుమారుడు వీడియో గేమ్ ఆడుతున్నాడు అంటే.. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. మనుషులు ఇప్పటికైనా మారాలని” నెటిజన్లు పేర్కొంటున్నారు.