Social Media Ban : ప్రస్తుం సోషల్ మీడియా ప్రపంచాన్ని శాశిస్తోంది. ఫేజ్‌బుక్, వాట్సాప్, టిక్‌టాక్, స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫాంలు కొంతకాలం క్రితం వరకు అనుసంధాన వేదికలుగానే ఉండేవి. దీంతో అందరికీ నచ్చింది. కానీ, ఇప్పుడు అవి శృతి మించుతున్నాయి. హద్దులు దాటుతున్నాయి. అశ్లీల కంటెంట్, ఫేక్ న్యూస్, సైబర్ క్రైం వంటివి పెరుగుతున్నాయి. ఇవి పిల్లలు యువతపై అత్యధిక ప్రభావంచూపుతున్నాయి. పెడదారి పట్టేందుకు దోహదపడుతున్నాయి. పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా సమస్యను గుర్తించిన దేశాలు.. సోషల్ మీడియాపై నిషేధం విధిస్తున్నాయి. ఇటీవలే ఆస్ట్రేలియా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధించింది. ఆస్ట్రేలియా తరహాలోనే అనేక దేశాలు కఠినమైన ప్రైవసీ చట్టాలు, మైనర్లపై నిషేదం వంటి విధానాల ద్వారా సోషల్ మీడియాను నియంత్రిస్తున్నాయి.
ఆస్ట్రేలియా..
సోషల్ మీడియా మినిమమ్ ఏజ్ బిల్లు ప్రకారం ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ యజమాని మెటా నుంచి టిక్‌టాక్ వరకు మైనర్లు లాగిన్ కాకుండా నిరోధించే బిల్లు తెచ్చింది. ఎవరైనా ఉల్లంఘిస్తే 32 మిలియన్ డాలర్ల వరకు జరిమానా విధిస్తుంది. జనవరి నుంచి ఈ నిషేధం అమలులోకి తెచ్చేందకు ప్రభుత్వం యత్నిస్తోంది.
స్పెయిన్
ఈ దేశంలో కూడా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిసేధించే బిల్లును గత జూన్‌లో ప్రవేశపెట్టింది. దీని అమలు, వయసు ధ్రువీకరణ వంటివాటిపై చర్చ జరుగుతోంది. ప్రభుత్వం విధి విధానాలను రూపొందించాల్సి ఉంది.
దక్షిణ కొరియా
ఇక దక్షిణ కొరియా కూడా 2011 లోనే ఇడ్రెల్లా చట్టం రూపొందించింది. దీని ప్రకారం 15 ఏళ్లకన్నా తక్కువ వయసువారు అర్ధరాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. ఒక దశాబ్దం తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉప సంహరించుకుంది. చాయిస్ పర్మిట్ వ్యవస్థ ఏర్పాటు చేసింది. పిల్లలు ఎప్పుడు ఆడుకోవాలో నిర్ణయించే అధికారం తల్లిదండ్రులకు ఇచ్చింది. అతికొద్ది మంది మాత్రమే ఈ వ్యవస్థను ఉపయోగించారు. దీంతో మళ్లీ 16 ఏళ్లలోపువారు సోషల్ మీడియా వినియోగించడంపై బిల్లును ఈ ఏడాది ఆగస్టులో ప్రతిపాదించింది. దీనిని యువజన సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.
ఫ్రాన్స్
ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశమైన ఫ్రాన్స్ కూడా గతేడాది సోషల్ మీడియా నిసేధ చట్టం చేసింది. 15 ఏళ్లకన్నా తక్కువ వయసు ఉన్నవారికి తల్లిదండ్రుల అనుమతి పొందాలని గత జూన్‌లో ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించే సోషల్ మీడియా నెట్‌వర్క్ ఆదాయంలో ఒక శాతం వరకు జరిమానా విధిస్తారు. ఈ చట్టం ఈయూ చట్టానికి అనుగుణంగా ఉందని యురోపియన్ కమిషన్ ఇంకా ధ్రువీకరించలేదు.
ఇటలీ
అతి చిన్న దేశమైన ఇటలీ 14 ఏళ్లలోపు వారు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించింది. తల్లిదండ్రుల అనుమతి ఉన్నవారే ఖాతా తెరవడానికి వీలు ఉంటుంది. అంతకన్నా ఎక్కవ వయసు ఉన్నవారిపై ఎలాంటి ఆంక్షలు లేవు.
జర్మనీ
అభివృద్ధి చెందిన మరో దేశం జర్మనీ కూడా 13 నుంచి 16 ఏళ్లలోపు పిల్లలు తల్లిదండ్రుల అనుమతి లేకుండా సోషల్ మీడియా వినియోగించడం నిసేధం. ఇంకా కఠిన చట్టాలు కూడా అమలు చేయాలని బాలల రక్షణ న్యాయవాదులు కోరుతున్నారు.
బెల్జియం..
ఈ దేశంలో 13 ఏళ్లు నిండిన పిల్లలకు మాత్రమే సోషల్ మీడియాలో అకౌంట్ ఉండాలని, అది తల్లిదండ్రుల అనుమతిలోనే చేయాలని చట్టం చేసింది. ఇది 2018 నుంచి అమలవుతోంది.
నార్వే
ఇక నార్వే లో కూడా సోషల్ నెట్‌వర్క్ ఉపయోగించడంపై నియంత్రణ ఉంది. ఈ దేశంలో 12 నుంచి 15 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. అయితే అమలు సక్రమంగా కావడం లేదు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తోంది.
నెదర్లాండ్స్
నెదర్లాండ్స్ కూడా సోషల్ మీడియాపై నియంత్రణ ఉంది. పిల్లల్లో ఏకాగ్రత పెంచడానికి ప్రభుత్వం తరగతి గదుల్లో వినియోగాన్ని నిషేధించింది. 2024 జనవరి నుంచి అమలు చేస్తోంది. అయితే డిజిటల్ పాఠాలు, వైద్య అవసరాలు, వైకల్యాలు ఉన్నవారికి మినహాయింపు ఉంది.
చైనా..
ఇక డ్రాగన్ కంట్రీ చైనా కూడా 2021 నుంచి మైనర్లు సోషల్ మీడియా యాక్సెస్‌ను నిషేధించింది. 14 ఏళ్లలోపు వారు టిక్‌టాక్ వినియోగించడం నిషేధం. రోజుకు 40 నిమిషాలు మాత్రమే వినియోగించాలి. అంతకన్నా ఎక్కువ వాడడం నిషేధం. ఆన్‌లైన్ గేమ్స్ ఎక్కువ సేపు ఆడే అవకాశం కూడా లేదు. ప్రపంచ దేశాలను సోషల్ మీడియా ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిస చేస్తున్న చైనా.. తమ పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం గమనార్హం.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Social media ban for children in these countries
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com